ఏమైనా నను

వికీసోర్స్ నుండి
ఏమైనా నను (రాగం: ) (తాళం : )

ఏమైనా నను యెదురాడనేను
దీమసంబుతో దెలిసితి నేను ||

యెక్కుడు మాట నేనేమని యాడిన
పెక్కసురాలని విసుగుదువు
యెక్కుచు నీ పాదములు చూచుక ఇటు
వొక్కట నూరకయుండెద నేను ||

పంతంబున నే బైకొని నవ్విన
అంతరట్టదని యాడుదువు
చెంత నూడిగముసేసుక నీ కిట్టి
చింతదీర కడు చెలగెద నేను ||

అలమి నిన్నురతి నలయించినను
బలిమితోదిదని పలుకుదువు
యెలమిని శ్రీవేంకటేశ్వర కూడితి
మొలగినట్లనే మెచ్చెద వేను ||


EmainA nanu (Raagam: ) (Taalam: )

EmainA nanu yedurADanEnu
dImasaMbutO delisiti nEnu ||

yekkuDu mATa nEnEmani yADina
pekkasurAlani visuguduvu
yekkuchu nI pAdamulu chUchuka iTu
vokkaTa nUrakayuMDeda nEnu ||

paMtaMbuna nE baikoni navvina
aMtaraTTadani yADuduvu
cheMta nUDigamusEsuka nI kiTTi
chiMtadIra kaDu chelageda nEnu ||

alami ninnurati nalayiMchinanu
balimitOdidani palukuduvu
yelamini SrIvEMkaTESvara kUDiti
molaginaTlanE mechcheda vEnu ||


బయటి లింకులు[మార్చు]




అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


"https://te.wikisource.org/w/index.php?title=ఏమైనా_నను&oldid=13823" నుండి వెలికితీశారు