ఇతర దేవతల

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఇతర దేవతల (రాగం: ) (తాళం : )

ఇతర దేవతల కిదిగలదా
ప్రతివేరి నీ ప్రభావమునకు ||

రతిరాజ జనక రవి చంద్ర నయన
అతిశయ శ్రీ వత్సాంకుడవు
పతగేంద్ర గమన పద్మావతి పతి
మతి నిను తలచిన మనోహరము ||

ఘన కిరీటధర కనకాంబర పా
వన క్షీరాంబుధి వాసుడవు
వనజ చక్రధర వసుధ వల్లభ
నిను పేరుకొనిన నిర్మలము ||

దేవ పితామహ త్రివిక్రమ హరి
జీవాంతరాత్మక చిన్మయుడా
శ్రీ వేంకటేశ్వర శ్రీకర గుణనిధి
నీవార మనుటే నిజ సుఖము ||


itara dEvatala (Raagam: ) (Taalam: )


itara dEvatala kidigaladA
prativEri nI praBAvamunaku

ratirAja janaka ravi caMdra nayana
atiSaya SrI vatsAMkuDavu
patagEMdra gamana padmAvati pati
mati ninu talacina manOharamu

Gana kirITadhara kanakAMbara pA
vana kShIrAMbudhi vAsuDavu
vanaja cakradhara vasudha vallaBa
ninu pErukonina nirmalamu

dEva pitAmaha trivikrama hari
jIvAMtarAtmaka cinmayuDA
SrI vEMkaTESvara SrIkara guNanidhi
nIvAra manuTE nija suKamu


బయటి లింకులు[మార్చు]

అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


"https://te.wikisource.org/w/index.php?title=ఇతర_దేవతల&oldid=62251" నుండి వెలికితీశారు