Jump to content

ఆరగించి కూచున్నాడు

వికీసోర్స్ నుండి
ఆరగించి కూచున్నాడల్లవాడె(రాగం: మాళవి) (తాళం : ఆది )

ఆరగించి కూచున్నా డల్లవాడె
చేరువనే చూడరె లక్ష్మీనారసింహుడు॥

ఇందిరను తొడమీద నిడుకొని కొలువిచ్చీ
అందపు నవ్వులు చల్లీ నల్లవాడె
చెందిన మాణికముల శేషుని పడగమీద
చెంది వరాలిచ్చీ లక్ష్మీనారసింహుడు॥

బంగారు మేడలోన పచ్చల గద్దియల మీద
అంగనల ఆట చూచీ నల్లవాడె
రంగగు సొమ్ముల తోడ రాజసపు విభవాల
చెంగట నున్నాడు లక్ష్మీనారసింగుడు॥

పెండెపు పాదము చాచిపెనచి ఒక పాదము
అండనే పూజలుగొనీ నల్లవాడె
కొండల శ్రీ వేంకటాద్రి కోరి అహోబలమున
మెండుగాను మెరసీ లక్ష్మీ నారసింగుడు॥


Aaragimchi koochunnaa (Raagam: ) (Taalam: )

Aaragimchi koochunnaa dallavaade
Cheruvane choodare lakshmeenaarasimhudu

Imdiranu todameeda nidukoni koluvichchee
Amdapu navvulu challee nallavaade
Chemdina maanikamula Seshuni padagameeda
Chemdi varaalichchee lakshmeenaarasimhudu

Bamgaaru medalona pachchala gaddiyala meeda
Amganala aata choochee nallavaade
Ramgagu sommula toda raajasapu vibhavaala
Chemgata nunnaadu lakshmeenaarasimgudu

Pemdepu paadamu chaachipenachi oka paadamu
Amdane poojalugonee nallavaade
Komdala Sree venkataadri kori ahobalamuna
Memdugaanu merasee lakshmee naarasimgudu

బయటి లింకులు

[మార్చు]





ఆరగించి = భోజనం చేసి
కూచున్నా డల్లవాడె = కూచున్నాడు + అల్లవాడె

కూచున్నాడు = కూర్చున్నాడు, ఆసీనుడైనాడు
అల్లవాడె = అదిగో వాడె


చేరువనే = దగ్గరలోనే, ప్రక్కనే
చూడరె = చూడండి
లక్ష్మీనారసింహుడు = లక్ష్మీ నరసింహుడు



ఇందిరను = లక్ష్మీ దేవిని
తొడమీద = తొడమీద
నిడుకొని = ఉంచుకొని
కొలువిచ్చీ = దర్శనమిచ్చీ,


అందపు = అందమైన
నవ్వులు = నవ్వులు
చల్లీ నల్లవాడె = చల్లిన + అల్లవాడె

చల్లిన = చల్లిన
అల్లవాడె = అదిగో వాడె

<The meaning of the following two lines is not clear to me >
చెందిన మాణికముల శేషుని పడగమీద
చెంది వరాలిచ్చీ లక్ష్మీనారసింహుడు॥


బంగారు మేడలోన = బంగారపు మేడలో
పచ్చల గద్దియల మీద = పచ్చల పతకాలు పొదిగిన సింహాసనాలపై
అంగనల ఆట = స్త్రీల ఆటలు (నాట్యంలు)
చూచీ నల్లవాడె = చూచిన + అల్లవాడె

చూచినాడు అదిగో వాడె


రంగగు సొమ్ముల తోడ = చక్కని సంపదలతో ?
రాజసపు విభవాల = రాజ వైభవాలతో
చెంగట ?
నున్నాడు లక్ష్మీనారసింగుడు = లక్ష్మీ నరసింగుడు ఉన్నాడు



పెండెపు = గండపెండారము తొడిగిన
పాదము = పాదము (foot)
చాచిపెనచి = ?
ఒక పాదము = ఒక పాదము


అండనే పూజలుగొనీ నల్లవాడె
కొండల శ్రీ వేంకటాద్రి కోరి అహోబలమున
మెండుగాను మెరసీ లక్ష్మీ నారసింగుడు॥



అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |