శరచ్చంద్రిక

వికీసోర్స్ నుండి
శ్రీశ్రీ
ఖడ్గసృష్టి
1. ఖడ్గసృష్టి (కవిత)
2. శరచ్చంద్రిక
3. విషాదాంధ్ర
4. విశాలాంద్రలో ప్రజారాజ్యం
5. మున్నుడి
6. సదసత్సంశయం
7. మహాసంకల్పం
8. 'కో ఈ హస్ రహ్ హై' ' కో ఈ రో రహా హై'
9. గాంధీజీ!
10. మంచి ముత్యాల సరాలు
11. ఏవి తల్లీ!
12. సామాన్యుని కామన
13. రుబాయత్
14. భ్రమరగీత
15. బొమ్మలాంతరు
16. ఆఖరిమాట మొదటిమాట
17. విదూషకుని ఆత్మహత్య
18. టాంటాం
19. కొంటె కోణాలు
20. ఎ ఏ ఐ ఒ ఓ ఔ
21. అభిసారికి కడసారి
22. ఒకటీ - పదీ
23. నగరంలో వృషభం
24. అధివాస్తవికుల ప్రదేశం
25. మహాకవి ఆశ్చర్యం

నవీన విశ్వవిద్యాలయాల్లో పురాణ కవిత్వంలాగా శ్రవణ యంత్రశాలల్లో శాస్త్రీయ సంగీతం లాగా ఇలా వచ్చేవేం వెన్నెలా! ఎలా వర్ణించను నిన్ను ? మహా కవులు లోగడ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పాలా ?

ఏదో కాస్త భాషా జ్ఞానం ఇంతో అంతో చ్చందస్సంపదా ఐదో పదో అలంకారాలు ఆరో అందులో సగమో ఆవేశం

ఇలాంటివే ఏవో పోగుచేసి ఇదివరకు నిన్నెప్పుడూ చూడనట్టు ఇవ్వాళే కొత్తగా కనిపెట్టినట్టు ఏమని వర్ణించను నిన్ను ?

ఏది రాసినా ఏం లాభం ? ఇదివరకెవడో అనే వుంటాడు బహుషా ఆ అన్నదేదో నాకన్నా బాగానే అని వుండొచ్చు.

అలాంటప్పుడు మళ్ళీ కలం కాగితం మీద పెట్టి కళంకంలేని తెల్లదనాన్ని\ ఖరాబు చెయ్యడ మెందుకు ?

అనాది నుంచీ నువ్వు అంత మంది కవులకి ఉపాదేయ వస్తువుగా నిలిచి ఉపకారం చేశావు

అలాగే నేనూ ఒకప్పుడు రొమాంటిక్ ప్రమాదంలో పడి అమాయకంగా నీ బ్యూటీ అభివర్ణించాను వృత్తాలలో

ఇవాళ మళ్ళీ అలాగ ఎలాగ రాయగలను నేస్తం ? ఇరవయ్యో ఏడు నాకు మళ్ళీ ఎలా వస్తుంది చెప్పూ ?

అంచేత నీ గురించి అన్వసరావేశాలు పెంచి అన్యాపదేసంగానో లేదా అర్ధాంతరన్యాసంగానో

సొంత కోపాలేవో పెట్టుకొని పంతాలు పట్టింపులూ పట్టుకొని ఎవరినీ ఈ వ్యవహారంలో ఇరికించదలచుకోను నేను !

ఎంతకీ ఆవేశాక కేముంది ? ఎవడి బతుకు వాడు బతుకుతున్నాడు ఎంతగా ఎడం ఎడంగా ఉన్నా ఎంతగా పై పై భేదాలున్నా ఎంతగా స్వాతిశయం పెరిగినా ఎంత బలం ధనం జవం పెరిగినా అంతరంగం అట్టడుగున మాత్రం అంతమందిమీ మానవులమే !

అందుచేత ఓ చందమామా అందమైన ఓ పూర్ణసోమా సముద్రం మీదా అరణ్యం మీదా సమానంగా ప్రకాశించే సౌందర్యాభిరామా