Jump to content

జో అచ్యుతానంద జోజో ముకుంద

వికీసోర్స్ నుండి
(జోవచ్యుతానంద జోజో ముకుంద నుండి మళ్ళించబడింది)
జోఅచ్యుతానంద జోజో (రాగం: నవరోజు) (తాళం: ఖండచాపు)

జోఅచ్యుతానంద జోజో ముకుంద రావె పరమానంద రామ గోవింద

నందు నింటను జేరి నయము మీఱంగ చంద్రవదనలు నీకు సేవ చేయంగ నందముగ వారిండ్ల నాడుచుండంగ మందలకు దొంగ మా ముద్దురంగ

పాలవారాశిలో పవళించినావు బాలుగా మునుల కభయమిచ్చినావు మేలుగా వసుదేవు కుదయించినావు బాలుడై యుండి గోపాలుడైనావు

అంగజుని గన్న మా యన్న యిటు రారా బంగారు గిన్నెలో పాలు పోసేరా దొంగ నీవని సతులు గొంకుచున్నారా ముంగిట నాడరా మోహనాకార

హంగుగా తాళ్ళపా కన్నయ్య చాల శృంగార రచనగా చెప్పెనీ జోల సంగతిగ సకల సంపదల నీవేళ మంగళము తిరుపట్ల మదనగోపాల

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

జోఅచ్యుతానంద






అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |