చూడరమ్మ సతులారా
ప|| చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ |
కూడున్నది పతి చూడికుడుత నాంచారి ||
సోబానే సోబానే సోబానే సోబానే
చ|| శ్రీమహాలక్ష్మియట సింగారాలకేమరుదు |
కాముని తల్లియట చక్కదనాలకేమరుదు |
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు |
కోమలాంగి ఈ చూడికుడుత నాంచారి || "చూడరమ్మ"
చ|| కలశాబ్ధి కూతురట గంభీరాలకేమరుదు |
తలపలోక మాతయట దయ మరియేమరుదు |
జలజనివాసినియట చల్లదనమేమరుదు |
కొలదిమీర ఈ చూడికుడుత నాంచారి || "చూడరమ్మ"
చ|| అమరవందితయట అట్టే మహిమయేమరుదు |
అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు |
తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె |
కొమెర వయస్సు ఈ చూడికుడుత నాంచారి || "చూడరమ్మ"
pa|| cUDaramma satulAla sObAna pADaramma |
kUDunnadi pati cUDikuDuta nAMcAri ||
Sobane sobane sobane sobane
ca|| SrImahAlakShmiyaTa siMgArAlakEmarudu |
kAmuni talliyaTa cakkadanAlakEmarudu |
sOmuni tObuTTuvaTa soMpukaLalakEmarudu |
kOmalAMgi I cUDikuDuta nAMcAri ||
ca|| kalaSAbdhi kUturaTa gaMBIrAlakEmarudu |
talapalOka mAtayaTa daya mariyEmarudu |
jalajanivAsiniyaTa calladanamEmarudu |
koladimIra I cUDikuDuta nAMcAri ||
ca|| amaravaMditayaTa aTTI mahimayEmarudu |
amRutamu cuTTamaTa AnaMdAlakEmarudu |
tamitO SrIvEMkaTESu dAne vacci peMDlADe |
kaumera vayassu I cUDikuDuta nAMcAri ||
బయటి లింకులు
[మార్చు]
అన్నమయ్య పాటలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|