హరిదాసుడై మాయల

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
హరిదాసుడై మాయల (రాగం: ) (తాళం : )

ప|| హరిదాసుడై మాయల జిక్కువడితే | వెఱపించబోయి తనే వెఱచినట్లవును ||

చ|| శూరుడైనవాడేడజొచ్చిన నడ్డములేదు | ఆరీతిజ్ఞానినికి విధులడ్డములేవు |
కారణాన నప్పటినీ గలిగెనా నది మఱి | తేరిననీళ్ళ వండు దేరినట్లవును ||

చ|| సిరులరాజైతే నేమి సేసిన నేరమి లేదు | పరమాధికారియైతే బాపములేదు |
అరసి తనకుదానే అనుమానించుకొనెనా | తెరువే పో సుంకరి దెలిపినట్లవును ||

చ|| భూమెల్ల మేసినా నాబోతుకు బందె లేదు | నేమపుబ్రపన్నునికి నిందలేదు |
యీమేర శ్రీవేంకటేశ్వరును శరణుని | సోమరి కర్మమంటితే జుంటీగ కతవును ||


haridAsuDai (Raagam: ) (Taalam: )

pa|| haridAsuDai mAyala jikkuvaDitE | verxapiMcabOyi tanE verxacinaTlavunu ||

ca|| SUruDainavADEDajoccina naDDamulEdu | ArItij~jAniniki vidhulaDDamulEvu |
kAraNAna nappaTinI galigenA nadi marxi | tErinanILLa vaMDu dErinaTlavunu ||

ca|| sirularAjaitE nEmi sEsina nErami lEdu | paramAdhikAriyaitE bApamulEdu |
arasi tanakudAnE anumAniMcukonenA | teruvE pO suMkari delipinaTlavunu ||

ca|| BUmella mEsinA nAbOtuku baMde lEdu | nEmapubrapannuniki niMdalEdu |
yImEra SrIvEMkaTESvarunu SaraNuni | sOmari karmamaMTitE juMTIga katavunu ||


బయటి లింకులు[మార్చు]

అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |