Jump to content

వెఱతు వెఱతు

వికీసోర్స్ నుండి
వెఱతు వెఱతు (రాగం: ) (తాళం : )

ప|| వెఱతు వెఱతు నిండువేడుకపడ నిట్టి- | కుఱచబుద్ధుల నెట్టు గూడుదునయ్య ||

చ|| దేహమిచ్చినవాని దివిరి చంపెడువాడు | ద్రోహిగాక నేడు దొరయట |
ఆహికముగ నిట్టి అధమవ్రిత్తికి నే- | సాహసమున నెట్టు చాలుదునయ్య ||

చ|| తోడబుట్టినవాని తొడరి చంపెడువాడు | చూడ దుష్టుడుగాక సుకృతియట |
పాడైనయిటువంటి పాపబుద్ధులు సేసి | నీడనిలువ నెట్టు నేరుతునయ్య ||

చ|| కొడుకు నున్నతమతి గోరి చంపెడువాడు | కడుబాతకుడుగాక ఘనుడట |
కడలేనియిటువంటి కలుషవ్రిత్తికి నాత్మ | వొడబరపగ నెట్లోపుదునయ్య ||

చ|| తల్లి జంపెడువాడు తలప దుష్టుడుగాక | యెల్లవారలకెల్ల నెక్కుడట |
కల్లరియనుచు లోకము రోయుపని యిది | చెల్లబో నేనేమి సేయుదునయ్య ||

చ|| యింటివేలుపు వేంకటేశ్వరు దనవెంట- | వెంట దిప్పెడువాడు విభుడట |
దంటనై యాతనిదాసానుదాసుడై | వొంటినుండెద నేమి నొల్లనోయయ్య ||


verxatu verxatu (Raagam: ) (Taalam: )

pa|| verxatu verxatu niMDuvEDukapaDa niTTi- | kurxacabuddhula neTTu gUDudunayya ||

ca|| dEhamiccinavAni diviri caMpeDuvADu | drOhigAka nEDu dorayaTa |
Ahikamuga niTTi adhamavrittiki nE- | sAhasamuna neTTu cAludunayya ||

ca|| tODabuTTinavAni toDari caMpeDuvADu | cUDa duShTuDugAka sukRutiyaTa |
pADainayiTuvaMTi pApabuddhulu sEsi | nIDaniluva neTTu nErutunayya ||

ca|| koDuku nunnatamati gOri caMpeDuvADu | kaDubAtakuDugAka GanuDaTa |
kaDalEniyiTuvaMTi kaluShavrittiki nAtma | voDabarapaga neTlOpudunayya ||

ca|| talli jaMpeDuvADu talapa duShTuDugAka | yellavAralakella nekkuDaTa |
kallariyanucu lOkamu rOyupani yidi | cellabO nEnEmi sEyudunayya ||

ca|| yiMTivElupu vEMkaTESvaru danaveMTa- | veMTa dippeDuvADu viBuDaTa |
daMTanai yAtanidAsAnudAsuDai | voMTinuMDeda nEmi nollanOyayya ||


బయటి లింకులు

[మార్చు]




అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |