బొమ్మలాంతరు
Appearance
శ్రీశ్రీ | ||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
దిద్దుతూన్నగుంట ఓనమాలుచెరిపేసి
చేతిలోఉన్న బలపం విరిచేసి
కొత్తపలక కొనుక్కొచ్చాడు కుర్రాడు
పాగా చుట్టుకొంటూన్నరోకలి పారేసి
తెలివితక్కువతనాన్నిగొయ్యి చేసి పాతేసి
పొరుగువాడెలా ఉన్నాడని భోగట్టాచేశాడువెర్రాడు
ఆడుతూన్న నాటకం ఆపేసి
పెట్టుకున్నగడ్డం కుళ్ళాయీ లాగేసి
ఆడియన్సులోకలిసిపోయాడు విదూషకుడు
నిన్నటి వాగ్దానాన్ని నేటిఉపన్యాసంలోకాల్చేసి
నేటి ఫోర్జరీని రేపటి సంతకంగా మార్చేసి
ఇక్కడేవుండువొస్తానని ఎక్కడికో పోయాడు వినాయకుడు
తనచుట్టూతాను తిరుగుతూ
సూర్యుడిచుట్టూ పరిభ్రమించే భూమిలాగ
ఆశయంచుట్టూ తిరుగుతోందిఆవేశం.