Jump to content

ఒకటీ - పదీ

వికీసోర్స్ నుండి
శ్రీశ్రీ
ఖడ్గసృష్టి
1. ఖడ్గసృష్టి (కవిత)
2. శరచ్చంద్రిక
3. విషాదాంధ్ర
4. విశాలాంద్రలో ప్రజారాజ్యం
5. మున్నుడి
6. సదసత్సంశయం
7. మహాసంకల్పం
8. 'కో ఈ హస్ రహ్ హై' ' కో ఈ రో రహా హై'
9. గాంధీజీ!
10. మంచి ముత్యాల సరాలు
11. ఏవి తల్లీ!
12. సామాన్యుని కామన
13. రుబాయత్
14. భ్రమరగీత
15. బొమ్మలాంతరు
16. ఆఖరిమాట మొదటిమాట
17. విదూషకుని ఆత్మహత్య
18. టాంటాం
19. కొంటె కోణాలు
20. ఎ ఏ ఐ ఒ ఓ ఔ
21. అభిసారికి కడసారి
22. ఒకటీ - పదీ
23. నగరంలో వృషభం
24. అధివాస్తవికుల ప్రదేశం
25. మహాకవి ఆశ్చర్యం

ఈ ఫస్టోబరు రోజు ఎవరా వస్త

చెప్పండికాస్త ఎవరా వస్తున్నరాజు

ఆరంభ మంగళముహూర్తం ఆసన్నమయింది

ఆహానం కోసం మా గానం ఆయత్తమయింది

అయితేఆ వస్తున్నదిఆం అవునోకాదో

ఆసదించబోయే అనుభవం ఆఖరకు తీపోచేదో

శ్రీరాములుచుట్టి చిత్తగించవలెను దాకా

ప్రవహించిన విజయప్రభవించేతనయ

ఆం కాకపోతే ఏం అందులోఒక ముక్క

ఆ ముక్కలో ఒకచెక్కఅయినా ఇదే మా ఓం

అదో పదోనెల బాల

హాస విశాల

పుట్టిందికొస్తోంది

పూర్ణ గర్భణి

తారంగం తారంగంలాలీ లాలీ

ఆనందం ఆనందం హాయీ హాయీ

శంఖాలూ ఢంకాలూ మ్రోగించండీ

స్నేహార్ద్రం సౌహార్దం సాధించండీ

రైలుబండిలేటయిందా

వంతెనచుట్టూ వరదలా

ఇంజన్‌ సరిగ్గాలేదూ

ఎందు కదంతా పోదూ

పూలదండతో

నిండిందిస్టేషన్‌

కోటి గొంతుకలతో

పాడిందినేషన్‌

పదిలంగా పొగబండి

చేరిందిడెస్టినేషన్‌

రారండీరారండీయావన్మందీ

ఆడండీపాడండీహ్లాదం చెందీ

ఆంధ్రరాష్ట్రం ఆగమనం

అసత్యం కాజాలనిచారిత్రక వాగ్దానం

మనచరిత్రాత్మక నిరంతరాందోళన

చరితార్ధమయిందీనాడు

ఈ రాష్ట్రం ఇదిగో ఇప్పుడేచెబుతున్నా

ఏదో కొందరి సదుపాయాని కేర్పడలేదు.

ఎవరో కొందరుద్యోగులకనివేర్పడలేదు

ముక్కోటి ఆంధ్రుల ఆకుంఠితదీక్ష

అజేయ సంకల్పం

ఆంధ్రావతరణకి కారణం

ఈ రోజు ఊరేగింపులుజరుగుతాయ్‌నిజమే

ఉత్సవాలు జరుగుతాయ్‌ నిజమే

ఉత్సాహం ఉప్పొంగుతుందినిజమే

యాథావిథిగా అన్ని లాంఛనాలూ సాగుతాయ్‌నిజమే

కాని ఆ లాంఛనాలన్నింటి తరాత

వచ్చిన అతిథులువెళ్ళిపోయినతరాత

పాటలూప్రసంగాలూ జయ జయధానాలూ చల్లబడ్డతరాత

సంబరాల తరాత

సంపాదకీయాల తరాత

సామాన్యమానవుడిభుజస్కంధాల మీద

సమస్తభారం పడుతుంది

అతనిదీఈ రాష్ట్రం

అతనికోసం ఈ రాష్ట్రం

పెత్తనం చెయ్యాలనిముందుకొచ్చే

పెద్దలిదిగ్రహించాలని హెచ్చరిక

శుభంగా శోభావహంగా

ఆకారంతాల్చుతున్నఆంధ్రరాష్ట్రం

ఆంధ్రజాతికంతటికీ విజయం

ఆంధ్రసంస్కృతికి అఖండవిజయం

ముఖ్యంగా అతి ముఖ్యంగా

ఆంధ్రభాషకిదిఅపూర విజయం

ఇదివినండిమరి

విప్లవం మున్ముందుమనుష్యునిమనస్సులో ప్రారంభమవుతుంది

మన:ప్రపంచానికి బాహ్య విప్లవం

అందుకే ఈ ఆనందసమయంలో

భాషలోనూ భావంలోనూ విప్లవం తెచ్చిన

మహా మానవులైన

మన గిడుగు గురజాడవీరేశలింగం

మహానీయులను

నామన:ఫలకంముందు సాక్షాత్కరింపజేసుకొని

నమస్కరిస్తున్నాను

వారిచ్చిన ఆశీరాదాలు

తీర్చిదిద్దిన ఒరవడులు

చిరకాలం మన ఆంధ్రావనికి

శ్రీరామరక్ష

దేవతలేమానవులేదీవించాలి

దేశంలోదేవతం దీపించాలి.

ఈ ఫస్టోబరు శుభవేళ

నిన్నటి మన సరూపం స్మరించి

నేటి మన సభావం గ్రహించి

రేపటిమన సమాజంకోసం కలిసిమెలిసి క్రమించుదాం

నిన్నమన ఓడరేవులనుంచి దేశదేశాలకి

మననాగరికతనౌకాయానాలుచేసింది

నేడుమన రహదార్లు ఎద్దుబళ్ళకి ఏడుపు తెప్పిస్తున్నాయ్‌

ఇనుపదార్లు ఇరుకైపోయినాయి

రేపు మన విశాలాంధ్రవిమానాశ్రయాలనుంచి

మహాకాశాల్లోమన విమానాలుప్రయాణం చేస్తాయ్‌.

నిన్నటి మన రాజనగరాల్లో

రత్నరాసుల విపణివీధులు

విదేశీయులకి విభ్రాంతికలిగించాయ్‌

నేడు పట్టణాల పాలకసంఘాలు

దరిద్రాలను తరిమి వెయ్యలేక

అంధకారాన్నిఅరికట్టలేక

అలమటించి అల్లాడుతున్నాయ్‌.

రేపటిమన జల విద్యుత్‌ప్రణాళికలు

సిమెంట్‌కాంక్రీట్‌ వినిర్మాణాలు

ట్రాక్టర్లు బుల్‌ డోజర్లు

పారిశ్రామిక వ్యవసాయక సహసమానాభివృద్ధితో

ప్రతికుటుంబానికీ ఒకనివాసగృహం చూపిస్తాయ్‌

ప్రతివ్యక్తి చేతికీ ఒక పని కల్పిస్తాయ్‌

ప్రతిమనస్సులోఒక పరిశుభ్రమైన గీతం పలికిస్తాయ్‌.

నిన్నమనదేశం మహామంత్రులైన అక్కనమాదన్నలనిలోకానికిచ్చింది.

నేడుమంత్రి పదవుల మంతనాలతోవాతావరణంలో

దుమ్ముదుమారం చెలరేగింది

రేపు జాతినంతటినీ ఏకమార్గంలోనడిపించి

అఖిలభారతావనికే ఆదర్శం చూపించగల

మహానాయకుడు మనకులభిస్తాడు

నిన్న తమకంటే హెచ్చువారి కాళ్ళుపట్టుకొని కొలిచి

తమకన్న తక్కువవారిని కాళ్ళకిందపట్టి అణచి

చిరునవుతోస్తిమితంగా సర్దుకుపోయేమనస్తతం

నేడు ఆ మనస్తతపు అవశేషాల నెదిరించి

పోరాడుతున్నవారితిరుగుబాటు

రేగించినప్రచండసంఘర్షణల

ప్రభంజన గర్జన

రేపు మానవుడు మానవుని లోనిమాన

వతం గుర్తించిమహనీయులై

సరికొత్త మర్యాదలు సృష్టించే

మహత్తరకాలం

నిన్నకవితానికి రాజాధిరాజుల ఆదరణ

నేడుప్రభువులలో పరిపాలకులలోఇంకిపోతూన్నరసహృదయం

ఆనందానికి అవకాశాలూతీరుబాటూలేని

అసంఖ్యాక ప్రజానీకం

రేపు మేలుకొన్న ప్రజలు శిరస్సున ధరించి

ఆదరించే అతినవీన కవితామాధుర్యం

సంతోషం సంరంభం నేడే నేడే

సౌమార్గ్యం సౌభాగ్యం రేపే రేపే

"https://te.wikisource.org/w/index.php?title=ఒకటీ_-_పదీ&oldid=13144" నుండి వెలికితీశారు