విచ్చలవిదై
Appearance
విచ్చలవిదై మీరు (రాగం: ) (తాళం : )
విచ్చలవిదై మీరు వినోదింతురుగాక
హెచ్చెను తమకములు ఇకనేల జాగులు ||
వేవేగ రమ్మనుచు వెలదిలేకలు వ్రాసి
పావురము మెడగట్టి పంపెనీకును
నీ వది చదువుకొని నెమ్మిబతికమ్మవెట్టి
యీవేళనే అంపితివి ఇకనేల జాగులు ||
కలికి నీరాకకి గాచుక వుందాననని
చిలుకచే విన్నపాలు చెప్పి పంపెను
మలసి నీవని విని మారుత్తరములు నేర్పి
యెలమితో నంపితివి ఇకనేల జాగులు ||
vichchalavidai (Raagam: ) (Taalam: )
vichchalavidai mIru vinOdiMturugAka
hechchenu tamakamulu ikanEla jAgulu ||
vEvEga rammanuchu veladilEkalu vrAsi
pAvuramu meDagaTTi paMpenIkunu
nI vadi chaduvukoni nemmibatikammaveTTi
yIvELanE aMpitivi ikanEla jAgulu ||
kaliki nIrAkaki gAchuka vuMdAnanani
chilukachE vinnapAlu cheppi paMpenu
malasi nIvani vini mAruttaramulu nErpi
yelamitO naMpitivi ikanEla jAgulu ||
బయటి లింకులు
[మార్చు]
అన్నమయ్య పాటలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|