వందే వాసుదేవం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
వందే వాసుదేవం (రాగం: ) (తాళం : )

ప|| వందే వాసుదేవం | బృందారకాధీశ వందిత పదాబ్జం ||

చ|| ఇందీవరశ్యామ మిందిరాకుచతటీ- | చందనాంకిత లసత్చారు దేహం |
మందార మాలికామకుట సంశోభితం | కందర్పజనక మరవిందనాభం ||

చ|| ధగధగ కౌస్తుభ ధరణ వక్షస్థలం | ఖగరాజ వాహనం కమలనయనం |
నిగమాదిసేవితం నిజరూపశేషప- | న్నగరాజ శాయినం ఘననివాసం ||

చ|| కరిపురనాథసంరక్షణే తత్పరం | కరిరాజవరద సంగతకరాబ్జం |
సరసీరుహాననం చక్రవిభ్రాజితం | తిరు వేంకటాచలాధీశం భజే ||


vaMdE vAsudEvaM (Raagam: ) (Taalam: )

pa|| vaMdE vAsudEvaM | bRuMdArakAdhISa vaMdita padAbjaM ||

ca|| iMdIvaraSyAma miMdirAkucataTI- | caMdanAMkita lasatcAru dEhaM |
maMdAra mAlikAmakuTa saMSOBitaM | kaMdarpajanaka maraviMdanABaM ||

ca|| dhagadhaga kaustuBa dharaNa vakShasthalaM | KagarAja vAhanaM kamalanayanaM |
nigamAdisEvitaM nijarUpaSEShapa- | nnagarAja SAyinaM GananivAsaM ||

ca|| karipuranAthasaMrakShaNE tatparaM | karirAjavarada saMgatakarAbjaM |
sarasIruhAnanaM cakraviBrAjitaM | tiru vEMkaTAcalAdhISaM BajE ||


బయటి లింకులు[మార్చు]

VandheVasudevam_MambalamSis

VandeVasudevam_BombaySis


అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |