శరణువేడెద
ప|| శరణువేడెద యజ్ఞసంభవ రామ |
అరసి రక్షించుమమ్ము అయోధ్యరామ ||
చ|| ధారుణిలో దశరథ తనయ రామ |
చేరిన అహల్యను రక్షించిన రామ |
వారిధి బంధన కపి వల్లభ రామ |
తారక బ్రహ్మమైన సీతా రామ ||
చ|| ఆదిత్య కులాంబుధి మృగాంక రామ|
హర కోదండ భంజనము చేకొనిన రామ |
వేద శాస్త్ర పురాణాది వినుత రామ |
ఆది గొన్నతాటక సంహార రామ ||
చ|| రావణుని భంజించిన రాఘవ రామ |
వావిరి విభీషణ వరద రామ |
సేవలనలమేల్మంగతో శ్రీవేంకటేశుడవై |
ఈవల దాసులనెల్ల ఏలినట్టి రామ ||
pa|| SaraNuvEDeda yaj~jasaMBava SrIrAma | arasi rakShiMcumu ayOdhyArAma ||
ca|| rAvaNanuni BaMjiMcina rAGava rAma | vAviri viBIShaNa varada SrIrAma |
sEvanalamElmaMgatO vEMkaTESuDai | Ivala dAsula ElinaTTi SrIrAma ||
ca|| dhAruNilO daSaratha tanaya rAma |cErina yahalyanu rakShiMcina rAma |
vAridhi baMdhana kapi vallaBa rAma | taraka brahmamaina sItApati rAma ||
ca|| Aditya kulAMbudhi mRugAMka rAma hara- | kOdaMDa BaMjanamu cEkonina rAma |
vEda SAstra purANAdi vinuta rAma | Adi gonnatATakA saMhAra rAma ||
బయటి లింకులు
[మార్చు]
అన్నమయ్య పాటలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|