'కో ఈ హస్ రహ్ హై' ' కో ఈ రో రహా హై'
శ్రీశ్రీ | ||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
ఒక మనిషి బ్రిడ్జిమీదనడుస్తూ జేబులోనిచిల్లర డబ్బులుబిచ్చగాడికిచ్చేస్తాడు ;
రిస్టువాచీని ఎదురుగుండా వస్తూన్న నర్సు కిచ్చేస్తాడు ; కోటుతీసి నీళ్ళలోపడే
స్తాడు; దానివెనుకనే నీళ్ళలోపడిపోతాడు.
ఒక మనిషి వ్యాపారం పారం కనుక్కొంటాడు; వాడిచేతుల్లోరూపాయల చెట్టు
మొలుస్తాయి. అవి బ్యాంకుల్లోబంగారపు గుడ్లు పెడతాయి; వాటిలోంచి కన్నీరు
సొనగా కారుతుంది.
ఒక మనిషి మైలురాయి దగ్గర మౌనంగా కూర్చుంటాడు; అనుక్షణం ఎవరో
వస్తూన్నట్టునిరీక్షిస్తాడు; బస్సులులెక్కపెడుతూ బటానీగింజలుతింటూ
ఉంటాడు; మేఘాన్నిచూస్తూకాలాన్నిమర్చిపోతాడు.
ఒక మనిషి నిచ్చెనలుమోసుకుంటూ తిరుగుతాడు - సంచీలోబాతుగుడ్లూ
వాడూను; గోడకు నిచ్చెన ఎక్కి బాతుగుడ్డు ఆకాశంమీదికి విసురుతాడు; అంత
ఎత్తు బంగారానికి హరిశ్చంద్రుణ్ణికొనుక్కొన్నఆసామీ వీడే.
ఒక మనిషి రంధ్రాన్ని అనేషిస్తాడు; వాటి సైజుల్లోభేదం ఉంటుంది.
ఒక మనిషి అరాజకాన్నిఅమ్మజూపుతాడు; దీర్ఘబాహువుల్తో దేన్నో దేవుతున్నట్లే
వుంటాడు; యువకుల హృదయ రక్తకాసారాల్లో దొరికే గజ
నిమ్మపళ్ళు తప్పమరేవీతినడు; అదైనా రోజుకి ఒకసారి మాత్రం.
ఒక మనిషి కాంభోజ రాగం పాడుతూ కాలాన్ని వెళ్ళపుచ్చుతుంటాడు.వాడి
దగ్గర ఒక్కవిపంచికూడా ఉందన్నసంగతియిక్కడజ్ఞాపకంచెయ్యక పోవడం
అనవసరం; ఆ వేళల్లో ఆలాపించేరాగాన్నిశాసించడానికే ఆ వేళ్ళు;వాటి
స్పర్శకినక్షత్రాలు అంటుకుంటాయి ; చంద్రుడులోసరస్సులు సలసల
కాగుతాయి; నా గుండెల్లో చలికాలం చివురు తొడిగి సీతాకోక చిలకతో పెళ్ళి
మాటలు ప్రారంభిస్తుంది.
ఒక మనిషి కర్పూరం, కళ్ళకీ , సింధూరంచెక్కులకి రాసుకుంటాడు;
పూసుకుంటాడు; వాడొక కవి. రహస్య భాషలో అందుకున్నసందేశాలని
వ్యాఖ్యానం చేస్తూ విమానశాఖలో పనిచేస్తాడు; బజారు ధరలు
పడిపోతూండడానికి వాడే గొప్పకారణం.
ఒక మనిషి రుద్రాక్ష తావళాలుమెడలోవేసుకొనిజపంచేస్తూ వుంటాడు; బొజ్జతో
ఆలోచిస్తాడు; వాడిముందు కొబ్బరికాయలు కొట్టొద్దు మొర్రో అనినేను మొత్తుకో
వడంవల్ల ప్రయోజనం లేదనితెలిస్తేమాత్రం ప్రయోజనం ఏమిటి?
ఒక మనిషి ఒక్కత్తెనే ప్రేమిస్తాడు ; ఆమె చచ్చిపోతుంది; తరువాత కథతెరమీద
చూడండి.
ఒక మనిషిని ఉరితీస్తారు; వాడిచావుతో శాంతిని కొనుక్కుంటుందిసంఘం;
న్యాయశాస్త్రం తృప్తిగా నిట్టూరుస్తుంది;వాడినెత్తురు చిందినచోట ప్రతి
సాయంత్రం ఒక కన్నులేని కుక్కపిల్ల జాలిగా మొరుగుతుంది;తన్ను
అన్యాయంగా ఉరితీశారనిచెప్పడానికి ఇష్టం లేనంతగరం ఆ మానవుడికి.
ఒక మనిషి ఉపన్యాసాలిచ్చి గొప్పవాడవుతాడు; ఒకమనిషి చిత్తుగా తాగేసి
బీదవాడవుతాడు; ఒకడు దొడ్డమ్మ దగ్గర కానీతీసుకుని గాలిపడగ కొ
నుక్కుంటాడు; ఇంకొకడుదాన్ని లాక్కుంటాడు.
ఒక మనిషి పరారీ అయిపోతాడు; వొకడు పూనాకి పోతాడు; ఒకడు పెళ్ళాడే
స్తాడు; ఒకడు పడుక్కుంటాడు; మరొకరు కునికిపాట్లు పడతాడు; ఇంకొకరు
బాతాఖానీ కొడతాడు; ఒకడికి ఏడుపుకి నవొస్తుంది; ఒకడినవు ఏడుపు
తెప్పిస్తుంది; ఉదాహరణలతోసహా ఇదినేను ఋజువు చేయగలను.
అండజ భీము డండడడడండడడండడడండడండడండడడడండడండడడ
డండడడండడడండడండ.....సామీ దీని అంతమెప్పుడు ?
శిష్యాఇదిఅనంతం