Jump to content

సర్వజ్ఞత్వము

వికీసోర్స్ నుండి
సర్వజ్ఞత్వము (రాగం: ) (తాళం : )

ప|| సర్వజ్ఞత్వము వెదకగనొల్లను సందేహింగనొల్లను |
సర్వజ్ఞుండను నాచార్యుండే సర్వశేషమే నాజీవనము ||

చ|| యెఱగనొల్లము విజ్ఞానపుగతి యెఱుకలు నే మిటుసోదించి |
యెఱిగి యితరులను బోధించెదమనుయీపెద్దరికము నొల్లము |
యెఱిగేటివాడును యాచార్యుండే, యెఱుకయు సర్వేశ్వరుడే |
యెఱుకయు మఱపును మానివుండుటే యిదియేపో మావిజ్ఞానము ||

చ|| చదువగనొల్లము సకలశాస్త్రములు సారెకుసారెకుసోదించి |
చదివి పరులతో యుక్తివాదములు జగడము గెలువగనొల్లము |
చదివేటివాడును నాచార్యుండే, చదువును నాయంతర్యామే |
చదువుకు జదువమికి దొలగుటే నానాసాత్వికభావమే నా తెలివి ||

చ|| అన్నిటికిని నే నధికారిననెడియహంకారము నొల్లను |
కన్నులజూచుచు నందరిలో నే గాదని తొలగానొల్లను |
మన్నన శ్రీవేంకటేశ్వరుకరుణను మాయాచార్యుడే అధికారి
వున్నరీతినే అస్తినాస్తులకు నూరకుండుటే నాతలపు ||


sarvaj~jatvamu (Raagam: ) (Taalam: )

pa|| sarvaj~jatvamu vedakaganollanu saMdEhiMganollanu |
sarvaj~juMDanu nAcAryuMDE sarvaSEShamE nAjIvanamu ||

ca|| yerxaganollamu vij~jAnapugati yerxukalu nE miTusOdiMci |
yerxigi yitarulanu bOdhiMcedamanuyIpeddarikamu nollamu |
yerxigETivADunu yAcAryuMDE, yerxukayu sarvESvaruDE |
yerxukayu marxapunu mAnivuMDuTE yidiyEpO mAvij~jAnamu ||

ca|| caduvaganollamu sakalaSAstramulu sArekusArekusOdiMci |
cadivi parulatO yuktivAdamulu jagaDamu geluvaganollamu |
cadivETivADunu nAcAryuMDE, caduvunu nAyaMtaryAmE |
caduvuku jaduvamiki dolaguTE nAnAsAtvikaBAvamE nA telivi ||

ca|| anniTikini nE nadhikArinaneDiyahaMkAramu nollanu |
kannulajUcucu naMdarilO nE gAdani tolagAnollanu |
mannana SrIvEMkaTESvarukaruNanu mAyAcAryuDE adhikAri
vunnarItinE astinAstulaku nUrakuMDuTE nAtalapu ||


బయటి లింకులు

[మార్చు]




అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |