అభిసారికి కడసారి
స్వరూపం
శ్రీశ్రీ | ||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
ఆకాశంమీదరాకాసికోర
ఏడకయ్యా పోతావు
కోరచుట్టూ నెత్తుటి చుక్కలు
ఏడకయ్యా పోతావు
కనుమలోనిది- కొ - కొ - కొ - కొలిమి
వెళ్ళకయ్యా చెడతావు
నీడచూడకు నీకే హాని
సంకేతం ని శ్మశానం
వింతైనదివిహంగం
ఏడకయ్యా పోతావు
చూపులలోనివి సూదులు
ఎందుకయ్యాపోతావు
'పడుచుదనానికి జడుపులేదు
సంకేతం నా సరస్సు'
వెళ్ళకు వెళ్ళకు చస్తావు
నాచు నిండిన కోనేరు
ఏమిటి దంతపు చర్మంమీద
ఎర్రని పచ్చనిదేదో మచ్చ
లోతులోయలోభూతాలు
కొలిమి నిప్పులోగుర్రాలు
సూదికి కంట్లో సోపానం
కాళ్ళకి కళ్ళూసంకెళ్ళూ
సంకేతం నీ సాలర్సాన్
జలపాతంలోజంఝూటి