శ్రీవేంకటేశుడు

వికీసోర్స్ నుండి
శ్రీవేంకటేశుడు శ్రీపతియు (రాగం: ) (తాళం : )

ప|| శ్రీవేంకటేశుడు శ్రీపతియు నితడే | పావనపువైకుంఠపతియును నితడే ||

చ|| భాగవతములో జెప్పే బలరాముతీర్థయాత్ర- | నాగమోక్తమైనదైవ మాత డితడే |
బాగుగా బ్రహ్మాండపురాణపద్ధతియాత డితడే | యోగమై వామనపురాణోక్తదైవ మీతడే ||

చ|| వెలయ సప్తఋషులు వెదకి ప్రదక్షిణము- | లలర జేసినదేవు డాత డీతడే |
నెలవై కోనేటిపొంత నిత్యము గుమారస్వామి | కలిమి దపముసేసి కన్నదేవు డీతడే ||

చ|| యెక్కువై బ్రహ్మాదులు నెప్పుడు నింద్రాదులు | తక్కక కొలిచియున్న తత్త్వ మీతడే |
చక్క నారదాదులసంకీర్తనకు జొక్కి | నిక్కినశ్రీవేంకటాద్రినిలయుడు నీతడే ||


SrIvEMkaTESuDu SrIpatiyu (Raagam: ) (Taalam: )

pa|| SrIvEMkaTESuDu SrIpatiyu nitaDE | pAvanapuvaikuMThapatiyunu nitaDE ||

ca|| BAgavatamulO jeppE balarAmutIrthayAtra- | nAgamOktamainadaiva mAta DitaDE |
bAgugA brahmAMDapurANapaddhatiyAta DitaDE | yOgamai vAmanapurANOktadaiva mItaDE ||

ca|| velaya saptaRuShulu vedaki pradakShiNamu- | lalara jEsinadEvu DAta DItaDE |
nelavai kOnETipoMta nityamu gumArasvAmi | kalimi danamusEsi kannadEvu DItaDE ||

ca|| yekkuvai brahmAdulu neppuDu niMdrAdulu | takkaka koliciyunna tattva mItaDE |
cakka nAradAdulasaMkIrtanaku jokki | nikkinaSrIvEMkaTAdrinilayuDu nItaDE ||

బయటి లింకులు[మార్చు]

Sung by SP Bala Subramainam: https://www.youtube.com/watch?v=aY5StHX-nzo

Meaning from Samavedam Shanmukha Sharma: https://www.youtube.com/watch?v=-6VfJVFblng&list=PLhFZrcu-dWgk5LFJe5EtYUKTu54bLxYvC&index=190






అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |