వాదులేల చదువులు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
వాదులేల చదువులు (రాగం: లలిత) (తాళం : )

వాదులేల చదువులు వారు చెప్పినవేకావా
వాదులేల మీమాట వారికంటే నెక్కుడా!!

నాలుగువేదాలబ్రహ్మ నలి నెవ్వనిసుతుడు
వాలినపురాణాలవ్యాసుడెవ్వని దాసుడు
లీల రామాయణపువాల్మీకివసిష్టులు
ఆలకిం చెవ్వని గొల్చి రాతడే పోదేవుడు !!వాదు!!

భారత మెవ్వనికధ భాగవతము చెప్పిన
ధీరుదైన శుకుడు యేదేవుని కింకరుడు
సారపుశాస్త్రాలు చూచిసన్యసించి నుడిగేటి
నారాయణనామపునాధుడేపో దేవుడు !!వాదు!!

విష్ణువాగ్యయని చెప్పేవిది సంకల్ప మేడది
విష్ణుమాయయని చెప్పే విశ్వమంతా నెవ్వనిది
"విష్ణుమయం సర్వ" నునేవేవేదవాక్య మెవ్వనిది
విష్ణువు శ్రీవేంకటాద్రి విభుడే ఆదేవుడు !!వాదు!!


vAdulEla caduvulu (Raagam: lalita) (Taalam: )

vAdulEla caduvulu vAru ceppinavEkAvA
vAdulEla mImATa vArikaMTE nekkuDA!!

nAluguvEdAlabrahma nali nevvanisutuDu
vAlinapurANAlavyAsuDevvani dAsuDu
lIla rAmAyaNapuvAlmIkivasishTulu
AlakiM cevvani golchi rAtaDE pOdEvuDu !!vAdu!!

bhArata mevvanikadha bhAgavatamu ceppina
dhIrudaina SukuDu yEdEvuni kiMkaruDu
sArapuSAstrAlu cUcisanyasiMci nuDigETi
nArAyaNanAmapunAdhuDEpO dEvuDu !!vAdu!!

vishNuvAgyayani ceppEvidi saMkalpa mEDadi
vishNumAyayani ceppE viSvamaMtA nevvanidi
"vishNumayaM sarva" nunEvEvEdavAkya mevvanidi
vishNuvu SrIvEMkaTAdri vibhuDE AdEvuDu !!vAdu!!


తాత్పర్యము[మార్చు]

ఎవరిని సేవించి తరించాలి ! అన్న విషయంలో ఎన్నో వాదాలున్నాయి. ఈ విషయంలో బ్రహ్మాది దేవతలు మరియు వేదాలు మనకు ఆనాడే బోధించియుండగా, మన మాటలు, నిర్ణయాలు వారికన్నా ఎక్కువ కాదు కదా.

సమస్త వేదాలను నిరంతరం పఠించే బ్రహ్మ ఏ దేవుని కుమారుడో, సకల పురాణాల కర్తయైన వ్యాసుడు ఏ దేవుని దాసుడో, రామాయణ కర్తలైన వాల్మీకి వసిష్ఠులు ఏ దేవుని పరమపురుషునిగా భావించారో అతడే దేవుడు. భారతభాగవతాలు ఏ దేవుని కథను చెప్పినవి. శ్రీ శుకుడు ఏ దేవుని దాసుడు. సమస్తము సన్యసించిన వారు కూడా నిరంతరం ఏ నామాన్ని జపిస్తారో ఆ దేవుడే నిజమైన దేవుడు.

యజ్న యాగాది సకల విధుల సంకల్పములలో ఏ దేవుని యాజ్నగా మనం సంకల్పిస్తున్నాము. ఈ విశ్వమును ఏ దేవుని పేరుతో విష్ణుమాయ అని భావిస్తున్నాము. సర్వం విష్ణుమయం అన్న వేదవాక్యం ఏ దేవుని గురించి చెప్పబడినది. అటువంటి దేవుడు శ్రీమహావిష్ణువే శ్రీ వేంకటేశ్వరుడు కదా ! ఇన్ని వాదాలెందుకు, అతడే పరబ్రహ్మ స్వరూపం. అతనిని ఆరాధించి తరించుదాం.

బయటి లింకులు[మార్చు]

  • అన్నమయ్య పదసౌరభం, నాలుగవ భాగం, డా. నేదునూరి కృష్ణమూర్తి, నాద సుధా తరంగిణి, విశాఖపట్నం, 2010.అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |