అతఁడే రక్షకుఁ డందరి కతఁడే
స్వరూపం
అతఁడే రక్షకుఁ డందరి (రాగం: ) (తాళం : )
అతఁడే రక్షకుఁ డందరి కతఁడే
పతి యుండఁగ భయపడఁ జోటేది // పల్లవి //
అనంతకరము లనంతాయుధము -
లనంతుఁడు ధరించెలరఁగను
కనుఁగొని శరణాగతులకు మనకును
పనివడి యిఁక భయపడఁజోటేది // అతఁడే //
ధరణి నభయహస్తముతో నెప్పుడు
హరి రక్షకుఁడై యలరఁగను
నరహరికరుణే నమ్మినవారికి
పరఁదున నిఁక భయపడఁజోటేది // అతఁడే //
శ్రీ వేంకటమున జీవులఁ గాచుచు
నావల నీవల నలరఁగను
దైవశిఖామణి దాపగు మాకును
భావింపఁగ భయపడఁజోటేది // అతఁడే //
బయటి లింకులు
[మార్చు]
అన్నమయ్య పాటలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|