Jump to content

ఆఖరిమాట మొదటిమాట

వికీసోర్స్ నుండి
శ్రీశ్రీ
ఖడ్గసృష్టి
1. ఖడ్గసృష్టి (కవిత)
2. శరచ్చంద్రిక
3. విషాదాంధ్ర
4. విశాలాంద్రలో ప్రజారాజ్యం
5. మున్నుడి
6. సదసత్సంశయం
7. మహాసంకల్పం
8. 'కో ఈ హస్ రహ్ హై' ' కో ఈ రో రహా హై'
9. గాంధీజీ!
10. మంచి ముత్యాల సరాలు
11. ఏవి తల్లీ!
12. సామాన్యుని కామన
13. రుబాయత్
14. భ్రమరగీత
15. బొమ్మలాంతరు
16. ఆఖరిమాట మొదటిమాట
17. విదూషకుని ఆత్మహత్య
18. టాంటాం
19. కొంటె కోణాలు
20. ఎ ఏ ఐ ఒ ఓ ఔ
21. అభిసారికి కడసారి
22. ఒకటీ - పదీ
23. నగరంలో వృషభం
24. అధివాస్తవికుల ప్రదేశం
25. మహాకవి ఆశ్చర్యం

ఆఖరిమాట మొదటిమాట

ఆశలకేం అనంతం

ఆకాశంనా గుడారం

అ ఆలునా ఆస్తి

ఆసియా అంతవాణ్ణి

ఆశలకేం అనంతం

అప్పారావు నానేస్తం

ఆంధ్రతం నా శాపం

విశాఖపట్టణం వూరు

వెర్రాసుపత్రిపేరు

ఆఖరిమాట మొదటిమాట

ఆశలకేం అనంతం

ఆసియా అంతవాణ్ణి

ఆశలకేం అనంతం

అమాంతంగానే కాదండయ్యా క్రమంగా క్రక్రమంగా నా

సమస్తం మీ సమక్షంలో సమర్పిస్తా శ్రమిస్తే

కపాలం నవితేనేం కంపింపింబింబింపిస్తా!నీ

ప్రపంచాన్నే,పాటల్లోఆటల్లో నామాటల్లో

ఇదే నా రహస్యం

యథార్ధం నా తురుపు

నా కేమున్నాయిలేఆసులా రాజులా రాణీలా

జాకీలా క్షణకాలం జెండా ఎగిరించేస్తాం

ఆ కొంచెం చాలదంటే సైనైడుకూడా కొంచెమే కా

దంటే కాదనండయ్యాఅన్నయ్యలారా

పరమాణువు నాప్రపంచం

నాతో నా గుణకారం

క్షణాన్నేసాగదీస్తే కాలం డొంకంతా కదల్దా

ఇలాగే ఎక్కేద్దాం శిఖరం కొత్తరాస్తాలుతీస్తూ

మిలిట్రీ లారీ నడిపించేపద్ధతిలో పద్‌హతితోనే

అణాలూ అరణ్యాలూ అణువుళూఅద్రులూ దాటుకుంటూ

ఆవేగం నావేగం

ఆసియాలకేం అనల్పం

వికృతం శుంఠాయమానంగా కనబడితేనేం

ఒకానొక ఋజుతం సాధిస్తాం మనం లోపా

యికారీ వ్యాపారాల్లో పాల్గొంటామా చేస్తే

అకస్మాత్తుగా ఓపెన్‌గా చేస్తాం లేకపోతే నిద్రపోతాం

సప్నంలోసర్గం

హతాశయాలకి పొటాసియాలు

హిప్పోపొటామస్‌ హిట్లర్‌ హిండెన్‌ బర్గు హిడింబా

హిరణ్యాక్ష రాజ్యాలూ ఇవన్నీఎందుకోయ్‌హ్రీ హ్రీ

శ్రీతో శ్రీ శ్రీశ్రీతో శ్రీశ్రీ శ్రీశ్రీశ్రీతో శ్రీశ్రీశ్రీ

శిఖరంపైజెండా శిలలకి ప్రాణం చీనీతోచీనాతో స్నేహం

ఆఖరి మాట మొదటిమాట

ఆశలకేం అనంతం

అప్పారావు నానేస్తం

ఆంధ్రతం నా శాపం

ఆశయం అంతవాణ్ణి

ఆశలకేం అనంతం

ఆఖరిమాట మొదటిమాట

ఆశలకేం అనంతం

అప్పారావంత వాణ్ణి

ఆశలకేం అనంతం