శ్రీమన్నారాయణ
స్వరూపం
ప|| శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ | శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు ||
చ|| కమలాసతీ ముఖకమల కమలహిత | కమలప్రియ కమలేక్షణ | కమలాసనహిత గరుడగమన శ్రీ | కమలనాభ నీపదకమలమే శరణు ||
చ|| పరమయోగిజన భాగధేయ శ్రీ | పరమపూరుష పరాత్పర | పరమాత్మ పరమాణురూప శ్రీ | తిరువేంకటగిరి దేవ శరణు ||
బయటి లింకులు
[మార్చు]http://balantrapuvariblog.blogspot.in/2012/05/annamayya-samkirtanalu-adhyatmikam_14.html
| అన్నమయ్య పాటలు | |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
| |