నిగమనిగమాంతవర్ణిత

వికీసోర్స్ నుండి
నిగమనిగమాంతవర్ణిత (రాగం: ) (తాళం : )

ప|| నిగమనిగమాంతవర్ణిత మనోహర రూప- | నగరాజధరుడా శ్రీనారాయణా ||

చ|| దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యం బియ్య- | నోపకరా నన్ను నొడబరపుచు |
పైపైని సంసారబంధముల గట్టేవు | నాపలుకు చెల్లునా నారాయణా ||

చ|| చికాకుపడిన నా చిత్తశాంతము సేయ- | లేకకా నీవు బహులీల నన్ను |
కాకుసేసెదవు బహుకర్మల బడువారు | నాకొలదివారలా నారాయణా ||

చ|| వివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను | భవసాగరముల నడబడ జేతురా |
దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ | నవనీత చోర శ్రీనారాయణా ||


nigamanigamAMtavarNita (Raagam: ) (Taalam: )

pa|| nigamanigamAMtavarNita manOhara rUpa- | nagarAjadharuDa SrInArayaNA ||

ca|| dIpiMcu vairAgyadivya sauKyaM biyya- | nOpakarA nannu noDabarapucu |
paipaine saMsArabaMdhamula gaTTEvu | nApaluku cellunA nArAyaNA ||

ca|| cikAkupaDina nA cittaSAMtamu sEya- | lEkakA nIvu bahulIla nannu |
kAkusEsedavu bahukarmala baDuvAru | nAkoladivAralA nArAyaNA ||

ca|| vivividha nirbaMdhamula veDaladrOyaka nannu | BavasAgaramula naDabaDa jEturA |
divijEMdravaMdya SrI tiruvEMkaTAdrISa | navanIta cOra SrInArAyaNA ||

బయటి లింకులు[మార్చు]





అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |