Jump to content

మూల మూల నమ్ముడు

వికీసోర్స్ నుండి
మూల మూల నమ్ముడు (రాగం: ) (తాళం : )

ప : మూల మూల నమ్ముడు చల్ల - ఇది
రేలు పగలు కొనరే చల్ల

చ : పిక్కటిల్లు చన్నుల గుబ్బెత ఒక్కతి - కడు
చక్కనిది చిలికిన చల్ల
అక్కున చెమటగార నమ్మీని - ఇది
యెక్కడ పుట్టదు కొనరే చల్ల

చ : వడ చల్లుమేని జవ్వని ఒక్కతి - కడు
జడియుచు చిలికిన చల్ల
తడబడు కమ్మని తావులది - మీ
రెడయ కిపుడు కొనరే చల్ల

చ : అంకుల కరముల వొయ్యారొక్కతి - కడు
జంకెనల చిలికిన చల్ల
వేంకటగిరిపతి వేడుకది - ఇది
ఇంకా నమ్మీ కొనరే చల్ల


mUla mUla nammuDu (Raagam: ) (Taalam: )

pa : mUla mUla nammuDu calla - idi
rElu pagalu konarE calla

ca : pikkaTillu cannula gubbeta okkati - kaDu
cakkanidi cilikina calla
akkuna cemaTagAra nammIni - idi
yekkaDa puTTadu konarE calla

ca : vaDa callumEni javvani okkati - kaDu
jaDiyucu cilikina calla
taDabaDu kammani tAvuladi - mI
reDaya kipuDu konarE calla

ca : ankula karamula voyyArokkati - kaDu
jankenala cilikina calla
vEnkaTagiripati vEDukadi - idi
inkA nammI konarE calla


బయటి లింకులు

[మార్చు]

http://cid-272cd1502e1bbc2c.office.live.com/self.aspx/Annamacharya/08%20Moola%20Moola%20Nammadu.m4a





అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |