వినుడిదె రఘుపతి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
వినుడిదె రఘుపతి (రాగం: ) (తాళం : )

ప|| వినుడిదె రఘుపతి విజయములు | పనుపడి రాక్ష బాధలుడిగెను ||

చ|| కులగిరులదరెను కుంభినివడకెను | ఇల రాముడు రథమెక్కినను |
కలగె వారిధులు కంపించె జగములు | బలు విలునమ్ములు పట్టినను ||

చ|| పిడుగులు దొరిగెను పెనుగాలి విసరె | తొడిబడ బాణము దొడిగినను |
ముడివడె దిక్కులు మొగ్గె దిగ్గజములు | యెడవక రావణునేసినను ||

చ|| చుక్కలు దుల్లెను స్రుక్కె భూతములు | తొక్కి యసురతల దుంచినను |
గక్కున శ్రీ వేంకటగిరి నిలువగ | అక్కజమగు శుభమందరి కొదవె ||


vinuDide raGupati (Raagam: ) (Taalam: )

pa|| vinuDide raGupati vijayamulu | panupaDi rAkSha bAdhaluDigenu ||

ca|| kulagiruladarenu kuMBinivaDakenu | ila rAmuDu rathamekkinanu |
kalage vAridhulu kaMpiMce jagamulu | balu vilunammulu paTTinanu ||

ca|| piDugulu dorigenu penugAli visare | toDibaDa bANamu doDiginanu |
muDivaDe dikkulu mogge diggajamulu | yeDavaka rAvaNunEsinanu ||

ca|| cukkalu dullenu srukke BUtamulu | tokki yasuratala duMcinanu |
gakkuna SrI vEMkaTagiri niluvaga | akkajamagu SuBamaMdari kodave ||


బయటి లింకులు[మార్చు]

అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |