మహాకవి ఆశ్చర్యం
శ్రీశ్రీ | ||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
సూదికొసవలె సూక్ష్మమైన ఒక లోకం. నా ఆలోచన
అయస్కాంతం.
అణువులోఆలాపన , కలంలో కలకలం. అణాలోఆల్కెమీ .
ఆరాధనలోఆముదం.జింటాన్‌నన్నుంటానంది.రత్నాలు 9.
రసాలు 9. ఆకాశనేత్రంలో అష్టాదశ పురాణాలు. ఇంద్రధనుస్సు
వాయిస్తూఎవరో పాడుతున్నారు ప్రవాళ దీపంలో మరకతమంజీరం
కాబోలును ?
ఆంబోతులు
మరచిపోయి చూచినవి , చూచిమరచిపోయినవి, అనుకొని
ఆలకించినవి. ఆలకించినట్టు అనుకున్నవి, ఆకస్మికంగా
ఆఘ్రాణించినవి, రుచిచూచి రచించినవి, స్పృశించిఅనుభవించినవి,
రమ్మంటేరావు, వొద్దన్నావొస్తాయి. నాటకశాలలో గురకపెడుతూ,
జంతుప్రదర్శనశాలలో పియానోవాయిస్తూ,వస్తు విక్రయ శాలలో
వేణ్ణీళ్ళు తాగుతూబ్రిడ్జిప్రక్కపిల్లిమొగ్గలువేస్తూ ,లాడ్జిలో
కూరగాయలు కోస్తూ ఎప్పుడో వస్తాయి, ఎలాగో చూస్తాయి.
కెమేరాకన్ను
చంద్రకిరణాలనే శాశతంగా తాగలేము. సందులోవుంది
సాహసం. జడవనివదు సౌందర్యం. సరదా కొసని కొరడా కొసని
సరదా కొసని కొరడా.నా ఇష్టం వచ్చినంతరాస్తాను. ఎక్కడ
ఆగానో ఎరుగుదును. అధరం నా ఆదర్శంబింబంలో ప్రతిబింబం.
మో హం
మో దం
మో సం
కూర్చొనిచేసిన పాపం గుడికట్టినా పోదు. చిన్నప్పటిమాట.
ఆడపిల్ల బడిలో అటెండెన్స్ రిజిస్టరు తస్కరించిన తరాత చేతిలోపని
చేతిలోనే అయిపోయింది. "అన్నన్నా,ఎంతపనిచేశానా"
అనుకున్నాను. కొన్ని సంపాదకీయ రచనలకంటె నయమే
అనిపిస్తుం దిప్పుడు.
కైమా - చేసిరి
పిల్లి తాగుతూన్న పాలలాగు బాధతో పడుక్కున్నాను. కొన్ని
రూళ్ళ కర్రలు ,వాటికొకదారం కట్టి లాగుతూ పందికొక్కు లాంటి
పొడుంగొక్కువస్తోంది. సీసాలుతే.పసుపుపచ్చని పత్రికలు
కట్టుకుని పెళ్ళికూతురయిందివాస్తవికత.
శారదాబిల్లి
ఛందస్సు (గాయత్రీ సాక్షిగా చెబుతున్నాను) ఎటుతిరిగితే
అటేఒరుగుతుంది. విధానంలో వికారం - మాత్రలు మింగడం
నాకు చేతకాదు. అల్లిక రంగ వల్లిక , అంకెలుమన సంకెళ్ళు.
ఆడగవయ్యాఆర్ధికశాస్త్రపండితుణ్ణి.పరతం పండిబద్దలవుతోంది,
లావా ----
దేవీ
శ్రావణశుద్ధదశమీ సోమవారం మెడమీదఅవతరాలు
కప్పుకొనిచంద్రుడుతొంగిచూశాడు. బడబానలంవలె భయంకర
మనోహరమైన పయోధి. అదృష్టంవలె, అఘంవలె,
నౌకాభంగంవలె,నగ్ననక్షత్రంవలె,నలు చదరపు నీలిమందు
అందులోనిదితిమింగలం. దానికొక ఔత్ఖానా,దంతాలసందున
కార్ఖానా.
ఔరత్‌ఖానా
జరత్కారుని చమత్కారంలాగు నన్ను నేను తిరగేసితొ
డుక్కున్నాను.
అడుగునుంచిచూస్తేఅస్థిపరతం ;
అగ్నిపంజరం, మీదనుంచి చూస్తే మేగ్నాకేసు; మీరట్
కార్టా.
అర్ధంకాదు ఆలాపన - అయితే - అబద్ధంకాదు ఆశ్చర్యం.
మహారాజశ్రీ
కళ్ళ పిడికిళ్ళలోకర్పూర నీహారం ధరించి,ఉపమానం
వంటిఉల్కాగ్రైవేయంతో కనీనికాధిష్ఠితకాళిదాసుడై,ప్రబంధగ్రంథ
గంధగజాన్నిఅధిరోహించి ఆకస్మాత్తుగా సాక్షాత్కరించాడుమహాకవి
ఆశ్చర్యం.
అతివా (! ! ! !)
రానేవచ్చావు ఎలాగూ, కళ్ళతోనయినా ఒకమాట ఆడుదూ
-లాల్చీ విప్పేస్తానన్నాను. బహిరంగ రహస్యాలు
బయటపెట్టడాని కేమున్నాయి ? అందరూ అనుకుంటున్నవే.
తలలలో దాచుకుంటారు. కలలలోకరవొస్తాయి. అన్నీ నాకు 64
లాగే కనబడటాయ్. పరధ్యానంగా ఉన్నప్పుడు అర్ధమవుతాయి.
ఆల్కెమీరా
అన్నిటిలో అందం వుంది. అర్థం వుంది.కావలసినన్ని
ఉపమానాలకి అక్కరలేనన్ని ఉపమేయాలు, ఎక్కడో పోలిక దొ
రుకుతుంది.ఎక్కడోచేతులు కలుస్తాయి. స్నేహం చేపడుతుంది.
ఇంద్రనీలమణులను కరిగించిఎవరో సముద్రాన్ని సృష్టించారన్నవే
వే. ఆ మాట రుజువు చెయ్యగలవా ? కార్మిక ఘర్మకఠోరక్షారతలో
కడలికి రూపం కలిగిందనినేనంటేనా కోపం ? అదో దృక్పథం.
అదో చిత్తవృత్తి, ఆ స్థితిలో అన్నీక్షమిస్తావు. అన్నీరుచిస్తాయి.
దృక్కోణం
సప్నాలను కోస్తున్నాడు శస్త్రవైద్యుడు...లలో ,మేఘాలలో
...యలలో , లోయలలోఉన్నవి ఉంటాయి. పోయినవి పోతాయి.
నీకెందుకు బాధ? బా.....ధబా.... అబ్బా......బా....బా,బా,బా,
బాం, బాం, బాంబు.