రంగ రంగ
రంగ రంగ రంగ పతి రంగనాధా నీ
సింగారాలె తరచాయ శ్రీ రంగ నాధా
పట్ట పగలే మాతో పలుచగ నవ్వేవు
ఒట్టులేల పెట్టుకొననేవో రంగనాధా
వట్టి మాకు లిగిరించు వడి నీ మాటలు వింటె
రట్టడివి మేరమీరకు రంగనాధా
కావేటి రంగమున కాంతపై పాదాలు సాచి
రావు పోవు ఎక్కడికి రంగ నాధా
శ్రీ వేంకటాద్రి మీద చేరి నను కూడితివి
ఏవల చూచిన నీవేయిట రంగనాధా
రంగనాధా శ్రీ రంగనాధా
ranga ranga ranga pati ranganaadhaa nee
singaaraale tarachaaya Sri ranga naadhaa
paTTa pagalE maatO paluchaga navvEvu
oTTulEla pettukonevo
Taligirinchu vaDi nee maaTalu vinTe
raTTaDivi mErameeraku ranganaadhaa
ranganaadhaa SrI ranganaadhaa
kaavETi rangamuna kaantapai paadaalu saachi
raavu pOvu ekkaDiki ranga naadhaa
SrI vEnkaTAdri meeda chEri nanu kUDitivi
Evala chUchina neevEyiTa ranganaadhaa
ranganaadhaa SrI ranganaadhaa
బయటి లింకులు
[మార్చు]రాజపు నీకెదురేది రామచంద్ర రాజీవనయనుడ రామచంద్ర
వెట్టిగాదు నీవలపు వింటి నారికి( దెచ్చితివి ఱట్టుసేయ పనిలేదు యిట్టె రామచంద్ర గుట్టుతోడ జలనిధిపై గొండలు ముడివేసితి- వెట్టు మఱవగవచ్చు నివి రామచంద్ర
బతి(లి)మితోడుత( బైడిపతిమె గైకొటివి రతికెక్క నీచలము రామచంద్ర మితిమీరి జవ్వనము మీదుకట్టితివి నాకై యితరు లేమనగల రిక రామచంద్ర
నావంటిసీతను నాగేటికొన( దెచ్చితి రావాడితమకముతో రామచంద్ర యీవేళ శ్రీవేంకటాద్రి నిరవై నన్ను( గూడితి చేవదేర గండికోట శ్రీరామచంద్ర
rAjapu nIkedurEdi rAmachaMdra rAjIvanayanuDa rAmachaMdra
veTTigAdu nIValapu viMTi nAriki( dechchitivi ~raTTusEya panilEdu yiTTe rAmachaMdra gu(ga)TTutODa jalanidhipai goMDalu muDivEsiti- veTTu ma~ravagavachchu nivi rAmachaMdra
bati(li)mitODuta( baiDipatime gaikoTivi ratikekka nIchalamu rAmachaMdra mitimIri javvanamu mIdukaTTitivi nAkai yitaru lEmanagala rika rAmachaMdra
nAvaMTisItanu nAgETikona( dechchiti rAvADitamakamutO rAmachaMdra yIvELa SrIvEMkaTAdri niravai nannu( gUDiti chEvadEra gaMDikOTa SrIrAmachaMdra
/2011/02/annamayya-samkirtanalurama_25.html
అన్నమయ్య పాటలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|