హరి గోవిందా హరి గోవిందా

వికీసోర్స్ నుండి
హరి గోవిందా (రాగం: ) (తాళం : )

హరి గోవిందా హరి గోవిందా
ఆనంద మానంద మాతుమకును
గురూపదేశాన వెదకగా వెదకగా
గరిమ నీయర్దము కంటి మోయయ్యా

సరి నన్యధర్మములు మానుమంటివి
శరణు నీకు జోరుమంటివి
దురితము లణచేనంటివి
పరగ మోక్షం బిచ్చేనంటివి
హరి నీవచనము అమోఘము
నరులము నే మిది నమ్మితిమి
పరమపద మిప్పుడే కలిగెను
ధర నొక్క మనసుతో నున్నారమయ్యా

యెందు నీవే గతి యనుమంటివి
యేచి యొక్కమాటే చాలునంటివి
యిందరి కభయ మిత్తునంటివి
యిది నీ కెపుడు వ్రతమంతివి
కందువ నీబిరుదుసత్యము
కానిమ్మని నేము చేపట్టితిమి
అంది నీవే మాకు దిక్కైతివి
అన్నిటా సంతోసాన నున్నారమయ్యా

అసమావినవా డెక్కు డంటివి
అతనివెంట దిరిగేనంటివి
భాసురపాదరేణువు నే నంటివి
పావన మయ్యేనని యంటివి
మోసల్నిది నీసంకల్పము
మొక్కే మిందులకు శ్రీ వేంకటేశా
ఆసపడ నితరుల నాకు నీవే యాస
యని నీదాసులమై యున్నారమయ్యా


Hari govimdaa (Raagam: ) (Taalam: )

Hari govimdaa hari govimdaa
Aanamda maanamda maatumakunu
Guroopadaesaana vedakagaa vedakagaa
Garima neeyardamu kamti moyayyaa

Sari nanyadharmamulu maanumamtivi
Saranu neeku jorumamtivi
Duritamu lanachaenamtivi
Paraga moksham bichchaenamtivi
Hari neevachanamu amoghamu
Narulamu nae midi nammitimi
Paramapada mippudae kaligenu
Dhara nokka manasuto nunnaaramayyaa

Yemdu neevae gati yanumamtivi
Yaechi yokkamaatae chaalunamtivi
Yimdari kabhaya mittunamtivi
Yidi nee kepudu vratamamtivi
Kamduva neebirudusatyamu
Kaanimmani naemu chaepattitimi
Amdi neevae maaku dikkaitivi
Annitaa samtosaana nunnaaramayyaa

Asamaavinavaa Dekku damtivi
Atanivemta dirigaenamtivi
Bhaasurapaadaraenuvu nae namtivi
Paavana mayyaenani yamtivi
Mosalnidi neesamkalpamu
Mokkae mimdulaku Sree vaemkataesaa
Aasapada nitarula naaku neevae yaasa
Yani needaasulamai yunnaaramayyaa


బయటి లింకులు[మార్చు]





అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |