అలుకలు చెల్లవు హరి
అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ
నలి నిందిర నీతో నవ్వినది // పల్లవి //
ఆదిలక్ష్మి మోహన కమలంబున
వేద మాత నిను వేసినది
ఆదెస నీపై నభయహస్తమును
సాదరమున గడు సాచినది // అలుకలు //
సిరి దన కన్నుల చింతామణులను
పొరి నీపై దిగ బోసినది
వరద హస్తమున వలచెయి బట్టుక
అరుదుగ నిను మాటాడించినది// అలుకలు //
జలధి కన్య తన సర్వాంగంబుల
బిలిచి నిన్ను నిటు పెనగినది
అలముక శ్రీ వేంకటాధిప నిను రతి
నెలమి నీ వురంబెక్కినది// అలుకలు //
alukalu cellavu hari puruShOttama
nali niMdira nItO navvinadi
AdilakShmi mOhana kamalaMbuna
vEda mAta ninu vEsinadi
Adesa nIpai naBayahastamunu
sAdaramuga gaDu sAcinadi
siri dana kannula ciMtAmaNulanu
pori nIpai diga bOsinadi
varada hastamuna valaceyi paTTuka
aruduga ninu mATADiMcinadi
jaladhi kanya tana sarvAMgaMbula
bilici ninnu niTu penaginadi
alamuka SrI vEMkaTAdhipa ninu rati-
nelami nI vuraMbekkinadi
బయటి లింకులు
[మార్చు]
అన్నమయ్య పాటలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|
చ|| ఆదిలక్ష్మి మోహన కమలంబున | వేద మాత నిన్ను వేసినది | ఆదెస నీపై నభయహస్తమును | సాదరముగ గడు చాచినది ||