మరచిపోయిన సామ్రాజ్యాలకు
చిరిగిపోయినజెండా చిహ్నం
మాయమైనమహాసముద్రాలను
మరు భూమిలోని అడుగుజాడస్మరిస్తుంది
శిధిలమైననగరాన్నిసూచిస్తుంది
శిలాశాసనంగా మౌనంగా
ఇంధ్రధనస్సు పీల్చేఇవాళిటి మన నేత్రం
సాంద్రతమస్సు చీల్చేరేపటి మిణుగురు పురుగు
కర్పూర ధూమధూపంలాంటి
కాలం కాలుతూనే ఉంటుంది
ఎక్కడో ఎవడో పాడిన పాట
ఎవడో ఎందుకో నవేపాప
బాంబుల వర్షాలువెలసిపోయాక
బాకుల నాట్యాలు అలసిపోయాక
గడ్డిపువులు హేళనగా నవుతాయి.
గాలి జాలిగా నిశశిస్తుంది.
ఖడ్గాన్నిరద్దుచేస్తుందిఖడ్గం
సైన్యాన్నితినేస్తుందిసైన్యం
పొలంలోహలంతో రైతు
నిలుస్తాడివాళా రేపూ
ప్రపంచాన్ని పీడించిన పాడుకలని
ప్రభాతనీరజాతంలోవెదకకు
ఉత్పాతం వెనుకంజ వేసింది
ఉత్సాహం ఉత్సవం నేడు
అవనీమాత పూర్ణగర్భంలా
ఆసియా ఖండం ఉప్పొంగింది
నవప్రపంచ యోనిదారం
భారతం మేలుకుంటోంది.
నేస్తం మనదు:ఖాలకి వాయిదావేద్దాం
అసౌకర్యాలు మూటకట్టి అవతల పారేద్దాం
ఇంకోమాటు వాగాదం ఇంకోనాడు కొట్లాట
ఇవాళ మాత్రం ఆహ్లాదం ఇవాళ తురుఫాసు