అవి యటు భావించినట్లాను
అవి యటు భావించినట్లాను
కవగొని యిందుకు గలగరు ఘనులు // పల్లవి //
అరయగ నేబదియక్షరములె పో
ధరలోపల నిందాస్తుతులు
సరి బురాణములు శాస్త్రవేదములు
యింపుగ పన్నియు నిండి పొడమె // అవి యటు //
వొక్కదేహమున నున్నయంగములు
పెక్కువిధములై బెరసినివి
చిక్కుల గొన్నిటి సిగ్గుల దాతురు
యెక్కువయతులకు నిన్నియు సమము // అవి యటు //
అంతరాత్మలో నంతర్యామై
బంతుల దిరిగేటిబంధువులు
చింతింప నతడే శ్రీవేంకటేశ్వరు
డింతకు గర్తని యెంతురు బుధులు // అవి యటు //
avi yaTu BAviMcinaTlAnu
kavagoni yiMduku galagaru Ganulu
arayaga nEbadiyakSharamule pO
dharalOpala niMdAstutulu
sari burANamulu SAstravEdamulu
yiMpuga panniyu niMDi poDame
vokkadEhamuna nunnayaMgamulu
pekkuvidhamulai berasinivi
cikkula gonniTi siggula dAturu
yekkuvayatulaku ninniyu samamu
aMtarAtmalO naMtaryAmai
baMtula dirigETibaMdhuvulu
ciMtiMpa nataDE SrIvEMkaTESvaru
DiMtaku gartani yeMturu budhulu
బయటి లింకులు
[మార్చు]
అన్నమయ్య పాటలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|