సిరుత నవ్వులవాడు
ప|| సిరుత నవ్వులవాడు సిన్నెకా వీడు | వెరపెరుగడు సూడవే సిన్నెకా ||
చ|| పొలసు మేనివాడు బోరవీపు వాడు | సెలసు మోరవాడు సిన్నెకా |
గొలుసుల వంకల కోరలతోబూమి | వెలిసినాడు సూడవే సిన్నెకా ||
చ|| మేటి కురుచవాడు మెడమీది గొడ్డలి | సీటకాలవాడు సిన్నెకా |
ఆటదానిబాసి అడవిలో రాకాశి | వేటలాడీ జూడవే సిన్నెకా ||
చ|| బింకపు మోతల పిల్లగోవివాడు | సింక సూపులవాడు సిన్నెకా |
కొంకక కలికియై కొసరి కూడె నన్ను | వేంకటేశుడు సూడవే సిన్నెకా ||
pa|| siruta navvulavADu sinnekA vIDu | veraperugaDu sUDavE sinnekA ||
ca|| polasu mEnivADu bOravIpu vADu | selasu mOravADu sinnekA |
golusula vaMkala kOralatObUmi | velisinADu sUDavE sinnekA ||
ca|| mETi kurucavADu meDamIdi goDDali | sITakAlavADu sinnekA |
ATadAnibAsi aDavilO rAkASi | vETalADI jUDavE sinnekA ||
ca|| biMkapu mOtala pillagOvivADu | siMka sUpulavADu sinnekA |
koMkaka kalikiyai kosari kUDe nannu | vEMkaTESuDu sUDavE sinnekA ||
బయటి లింకులు
[మార్చు]
అన్నమయ్య పాటలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|