Jump to content

అంతయు నీవే హరి

వికీసోర్స్ నుండి
(రాగమ్: ) (తాలమ్: )

పల్లవి - అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ


చరణం1 - కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధర నా నెలవును నీవే నీరజనాభ


2- తనువును నీవే దామోదర నా మనికియు నీవే మధుసూదన వినికియు నీవే విట్ఠలుడా నా వెనకముందు నీవే విష్ణు దేవుడా


3- పుట్టుగు నీవే పురుషోత్తమ కొన నట్టనడుము నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే

బయటి లింకులు

[మార్చు]

అంతయు నీవే హరి http://balantrapuvariblog.blogspot.com/2010/12/annamayya-samkirtanalutatwamulu_11.html


అంతయు నీవె ....ప్రియాసిస్టర్స్





అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |