Jump to content

నూతులు దవ్వగబోతే బేతాళములు పుట్టె

వికీసోర్స్ నుండి
నూతులు దవ్వగబోతే (రాగం:సామంతం ) (తాళం : )

నూతులు దవ్వగబోతే బేతాళములు పుట్టె
కాతాళపులోకులాల కంటిరా యీసుద్దులు

మీఱినపుత్రకామేష్టి మించి లంకకు బై వచ్చె
ఆఱడి రామావతార మసురబాధ
తూఱి సీతపెండ్లి హరుదొడ్డ వింటిపండుగాయ
పాఱి పాఱి నమ్మనెటువలెవచ్చు వీరిని

చూడ కేకయరాజ్యము చుప్పనాతిపాపమాయ
వేడుక మాయామృగమువేటాయను
వాడికె సుగ్రీవుమేలు వాలికి గండాన వచ్చె
యీడుగానిరాచపుట్టు యెట్టు నమ్మవచ్చును

వుమ్మడి గోతులకూట ముదధికి గట్లు వచ్చె
తమ్మువిబుద్ది రావణుతల వోయను
పమ్మి శ్రీ వేంకటేశునిపట్టానకే యింతానాయ
యిమ్ముల నిట్టిదేవర నెట్టు నమ్మవచ్చును


Nootulu davvagabotae (Raagam:Saamamtam ) (Taalam: )

Nootulu davvagabotae baetaalamulu putte
Kaataalapulokulaala kamtiraa yeesuddulu

Mee~rinaputrakaamaeshti mimchi lamkaku bai vachche
Aa~radi raamaavataara masurabaadha
Too~ri seetapemdli harudodda vimtipamdugaaya
Paa~ri paa~ri nammanetuvalevachchu veerini

Chooda kaekayaraajyamu chuppanaatipaapamaaya
Vaeduka maayaamrgamuvaetaayanu
Vaadike sugreevumaelu vaaliki gamdaana vachche
Yeedugaaniraachaputtu yettu nammavachchunu

Vummadi gotulakoota mudadhiki gatlu vachche
Tammuvibuddi raavanutala voyanu
Pammi Sree vaemkataesunipattaanakae yimtaanaaya
Yimmula nittidaevara nettu nammavachchunu


బయటి లింకులు

[మార్చు]

నేరిచి బ్రతికెవారు నీదాసులు నేరమి బాసినవారు నీదాసులు


కామముక్రోధము రెంటిగాదని విడిచిమంచి- నీమము పట్టినవారె నీదాసులు దోమటి పాపపుణ్యాల దుంచివేసి చూడగానె నీమాయ గెలిచినారు నీదాసులు


కికిరించిన ఆశలకిందవేసి మోక్షము నిక్కినిక్కి చూచెవారు నీదాసులు వెక్కసపు భక్తితోడ వెరపు మరపు లేక నెక్కొన్న మహిమవారు నీదాసులు


అట్టెవేదశాస్త్రముల అర్ధము తేటపరచి నెట్టుకొని మించినారు నీదాసులు యిట్టె శ్రీవేంకటేశ యితరమార్గములెల్ల నెట్టువడతోసినారు నీదాసులు


nErici bratikevaaru nIdAsulu nErami baasinavaaru nIdaasulu


kaamamukrOdhamu reMTigaadani viDicimaMci nImamu paTTinavaare nIdaasulu dOmaTi paapapuNyaala duMcivEsi cUDagaane nImaaya gelicinaaru nIdaasulu


kikiriMcina aaSalakiMdavEsi mOkShamu nikkinikki cUcevaaru nIdaasulu vekkasapu bhaktitODa verapu marapu lEka nekkonna mahimavaaru nIdaasulu


aTTevEdaSaastramula ardhamu tETaparaci neTTukoni miMcinaaru nIdAsulu yiTTe SrIvEMkaTESa yitaramaargamulella neTTuvaDatOsinaaru nIdaasulu

/2011/01/annamayya-samkirtanalutatwamulu.html




అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |