ఎదుట నెవ్వరు లేరు యింతా

వికీసోర్స్ నుండి
ఎదుట నెవ్వరు (రాగం: ) (తాళం : )

ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే
వదలక హరిదాసవర్గమైనవారికి ||

వుంచిన నారాయణమూర్తులే యీజగమెల్ల
అంచితనామములే యీయక్షరాలెల్లా
పంచుకొన్న శ్రీహరిప్రసాద మీరుచులెల్లా
తెంచివేసి మేలు దా దెలిసేటివారికి ||

చేరి పారేటినదులు శ్రీపాదతీర్థమే
భారపుయీ భూమితని పాదరేణువే
సారపుగర్మములు కేశవుని కైంకర్యములే
ధీరులై వివేకించి తెలిసేటివారికి ||

చిత్తములో భావమెల్ల శ్రీవేంకటేశుడే
హత్తినప్రకృతి యెల్లా నాతనిమాయే
మత్తిలి యీతనికంటే మరి లేదితరములు
తిత్తిదేహపుబ్రదుకు తెలిసేటివారికి ||


eduTa nevvaru (Raagam: ) (Taalam: )

eduTa nevvaru lEru yiMtA viShNumayamE
vadalaka haridAsavargamainavAriki

muMcina nArAyaNamUrtulE yIjagamella
aMcitanAmamulE yIyakSharAlellA
paMcukonna SrIhariprasAda mIruculellA
teMcivEsi mElu dA delisETivAriki

cEri pArETinadulu SrIpAdatIrthamE
BArapuyI BUmitani pAdarENuvE
sArapugarmamulu kESavuni kaiMkaryamulE
dhIrulai vivEkiMci telisETivAriki

cittamulO BAvamellA SrIvEMkaTESuDE
hattinaprakRuti yellA nAtanimAyE
mattili yItanikaMTE mari lEditaramulu
tittidEhapubraduku telisETivAriki

బయటి లింకులు[మార్చు]





అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |