Jump to content

ఏవి తల్లీ!

వికీసోర్స్ నుండి
శ్రీశ్రీ
ఖడ్గసృష్టి
1. ఖడ్గసృష్టి (కవిత)
2. శరచ్చంద్రిక
3. విషాదాంధ్ర
4. విశాలాంద్రలో ప్రజారాజ్యం
5. మున్నుడి
6. సదసత్సంశయం
7. మహాసంకల్పం
8. 'కో ఈ హస్ రహ్ హై' ' కో ఈ రో రహా హై'
9. గాంధీజీ!
10. మంచి ముత్యాల సరాలు
11. ఏవి తల్లీ!
12. సామాన్యుని కామన
13. రుబాయత్
14. భ్రమరగీత
15. బొమ్మలాంతరు
16. ఆఖరిమాట మొదటిమాట
17. విదూషకుని ఆత్మహత్య
18. టాంటాం
19. కొంటె కోణాలు
20. ఎ ఏ ఐ ఒ ఓ ఔ
21. అభిసారికి కడసారి
22. ఒకటీ - పదీ
23. నగరంలో వృషభం
24. అధివాస్తవికుల ప్రదేశం
25. మహాకవి ఆశ్చర్యం

చక్రవర్తిఅశోకుడెచ్చట ?

జగద్గురు శంకరుడెచ్చట ?

ఏవితల్లీ: నిరుడు కురిసిన

హిమ సమూహములు ?

కాళిదాసు మహా కవీంద్రుని

కవనవాహినిలో కరంగిన

ఉజ్జయినినేడెక్కడమ్మా

ఉంది? చూపించు ?

షాజహాన్‌ అంత:పురములో

షట్పదీశింజానమెక్కడ:

ఝాన్సీ లక్ష్మీదేవియెక్కిన

సైంధవంనేడేదితల్లీ ?

రుద్రమాంబా భద్రకాళీ

లోచనోజ్జల రోచులేవీ.:

ఖడ్గతిక్కన కదనకాహళ

కహకహ ధ్వను లెక్కడమ్మా?

ఎక్కడమ్మాకృష్ణరాయని

బాహు జాగ్ర ద్బాడబాగ్నులు ?

బాలచంద్రునిబ్రహ్మనాయని

ప్రాణవాయువులేవితల్లీ ?

జగద్గురువులు, చక్రవర్తులు,

సత్కవీశులు, సైన్యనాధులు,

మానవతులగు మహారాజ్ఞులు

కానరారేమీ ?

పసిడిరెక్కలు విసిరి కాలం

పారిపోయినజాడలేవీ ?

ఏవితల్లీ: నిరుడు కురిచిన

హిమ సమూహములు ?

"https://te.wikisource.org/w/index.php?title=ఏవి_తల్లీ!&oldid=21791" నుండి వెలికితీశారు