టాంటాం

వికీసోర్స్ నుండి
శ్రీశ్రీ
ఖడ్గసృష్టి
1. ఖడ్గసృష్టి (కవిత)
2. శరచ్చంద్రిక
3. విషాదాంధ్ర
4. విశాలాంద్రలో ప్రజారాజ్యం
5. మున్నుడి
6. సదసత్సంశయం
7. మహాసంకల్పం
8. 'కో ఈ హస్ రహ్ హై' ' కో ఈ రో రహా హై'
9. గాంధీజీ!
10. మంచి ముత్యాల సరాలు
11. ఏవి తల్లీ!
12. సామాన్యుని కామన
13. రుబాయత్
14. భ్రమరగీత
15. బొమ్మలాంతరు
16. ఆఖరిమాట మొదటిమాట
17. విదూషకుని ఆత్మహత్య
18. టాంటాం
19. కొంటె కోణాలు
20. ఎ ఏ ఐ ఒ ఓ ఔ
21. అభిసారికి కడసారి
22. ఒకటీ - పదీ
23. నగరంలో వృషభం
24. అధివాస్తవికుల ప్రదేశం
25. మహాకవి ఆశ్చర్యం

నిన్ను

ఇంద్రుడవనీ, చంద్రుడవనీ

ఇంద్రుని హితుడవనీ

చంద్రుని హితుడవనీ

ఇంద్రసుతుని హితునిమేనమామ వనీ

చంద్రహితుని సుతునిబావమరిదివనీ

కరి కరిభిత్‌

గిరి గిరి భిత్‌ - కబుర్లతో

కవులు పొగడడం మేం వి

న్నాం, వి

న్నాం

కానినువు

పురుగువనీనురుగువనీ ఏమీ

ఎరుగవనీ

వొట్టి చేటపెయ్యవనీ

కొయ్యవనీ గుడ్డిగవ

చెయ్యవనీ

గోడమీదనీడవనీ

చేతకానివాడవనీ

పెద్దలక్కబొమ్మనివాజమ్మవనీ

మేధావదసాధారణ

గాధలుమేం నమ్మమనీ

కష్టం కావచ్చుగాని

స్పష్టం గానే మేం అం

టాం : అం

టాం.

"https://te.wikisource.org/w/index.php?title=టాంటాం&oldid=13140" నుండి వెలికితీశారు