విదూషకుని ఆత్మహత్య
Appearance
శ్రీశ్రీ | ||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
కొవొత్తు లారిపోయినై
క్లోరోఫారంలా చీకటి కమ్ముకుంది
ప్రపంచం తనమరణశాసనం రాసుకుంది.
విదూషకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
యంత్రాల మంత్రగానం
విషధూమాల తుపాను
స్టీమర్లో చింపంజీ
నాందిలో భరత వాక్యం
మృత్యువులో సృష్టి
విదూషకుని ఆత్మహత్య.
విదూషకుని వికట హాసంలో
కపాలం పకాలన్నది.
ఆకలి అన్నం వండుకుంది,
హంస ఆకాశం అందుకుంది.
విదూషకుని విషాదం
సముద్రంలో బడబాగ్ని
భూకంపంలో ప్రూట్‌శలాడ్.
కాని
కొవొత్తులుమళ్ళీ వెలిగి
మరణశాసనం మండిపోయింది.