హరివారమైతిమి మ మ్మవుగాదనగరాదు

వికీసోర్స్ నుండి
హరివారమైతిమి (రాగం:భూపాళం ) (తాళం : )

హరివారమైతిమి మ మ్మవుగాదనగరాదు
తరముగా దికను మాతప్పులు లోగొనరో

వెన్నడించిసూడువట్టేవిష్ణుమాయ నీకు నేము
యిన్నిటా బంతమిచ్చేము యింక గావరో
నన్నల ఎట్టిగొనేటిసంసారబంధము నీకు
మున్నె కిందువడితిమి ముంచి దయ జూడవో

ఆడించేటి కామక్రోదాదిజూజరులాల
వోడితిమి మీకు దొల్లె వొరయకురో
వీడనికర్మమ నీకు వెఱచి వూరి గఱచే
మీడనే ధర్మదార మా కికనైనా బట్టవో

దక్కగొన్న మాలోనితనుభోగములాల
మొక్కితిమి మాకు గొంతమొగమోడరో
యెక్కువ శ్రీవేంకటేశు డేలె మా జన్మములాల
గక్కున వేడుకొంటిమి కపటాలు మానరో


Harivaaramaitimi (Raagam: ) (Taalam: )

Harivaaramaitimi ma mmavugaadanagaraadu
Taramugaa dikanu maatappulu logonaro

Vennadimchisooduvattaevishnumaaya neeku naemu
Yinnitaa bamtamichchaemu yimka gaavaro
Nannala ettigonaetisamsaarabamdhamu neeku
Munne kimduvaditimi mumchi daya joodavo

Aadimchaeti kaamakrodaadijoojarulaala
Voditimi meeku dolle vorayakuro
Veedanikarmama neeku ve~rachi voori ga~rachae
Meedanae dharmadaara maa kikanainaa battavo

Dakkagonna maalonitanubhogamulaala
Mokkitimi maaku gomtamogamodaro
Yekkuva sreevaemkataesu Daele maa janmamulaala
Gakkuna vaedukomtimi kapataalu maanaro


బయటి లింకులు[మార్చు]





అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |














అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |