అతిసులభం బిది యందరిపాలికి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
అతిసులభం బిది (రాగమ్: ) (తాలమ్: )

అతిసులభం బిది యందరిపాలికి
గతియిది శ్రీపతికైంకర్యంబు

పాలసముద్రము బలిమి దచ్చికొని-
రాలరిదేవత లమృతమును
నాలుక నిదె హరినామపుటమృతము
యేల కానరో యిహపరము అతి||

అడరి బాతిపడి యవని దేవతలు
బడివాయరు యఙ్న భాగాలకు
విడువక చేతిలో విష్ణుప్రసాదము
కడిగడియైనది కానరుగాని అతి||

యెక్కుదురు దిగుదు రేడులోకములు
పక్కన దపముల బడలుచును
చిక్కినాడు మతి శ్రీవేంకటేశ్వరు
డిక్కడితుదిపద మెఱగరుగాని అతి||


Atisulabham bidi (Raagam: ) (Taalam: )

Atisulabham bidi yandaripaaliki
Gatiyidi sreepatikainkaryambu

Paalasamudramu balimi dachchikoni-
Raalaridevata lanrtamunu
Naaluka nide harinaamaputamrutamu
Yela kaanaro yihaparamu Ati||

Adari baatipadi yavani devatalu
Badivaayaru yagna bhaagaalaku
Viduvaka chetilo vishnuprasaadamu
Kadigadiyainadi kaanarugaani Ati||

Yekkuduru digudu redulokamulu
Pakkana dapamula badaluchunu
Chikkinaadu mati sreevenkatesvaru
Dikkaditudipada meragarugaani Ati||


బయటి లింకులు[మార్చు]ఆహా ఎంత చక్కని పాట

ఎంత చక్కని ఫిలాసఫీ

అతి సులభం బిది యందరిపాలికి = అతి = చాలా , very సులభం = తేలిక , easy బిది = ఇది, this యందరిపాలికి = అందరి పాలిటి , for everybody గతియిది శ్రీపతికైంకర్యంబు = గతి = మార్గము, way (or path) ఇది = ఇది , this శ్రీపతి = శ్రీ అనగా లక్ష్మీ దేవి, పతి అనగా భర్త అనగా లక్ష్మీ దేవి భర్త అయిన వేంకటేశ్వరుడు. husband of Godess laxmi, that is Lord SrI veMkaTESvara కైంకర్యంబు = పూజ, pUja, worship

(మోక్షానికి ) మార్గమైన, లక్ష్మీ పతి శ్రీ వేంకటేశ్వరుని పూజ అందరికీ, అతిసులభమైనది. worship of Lord VenkaTeswara is forverybody and very easy. It is the way to moxa.

పాలసముద్రము బలిమి దచ్చికొనిరి అలరి దేవతలు అమృతము = పాలసముద్రము = పాలసముద్రము , milky ocean బలిమి = ??? బలముతో, with great effort దచ్చికొనిరి = ??? అలరి = /??? దేవతలు = దేవతలు , demigods అమృతము = అమృతము, nector

పాలసముద్రము నుండి దేవతలు అతి ప్రయాసతో అమృతమును సంపాదించుకున్నారు.

Demigods got nector from milky ocean with great ocean.

నాలుక నిదె హరినామపుటమృతము యేల కానరో యిహపరసుఖము = నాలుక = నాలుక , tounge ఇదె = ఇదియే, this one only హరినామపు అమృతము = హరి పేరు లోని అమృతము, nector of hari nama (nector of Lord hari's name) యేల = ఏ విధముగా, how కానరో = చూడరో, గమనించరో miss to see ఇహ = ఈ లోకమున, అనగా భూ లోకమున , in this world of earth పర = పర లోకమున, అనగా వైకుంఠమున , in the other world of viakuMTa సుఖము = సుఖము, ఆనందము, happyness (అంత కష్టపడి అమృతము సంపాదిమ్చిన దేవతలు) నాలుక పై ఉన్న హరి నామ అమృతము ను ఎలా చూడరో? ఏమిటో? ఈ హరి నామామృతము భూ లోకములోనూ, వైకుంఠ లోకములోనూ సుఖము ఇవ్వగలదు. (but those demigods) forgot to see the nector of hari nama on the tounge, which gives happy ness in this earthly planets and in vaikunTa planets.

అడరి బాతిపడి యవని దేవతలు బడివాయరు (బడివాయురు?) యఙ్న భాగాలకు, విడువక చేతిలో విష్ణుప్రసాదము కడిగడియైనది కానరుగాని =

అడరి = ???? బాతిపడి = బ్రాంతి పడి, with illusion యవని = భూమి దేవతలు = దేవతలు, demigods బడివాయురు = ఆశపడతారు యఙ్న భాగాలకు = యఙ్నం లోని భాగాలకు విడువక చేతిలో = విడువక చేతిలోని, un attached from hand విష్ణుప్రసాదము = విష్ణు దేవుని ప్రసాదము, Lord vishnu's prasada కడిగడియనది = ??? కానరు గాని = చూడరు గానీ, భూమి కి చెందిన దేవతలు భ్రాంతి తో యఙ్న భాగాలకు ఆశ పడతారు కాని, చేతి లో విడువక వుండే విష్ణు ప్రసాదముని చూడరు.

యెక్కుదురు దిగుదు రేడులోకములు పక్కన తపముల బడలుచును = ఎక్కుదురు = పైకి వెళ్తారు , will go up దిగుదురు = కిందకి వెళ్తారు, will go down ఏడు లోకములు = ఏడు లోకములు , seven lOkaas పక్కన = పక్కన ?? , side తపముల = తపస్సులతో, with austirities బడలుచును = చేయుచూ, doing తపస్సులు చేస్తూ ఏడు లోకములలో పైకీ, క్రిందకీ తిరుగుతూ ఉంటారు ding severe austirities will go up and down of seven lokas.

[ ఈ రెండు లైనులు చాలా అర్ధవంత మైనవి, ఇవి తపస్సులు చేసి భూమి, స్వర్గ ములు మారే వారి గురించి, పాపాలు చేసి పాతాల లోకాలు పొయ్యె వారి గురించి చెప్పుతున్నాయి]

చిక్కినాడు మతి శ్రీవేంకటేశ్వరుడిక్కడితుదిపద మెఱగరు గాని చిక్కినాడు = దొరికినాడు, caught మతి = మనసున , in mind శ్రీ వేంకటేశ్వరుడు = శ్రీ వేంకటేశ్వరుడు, Lord Venkatesvara ఇక్కడి = ఇక్కడ వున్నటువంటి, here తుది పదము = చిట్ట చివరి గమ్యము, the final goal ఎఱుగరు గాని = తెలుసు కొనరు కానీ, won't know

మనసున శ్రీ వేంకటేశ్వరుని ఉంచుకొనడము అనే చిట్ట చివరి గమ్యము ని తెలుసుకొనరు గానీ, (these people who with severe austirities wonder between seven lokas won't recognize the final goal of keeping Lord VeMkaTEsvara in the mind. )

నాకు ఉన్న కొద్ది జ్ఞానముతో రాసినాను, తప్పులు ఉంటే క్షమించగలరుఅన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |