సేస పెట్టవయ్యా
ప|| సేస పెట్టవయ్యా యిట్టి చెలిమీదను | ఆసలమీకిద్దరికి నన్నిటా నమరును ||
చ|| గ్రక్కన జెట్టవట్టితే కంకణము వంటిదాపె | దక్కి వురమెక్కితేను తాళి వంటిది |
మొక్కలాన దొడ దొక్కితే మొలనూలు వంటిది | అక్కజమై నీకు నాపె నన్నిటా నమరును ||
చ|| చేరి విన్నవించితే చెవి పోగుల వంటిది | నీరతికి వద్దనుంటే నీడవంటిది |
కోరి పానుపుపై పెండ్లి కూతురు వంటిదేపొద్దు | ఆరీతి ఆపెకు నీకు నన్నిటా నమరును ||
చ|| పాదాల సేవ సేసితే పావకోళ్ళ వంటిది | సోదించి చూచితేను సొమ్ము వంటిది |
యీదెస శ్రీవేంకటేశ యింతి నీవు గూడితివి | ఆదిగొని నీకు నాపె కన్నిటా నమరును ||
pa|| sEsa peTTavayyA yiTTi celimIdanu | AsalamIkiddariki nanniTA namarunu ||
ca|| grakkana jeTTavaTTitE kaMkaNamu vaMTidApe | dakki vuramekkitEnu tALi vaMTidi |
mokkalAna doDa dokkitE molanUlu vaMTidi | akkajamai nIku nApe nanniTA namarunu ||
ca|| cEri vinnaviMcitE cevi pOgula vaMTidi | nIratiki vaddanuMTE nIDavaMTidi |
kOri pAnupupai peMDli kUturu vaMTidEpoddu | ArIti Apeku nIku nanniTA namarunu ||
ca|| pAdAla sEva sEsitE pAvakOLLa vaMTidi | sOdiMci cUcitEnu sommu vaMTidi |
yIdesa SrIvEMkaTESa yiMti nIvu gUDitivi | Adigoni nIku nApe kanniTA namarunu ||
బయటి లింకులు
[మార్చు]
అన్నమయ్య పాటలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|