ఏది నిజంబని యెటువలె నమ్ముదు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఏది నిజంబని యెటువల (రాగం: బౌళి) (తాళం : )

ఏది నిజంబని యెటువలె నమ్ముదు
పోది తోడ నను బోధింపవే

సత్తు నసత్తని సర్వము నీవని
చిత్తగించి శ్రుతి చెప్పెడిని
వుత్తమమధ్యమ మొగి గలదని మరి
యిత్తల శాస్త్రము లేర్పరచీని ||ఏది||

నానారూపులు నరహరి నీపని
పూనినవిధు లిటు పొగడెడిని
మానక హేయము మరి వుపాధేయము
కానవచ్చి యిల గలిగియున్నవి ||ఏది||

భావాభావము పరమము నీవని
దైవజ్ఞులు నిను దలచెదరు
శ్రీవేంకటగిరి జెలగిననీవే
తావుగ మదిలో దగిలితివి ||ఏది||


Aedi nijambani (Raagam: Bauli) (Taalam: )

Aedi nijambani yetuvale nammudu
Podi toda nanu bodhimpavae

Sattu nasattani sarvamu neevani
Chittagimchi Sruti cheppedini
Vuttamamadhyama mogi galadani mari
Yittala Saastramu laerparacheeni ||Aedi||

Naanaaroopulu narahari neepani
Pooninavidhu litu pogadedini
Maanaka haeyamu mari vupaadhaeyamu
Kaanavachchi yila galigiyunnavi ||Aedi||

Bhaavaabhaavamu paramamu neevani
Daivaj~nulu ninu dalachedaru
Sreevaemkatagiri jelaginaneevae
Taavuga madilo dagilitivi ||Aedi||


తాత్పర్యము[మార్చు]

ప్రపంచంలో పరస్పర విరుద్ధములైన విషయాలు చాలా కనిపిస్తున్నవి. ఒక సత్యమైనది మరొకటి అసత్యమైనది అని వేదం వివరిస్తూనే సర్వమూ నీవే అని చెబుతున్నది. వేదాలను వ్యాఖ్యానించిన శాస్త్రాలే సర్వమూ నీవెయైనా ఉత్తమ, మధ్యమాలంటూ కొన్ని అంతరాలను చెబుతున్నవి. జగత్తులోని అన్ని రూపాలూ నీవేనని బోధిస్తున్న వేదాలే - కొన్నింటిని గ్రహింపవచ్చునని, కొన్నిటిని వదలివేయమని చెబుతున్నవి. భావించగలిగినది, భావనకు అతీతమైనది అయిన పరమము నీవేయని నీ తత్త్వము నెరిగినవారు చెబుతున్నారు.

ఎవరు ఏమన్నా శ్రీ వేంకటేశ్వరా వేంకటగిరిని ప్రకాశించే నీవే సత్యము. అట్టి నీవే నా మదిలో శాశ్వతముగా నిలచియున్నావు; అందువలన నేను ధన్యుడను.

బయటి లింకులు[మార్చు]

  • అన్నమయ్య పదసౌరభం, నాలుగవ భాగం, డా. నేదునూరి కృష్ణమూర్తి, నాద సుధా తరంగిణి, విశాఖపట్నం, 2010.


అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |