మూస చర్చ:PD-DLI

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

ప్రజాపరిధి/జాతీయం[మార్చు]

User:‎రహ్మానుద్దీన్ గారికి, జాతీయం అనే పదానికి ప్రభుత్వానికే అన్నిహక్కులు వున్నాయని అర్ధం వుంటుంది కావున ప్రజాపరిధి అనే పదం మెరుగైనదనుకుంటాను. --అర్జున (చర్చ) 05:00, 5 ఆగష్టు 2015 (UTC)

ప్రజాపరిధి అన్న పదం వేరే అర్ధాలు రావచ్చు. సార్వజనీనం అని వాడవచ్చేమో?--రహ్మానుద్దీన్ (చర్చ) 12:02, 5 ఆగష్టు 2015 (UTC)
ఈ విషయంలో తెలుగు ప్రసార సాధనాలు కూడా మనకి సాయపడవు. ఎందుకంటే ఈ కాపీహక్కుల విడుదల అంశాలు అత్యంత తరచుగా వార్తల్లో రికార్డు కాలేదు. ఇక చర్చ గమనించిన మీదట సార్వజనీనం అన్న పదమే బావున్నట్టు అనిపిస్తోంది. జాతీయం అన్న పదం బ్యాంకుల జాతీయం వంటివాటిలో గౌరవప్రదంగా వాడినప్పుడూ, దొరికినది తీసుకుపోయేవారి విషయంలో అమర్యాదకరంగా ఉపయోగించినప్పుడూ కూడా మనం అనుకునే అర్థం రావట్లేదు కనుక సరిపోదు. --Pavan santhosh.s (చర్చ) 05:28, 6 ఆగష్టు 2015 (UTC)
రహ్మానుద్దీన్ ,Pavan santhosh.s గార్ల స్పందనలకు ధన్యవాదాలు. సార్వజనీనంగా మార్పు చేస్తాను. --అర్జున (చర్చ) 05:45, 6 ఆగష్టు 2015 (UTC)

సమస్యలు[మార్చు]

వాడుకరి:Arjunaraoc, వాడుకరి:Pavan santhosh.s లకు ఈ మూసతో సమస్యగా వున్నది కాబట్టి, ఈ మూసకు బదులుగా వికీసోర్స్:వికీప్రాజెక్ట్/DLI పాఠ్యీకరణలో భాగంగా చేర్చబడిన పుస్తకం అనే విషయాన్ని తెలియజేసే ప్రాజెక్టు:డి.ఎల్.ఐ. పాఠ్యీకరణ అని గాని లేదా :మూస:కాపీహక్కులు సందేహాస్పదం మూసగాని వాడితే మిగిలిన వికీమీడియా / వికీ కామన్స్ సభ్యుల నుండి సమస్యలు రావని భావిస్తున్నాను. తెలుగు వికీసోర్సు అంతరంగిక సమస్య; మిగిలిన ఇండిక్ వికీసోర్సులు చురుకుగా పాల్గొనడం వలన ఈ విషయం అందరికీ తెలిసిది. ఒకసారి ఆలోచించండి. మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలని నా అభిమతం.--Rajasekhar1961 (చర్చ) 17:57, 4 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారూ, నేను అర్జున గారు గతంలో వెలిబుచ్చిన అంశాలను సంగ్రహం చేసి మూస:కాపీహక్కులు సందేహాస్పదం అన్న మూస తయారుచేశాను. సమస్య ఉన్నవారు అవసరమైతే చర్చాపేజీ ద్వారానో, మరో రూపంలోనో స్పందించవచ్చని మనం చర్చల్లో చెప్తూ మూస మట్టుకు "ఈ కృతి భారతీయ డిజిటల్ లైబ్రరీ ద్వారా సార్వజనీయం చేయబడింది." అని ఘంటాపథంగా చెప్తూండడం పొసగట్లేదు. ఏ అనుమతులూ అక్కరలేకుండా పుస్తకాలు వాడుకోవడమన్న మన మౌలిక ఉద్దేశానికి భంగకరంగా, కాపీహక్కుల విషయంలో మనకే స్పష్టతలేని పుస్తకాలు వికీసోర్సులో ఉన్నవని తెలిసీ వాటిపై సమస్యలు ఉన్నవారు చర్చాపేజీలో రాయండి అంటూ నోటీసు చేర్చడం అన్నది వికీసోర్సు పట్ల నాకున్న అవగాహనకు విరుద్ధమే. కానీ ప్రస్తుతానికి మధ్యేమార్గంగా ఈ మూస పనికివస్తుందని భావిస్తున్నాను. కాబట్టి దయచేసి కాపీహక్కులు సందేహాస్పదమన్న మన అవగాహనను వ్యక్తం చేసే కాపీహక్కులు సందేహాస్పదం మూసతో ఈ మూసను ఆయా పుస్తకాల పేజీల్లో మార్చడం సరైన పని. అలాగే ఈ మూసను తొలగించివెయ్యమనీ సూచిస్తున్నాను. ఇక మన సమస్యను మనమే పరిష్కరించుకోవడం సరైన ఆలోచన. ఎందుకంటే మనకు పరిష్కరించుకోగల సమర్థత, అవగాహన ఉంది. --పవన్ సంతోష్ (చర్చ) 05:55, 8 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961, పవన్ సంతోష్ లకు. సమస్య తేలేవరకు మూస మార్చడం వలన ఉపయోగం లేదు. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ఉద్దేశం కాపీరైట్ తొలగించినలేని కృతులను అందరికి అందుబాటులోకి తీసుకురావడమైనప్పుడు, తాత్కాలికంగా ఆ వెబ్సైటు పనిచేయకపోయినా, మనం గాభరాపడి అనవసర మార్పులు చేయనవసరంలేదు. వికీమీడియా సామాజిక మాధ్యమం కాబట్టి ప్రాజెక్టులలో స్వేచ్ఛాకాపీహక్కుప్రకారం వుంచామని తెలియచేసినను, దానిని వాణిజ్యపరంగా వాడుకొనేవారు, మూలహక్కులు గలవారిని సంప్రదించే వాడుకోవాలనే సూచన నేను చదివినట్లు గుర్తు. ఇంకా వికీమీడియా ప్రాజెక్టుల కాపీహక్కుల పాలసీలు తప్పనిసరిగా తెలుగు ప్రాజెక్టులు అవలంబించాలంటే {{PD-India}} కృతులు కూడా తొలగించాలి. డిఎల్ఐ పుస్తకాలు సందేహాస్పదముగా నిర్ణయించితే ఆర్కీవ్ ప్రాజెక్టులోని పుస్తకాలకు లింకులు ఇవ్వడం కూడా దోషమే. కావున సమస్య పరిష్కారమయ్యేవరకు యథాతథపరిస్థితి కొనసాగించటమే మంచిది.--అర్జున (చర్చ) 03:47, 9 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ! యధాతథ స్థితి అంటే ఏమిటి? కాపీహక్కుల అంశంపై కోర్టు కేసు నడుస్తూన్న కారణంగా వెబ్‌సైట్ తీసివేశారన్న విషయం తెలిసినా ఘంటాపథంగా "ఈ కృతి భారతీయ డిజిటల్ లైబ్రరీ ద్వారా సార్వజనీయం చేయబడింది." అని చెప్పడమా? మనం ఏమీ గాభరా పడట్లేదు వెబ్‌సైట్ తొలగించి సంవత్సరం గడిచింది. ఆ వెబ్‌సైట్ కాపీహక్కుల కారణంగా తొలగించారన్న సంగతి కాసేపు మర్చిపోదాం. ఈ మూస లింకైన ఒక్కొక్క కృతి సంగతీ చూద్దాం: కుటుంబ నియంత్రణ పద్ధతులు (డాక్టర్ సమరం), గణపతిముని చరిత్ర సంగ్రహం (పోలూరి హనుమజ్జానకీరామశర్మ వారసులు), కథలు - గాథలు (దిగవల్లి శివరావు) (దిగవల్లి శివరావు వారసులు), తెలుగువారి జానపద కళారూపాలు (పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం) వంటి రచనలను సార్వజనీనం చేయలేదని మూల కాపీహక్కుల వారసుల ద్వారా తెలుసుకున్నాను. ఇక పీడీ-ఇండియా కృతులు తొలగించడం విషయమంటారా - దానినీ చేయవలిసివస్తే చేద్దాం. అయితే - ప్రస్తుతానికి పూర్తైన పుస్తకాలను మరో విధంగా కాపీహక్కుల పునర్విడుదల చేయిద్దామని ఆలోచిస్తున్నామన్న విషయం మీకు తెలియనిది కాదు. ఎందుకంటే అస్పష్టమైన కాపీహక్కులు గల ఆయా పుస్తకాలపై తమ విలువైన కాలాన్ని, శ్రమని ఖర్చుపెట్టిన శ్రీరామమూర్తి గారు వంటి వాడుకరుల శ్రమను అపహాస్యం చేయకూడదన్న ఉద్దేశంతో ఆఖరి ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా చర్విత చర్వణమే. సమస్య పరిష్కారం కాకపోవడం ఏమీ లేదు. ప్రస్తుతానికి మనం పరిష్కారం దిశగా వెళ్తున్నాం. --పవన్ సంతోష్ (చర్చ) 05:47, 9 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఇక మీరు వాణిజ్యపరంగా వాడుకొనేవారు, మూలక్కులు గలవారిని సంప్రదించే వాడుకోవాలనే సూచన ఉందంటున్నారు. ఎక్కడ ఉందన్నది నాకు తెలియదు కానీ మన వికీసోర్సు కింద కనిపించే వాడుక నియమాలు పరిశీలిద్దాం. అదేమంటోందంటే - The Wikimedia Foundation wants to ensure that the content that we host can be re-used by other users without fear of liability and that it is not infringing the proprietary rights of others. అంతేకాక ఒకవేళ ఏదైనా ఉల్లంఘన విషయంలో వారి స్టాండ్ ఇలా వుంది: In fairness to our users, as well as to other creators and copyright holders, our policy is to respond to notices of alleged infringement that comply with the formalities of the Digital Millennium Copyright Act (DMCA). అంతేకాదు అలాంటి సమస్య వచ్చినప్పుడు కంప్లైంట్ చేయడానికి ఒక మెయిల్‌ఐడీ ఇచ్చి, ఇంతకన్నా మా వికీమీడియా కమ్యూనిటీ దృష్టికి తెస్తే త్వరగా పరిష్కారమవుతుందని మన మీదే నమ్మకాన్ని పెట్టారు: Alternatively, you may make a request to our community, which often handles copyright issues faster and more effectively than prescribed under the DMCA. పరిశీలించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 06:02, 9 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారికి, కాపీహక్కులు సంగతి క్లిష్టమైనవిషయం. పుస్తక రచయితల కాపీహక్కులు వారసులు చెపితే తేలేది కాదు. రచయిత కి ముద్రణదారుకి జరిగిన ఒప్పందం వివరాలేమిటి, రచయిత కాని ముద్రణదారు కాని డిఎల్ఐ అభ్యర్ధనకు స్పందించి ఆయా పుస్తకాలను స్కాన్ చేసి డిఎల్ఐలో వుంచేందుకు అనుమతి ఇచ్చారా లేదా కూడా తెలుసుకోవాలి. కాహీహక్కు రిజిస్టరు అయిందా లేదా అనితెలుసుకోవడం కూడా మంచిది. డిఎల్ఐ ఉద్దేశ్యం కాపీరైట్ లేని కృతులు అందరికి అందుబాటులో వుంచటం అయినప్పుడు మనం పని చేసిన పుస్తకాలకు కాపీహక్కు సమస్య వుందా లేదా అనే నిర్ధారణ అయినంతవరకు, ఇప్పటివరకు జరిగిన పని అలానే వుంచి, ఇతరత్రా సమస్యని పరిష్కరించే ప్రయత్నాలు చేయటాన్ని నేను సమ్మతిస్తాను. అంతేకాని కేవలం మూస మార్చితే సమస్య పరిష్కారమవుతుందనుకోను. Commons:Reusing_content_outside_Wikimedia ని పరిశీలించితే the Wikimedia Foundation does not provide any warranty regarding the copyright status or correctness of licensing terms. If you decide to reuse files from Commons, you should verify the copyright status of each image just as you would when obtaining images from other sources. అనే వాక్యం కనబడుతుంది. వికీమీడియా ప్రాజెక్టులు సామాజిక మాధ్యమం కాబట్టి వీటినుండి సమాచారాన్ని ఉపయోగించుకునే వారెవరైనా హక్కుల సమాచారం ధృవీకరించుకునే వాడుతారు. ఇక మీరు చివరలో చెప్పినట్టు, హక్కుదారులె ఎవరైనా అభ్యంతరం తెలిపినపుడు ఆ సంబంధిత కృతికి సరియైన చర్య తీసుకొనవచ్చు. నా ఉద్దేశంలో నూటికి 90 శాతం మంది వికీ ప్రాజెక్టుల ద్వారా వారి కృతి మరింతమందికి చేరువకావడమే ఇష్టపడతారు. ఆ విధంగా మనం కృషి చేసినవాటిలో కొద్ది శాతం తొలగింపుకి గురియైనా అంత మనం బాధపడనవసరం లేదు. ప్రస్తుతపరిస్థితిలో కాపీహక్కులు స్పష్టత వున్న వాటిపై ఇకముందు కృషి చేస్తే సరిపోతుంది.--అర్జున (చర్చ) 07:15, 11 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ నేను ఈ సందర్భంలో కేవలం వారసులనే ప్రస్తావించడం లేదు స్వయానా రచయిత చెప్పిన సందర్భాన్ని కూడా మనవి చేస్తున్నాను కాబట్టి రచయితకే స్వయంగా తెలియదని కూడా అనుకుని ఆ అస్పష్టత వల్ల అవకాశం తీసుకుందామనుకోవడం సరికాదు కదా. అంతేగాక గతంలో రహ్మానుద్దీన్ ఈ సందర్భంలోనే విశ్వనాథ సత్యనారాయణ వారసులు, వారి సర్వహక్కుల స్వామ్యాన్ని అనుభవిస్తూ స్వయంగా ప్రచురణ చేస్తూన్న ముద్రాపకులు అయిన విశ్వనాథ పబ్లిషర్స్ వారి ఉదాహరణ కూడా తీసుకువచ్చారు. వీటిని బట్టి డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వారి ధ్రువీకరణను అనుసరించి సార్వజనీనం అనుకోవడం అన్నది ప్రాతిపదిక కాదని తేలుతూ ఉంది. కనీసం డీఎల్‌ఐ నోటీసు నిర్ద్వంద్వంగా అనుసరించదగ్గ ప్రాతిపదిక అన్న విషయాన్నీ నిర్ధారణ చేయలేకపోతున్నాం కదా. అలాంటి సమయంలో "ఈ కృతి భారతీయ డిజిటల్ లైబ్రరీ ద్వారా సార్వజనీయం చేయబడింది." అని మనం నిక్కచ్చిగా ఎలా చెప్తున్నామన్న విషయానికే నా ప్రశ్న పరిధిని నిర్ణయిస్తున్నాను. దయచేసి ఆ వాక్యానికి ప్రాతిపదిక లేదన్నది నా వాదనగా స్వీకరించండి. --పవన్ సంతోష్ (చర్చ) 07:33, 11 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ కాపీహక్కుల సమస్య చాలా జటిలంగా కనిపిస్తున్నది. తెలుగు వికీసోర్సు సభ్యులమైన మనం ఐదుగురము ఒక అవగాహనకు రాలేకపోతున్నాము. (కొంతమంది వ్యక్తిగతంగా తీసుకొంటున్నట్లుగా ఉన్నది.) బయటనుండి వికీమీడియా ద్వారా అధికారులు వచ్చి అంతకుముందులాగా కొన్ని/చాలా పుస్తకాలను తొలగించేంతవరకు మనకు సమస్య తీవ్రత అర్ధం కావడం లేదు. నా అంచనా ప్రకారం మూడవ / బయటి పార్టీ గనుక తెలుగు వికీసోర్సు క్లీనింగ్ మొదలుపెడితే ఒక 50-60 పుస్తకాలు తొలగించబడే ప్రమాదం ఉన్నది. ఈ పరిస్థితి దగ్గరలోనే వచ్చేటట్లుగా కనిపిస్తున్నది. వికీసోర్సులో ఎక్కువగా పనిచేస్తున్న నాలాంటివారికే ఇది చాలా బాధాకరమైనది. రామమూర్తిగారు, భాస్కరనాయుడుగారు చేర్చుతున్నపుడే బాధ్యత మన నిర్వాహకుల మీద ఉంచారు. ఆయా పుస్తకాలపై పనిచేయవచ్చని మనం భరోసా ఇచ్చిన తర్వాతనే వాటిని పాఠ్యీకరణ చేపట్టారు. ఇలాంటి పెద్ద సమస్య వస్తే గనుక నైతిక బాధ్యత వహించి నేను సన్యసించడం తప్ప మరొక మార్గం లేదు.--Rajasekhar1961 (చర్చ) 12:11, 11 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారికి, డియెల్ఐ ఒక పెద్ద ప్రాజెక్టు. దాని లక్ష్యం, కాపీహక్కులగలవారిని సంప్రదించి ఉపయోగించిన పద్ధతి పరిశీలిస్తే,సంబంధిత కృతులకు "ఈ కృతి భారతీయ డిజిటల్ లైబ్రరీ ద్వారా సార్వజనీయం చేయబడింది." అనడంలో దోషమేమి నాకు కనబడదు. కొన్ని వేలపుస్తకాలు చేర్చినప్పుడు కొన్ని దోషాలు దొర్లి వుండవచ్చు. కేవలం ఒకటి రెండు వికీసోర్స్ లోలేని ఉదాహరణలు తీసుకొని, మొత్తం ప్రాజెక్టు ఉద్దేశ్యాన్నే తప్పుబట్టే విధంగా సారాంశం చేయలేము. ఒకవేళ డియల్ఐ నుండి అధికారికంగా క్షమాపణ ఏమైనా వస్తే అప్పుడు మార్పు చేయవచ్చు. ఇంకోసంగతి వికీసోర్స్ లో మన పని ఆయా కృతులకు, రచయితలకు ప్రాచుర్యం తెచ్చేదే, వారి ఆదాయానికి పెద్ద నష్టం లేనిది, మనకు ఒక పైసా ఆదాయం ఇవ్వదు కావున అవకాశం తీసుకోవడం అనే భావన సరికాదు. అటువంటి భావన వున్నవారు అటువంటి పుస్తకాలపై పనిచేయడం మానేస్తే మంచిదేమో.--అర్జున (చర్చ) 00:50, 13 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారికి, కాపీహక్కులు జటిలమైనదని మీకు అర్ధమైనందుకు సంతోషం. ప్రస్తుతం క్రియాశీలంగా చర్చలో పాల్గొంటున్నది ముగ్గురే మీరు ఐదుగురు అనటము సమస్యని పెద్దదిగా చేయటానికి తప్ప దేనికి ఉపయోగపడదు. నేనైతే వ్యక్తిగతంగా ఏమి తీసుకోవటం లేదు. సందేహాస్పదము లాంటి సవరణలు చేస్తే వెంటనే నిర్వాహకునిగా ఆయాకృతులు అదృశ్యం అయ్యేటట్లు చెయ్యవలసిన బాధ్యత వున్నది కనుకనే నేను వ్యతిరేకిస్తున్నాను. తెలుగు వికీసోర్స్ లో నిర్వాహకులు క్రియాశీలంగా వున్నంతవరకు, తెలుగు వికీసోర్స్ సమస్యలు, వికీసోర్స్ సభ్యులే పరిష్కరించుకోవచ్చు. కావున మీరు ఆందోళన పడవద్దు.--అర్జున (చర్చ) 00:58, 13 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ కనీసం ఒక్క కృతి విషయంలోనైనా ఈ కృతిని డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వారు మమ్మల్ని సంప్రదించి సార్వజనీనం చేశారు అన్న ఖచ్చితమైన సమాధానం ఒక్క రచయిత నుంచి అయినా రాబడితే డీఎల్ఐ వారు క్లెయిముకు తగ్గట్టుగా సిసలైన కృషి చేశారన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాము. కనీసం ఒక్క కృతి విషయంలోనైనా. --పవన్ సంతోష్ (చర్చ) 03:07, 13 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారూ, కాపీహక్కుల అంశం సంక్లిష్టమైనదే కావచ్చు అలానే విజ్ఞాన సర్వస్వ రచనా సంక్లిష్టమైనదే. అయితే మనం పనిచేయదలుచుకున్నాం కాబట్టి క్రమేపీ వాటిపై అవగాహన తెచ్చుకుని పాలసీలు, మార్గదర్శకాలూ రూపొందించుకుని ముందుకుపోతున్నాం. ఆ దిశగానే ఈ నెల 19-21 తేదీల్లో కాపీహక్కుల శిక్షణకు దక్షిణ భారత స్థాయిలో ఓ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం కదా. ఈ తొలి అడుగుల తర్వాత మన అవసరాలకు అనుగుణంగా మునుముందు కొన్ని ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాలూ చేసుకుందాం. నేనూ తెలుగు వికీసోర్సులో నిపుణుల సూచనలు తీసుకుని పలు పేజీలు రూపకల్పన చేస్తూన్నాను. ఏదేమైనా మనం పనిచేయాలని నిర్ణయించుకున్నాకా డీల్ చేయాల్సిందే కదండీ. --పవన్ సంతోష్ (చర్చ) 03:11, 13 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారికి, క్రితం చర్చప్రకారం అలాంటి పూర్తి వివరాలు మీరు తెలియచేస్తారని ఎదురుచూస్తుంటే, మీరే నన్నడగటము వింతగా వుంది. సరే నాకు తెలిసిన సమాచారాన్ని సభ్యులందరికి మరొకసారి తెలియచేయటం కొరకు క్రింద చేరుస్తున్నాను.
  • S Venkamma (2004). "Universal Digital Library Project" (PDF). p. 21. Archived from the original (PDF) on 2014-01-24. Retrieved 2018-10-15.  లో 26772పుస్తకాల రచయితలు మరియు ముద్రాపకులను సంప్రదించగా 1016 రచయితలు, ముద్రాపకులు 6841పుస్తకాలకు తమ అనుమతి తెలియచేశారని (ఆ పత్రం తయారీనాటికి ) తెలిపారు.
  • వెలగా వెంకటప్పయ్య (2012). "10.ప్రచురణరంగంలో వెబ్సైట్లు, మిలియన్ గ్రంథాల డిజిటైజేషన్ పథకం". తెలుగు ముద్రణ:ప్రచురణ వికాసం. pp. 100–102.  లో డి ఎల్ఐ గురించిన వివరాలు, అనుమతి ఇచ్చే ముసాయిదా పత్రంతో సహా వుంది.
  • కె విష్ణుప్రసాద్ (2003). శ్రీ ముమ్మిడివరము బాలయోగీశ్వర స్తవము. p. 1.  ముఖపత్ర పేజీలో రచయిత ముఖపత్రంపై అనుమతి వ్యాఖ్య మరియు సంతకం స్పష్టంగా చూడవచ్చు.
ఇంకేమైనా సందేహాలుంటే తెలియచేయండి. --అర్జున (చర్చ) 06:22, 15 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, మీరు ఇచ్చిన ముమ్మడివరం బాలయోగీశ్వర స్తవము పుస్తకంలో ముఖపత్రం చూశాను, అలానే వెంకమ్మ గారి ప్రెజంటేషన్ చూశాను. ఈ రెండూ పరిశీలించినా అవేవీ మనం అవగాహనలోని సార్వజనీనం కానీ, కనీసం స్వేచ్ఛా నకలు హక్కుల్లో కానీ పుస్తకాలను విడుదల చేసినట్టు కనిపించడం లేదు సార్. ఉదాహరణకు బాలయోగీశ్వర స్తవము పుస్తకం మొదటి పేజీలో మనకేం కనిపిస్తోంది "Permitted to scan this book and keep it in digital library of india project" అని రాసి సంతకం చేసివుంది. అయితే అదేమీ మన స్వేచ్ఛా నకలు హక్కులకు సంబంధించిన లైసెన్సులు కానీ, సార్వజనీనం కావడం వల్ల లభించే స్వేచ్ఛకు కానీ ఒడంబడిలేదు కదండీ. మొత్తం వ్యవహారాన్ని క్లుప్తంగా సమీక్షించాలంటే - "OUT OF COPYRIGHT" అన్నదానికి సాక్ష్యాలు వెతికితే స్కాన్ చేసుకుని వారి వెబ్‌సైట్‌లలో పెట్టుకోవచ్చునన్న వివరాలు దొరుకుతున్నాయి, వెబ్సైట్లో పెట్టిన పుస్తకాల రచయితలను అడిగితే OUT OF COPYRIGHTS వివరాలు తమకు తెలియదంటున్నారు, వెబ్‌సైట్ గతించింది, దానికి సంబంధించిన అధికారులు సంప్రదిస్తే సమాధానం ఇవ్వట్లేదు, కాపీహక్కుల విషయం మీద కేసు నడుస్తోంది - ఇక ఇంతకు మించి నేనిక్కడ వ్యాఖ్యానించదలుచుకోలేదు. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 13:14, 20 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, మీరు తెలిపిన వివిధ వనరుల్లో కూడా ఎక్కడా పూర్తి స్వేచ్ఛా నకలు హక్కుల గురించి ప్రస్తావన లేదు. కేవలం డిఎల్ఐ మాధ్యమంగా వెబ్‌సైట్ లో ప్రదర్శనకు అనుమతి ఉంది. వికీసోర్స్ లో చేర్చేందుకు అది సరిపోదు. పుస్తకం పూర్తి స్వేచ్ఛా నకలు హక్కులలో ఉండాలి అన్నది అవసరం. కొద్దిపాటి పరిమితి ఉన్నా, ఉదా: CC-BY-NC కమర్షియల్ గా అమ్మటానికి అనుమతి లేని స్వేచ్ఛా నకలు హక్కులున్న పుస్తకం వికీసోర్స్ లో చేర్చలేము. అలాంటిది కేవలం డిఎల్ఐ లో మాత్రమే ప్రచురణకు అనుమతి తీసుకున్న డిఎల్ఐ అధికారుల స్లైడును ఆధారంగా చేసుకుని మనం ఇక్కడ వాదించుకోవడం అనవసరం. మీరు ఇంంంకా డిఎల్ఐ పుస్తకాలు సార్వజనీనం అని నమ్ముతుంటే, ఈ చర్చను కామన్స్ లో చర్చకు తెచ్చి అక్కడి నిపుణుల సలహా తీసుకుందాం. ఇక్కడ జరిగిన కృషి వృథా కాదు. ఆయా పుస్తకాలు సార్వజనీనం అయ్యే రోజున పునఃప్రదర్శించాలన్న సంకల్పం తీసుకుంటూ తీసివేయాలి. ఆ రోజుకి నిర్వాహక హక్కుతో ఉన్న ఎవరైనా తిరిగి ప్రచురింఛవచ్చు. అందరి కృషి యథావిధిగా ప్రదర్శితమవుతుంది. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:10, 23 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
:::::::::::

పవన్ సంతోష్ ,రహ్మానుద్దీన్ గార్ల స్పందనలకు ధన్యవాదాలు. ఈ మూసకు సార్వజనీయం అనే పదం వాడుక మీ ప్రధాన వ్యతిరేకతగా వుందనిపిస్తుంది. ఈ వాడుక ఎలా వచ్చిందో సభ్యులందరుకు తెలియటానికి DLI ప్రాజెక్టుని చాలా ఎక్కువకాలంనుండి పరిశీలిస్తున్న వానిగా కొన్ని సంగతులు తెలియచేస్తాను. DLI తొలి ఉద్దేశం కాపీరైట్ తీరిన పుస్తకాలు స్కాన్ చేసి అందరికి అందుబాటులోకి తీసుకురావడమని అందరకు తెలుసనుకుంటాను. ఈ ప్రాజెక్టు పనికాలంలో కాపీరైట్ తీరని హక్కులు గల పుస్తకాలుకూడా స్కాను చేసి, సంబంధిత రచయితలు, ముద్రణసంస్థలు అనుమతిస్తే అవికూడా అందరికి అందుబాటులోకి తీసుకురావడమనేదానికి విస్తరించబడింది. గత చర్చలలో తెలిపినట్లు DLI లో కాపీరైట్ ఫ్రీడ్ బుక్స్ అనే ఎంపిక వుండేది.(చూడండి తెరపట్టు) ఆ తరువాత అది తొలగిపోయి DLI website లో పుస్తకాలన్నీ భారతీయ కాపీరైట్ చట్టాలకు లోబడి వుంచబడ్డాయి అని చేర్చారు. మరే విధమైన హెచ్చరిక లేకుండా అలా చేర్చారు కాబట్టి దానిని సార్వజనీయమని నిర్ణయించి మన మూసలో ఆ పదం వాడాము. ఇప్పడు తెలిసిన ప్రకారం స్కాను చేసి DLI సర్వర్ లో వుంచటానికి రచయితల/ముద్రణకారుల అనుమతుల ఉదాహరణలు, అనుమతి పత్రం ముసాయిదా, పరిశీలిస్తే అది స్కాను చేసి సర్వర్ లో వుంచడానికని తెలుస్తున్నది. దాని ప్రకారం అనుమతి ఇచ్చినవారి ఉద్దేశాన్ని గౌరవిస్తూ, వారి లక్ష్యానికి దోహడపడటానికి వికీసోర్స్ ద్వారా యూనికోడ్ కు మార్చడం మరియు ప్రదర్శించడం నాకేమీ దోషమనిపించదు. దానికి అనుగుణంగా సముచిత తెలుగు వికీసోర్స్ లైసెన్స్ మూస తయారు చేసుకొని,( తెలుగు వికీపీడియాలో w:మూస:Non-free లాగా) వాడుకుంటూ సంబంధిత హక్కుదారులనుండి CC-BY-SA విడుదలకోసం జరుగుతున్న ప్రయత్నాన్ని కొనసాగించడం తెలుగు వికీసోర్స్ అభివృద్ధికి దోహదపడుతుందని అనుకుంటున్నాను. ఈ తరహా మూస వివరణను {{PD-India}} కు కూడా జతపరచుకుని, తెవికీలోని కృతుల సమస్యలను తెవికీ సభ్యులే పరిష్కరించుకుంటే మంచిది. సభ్యులు స్పందించమని వీలైతే మూసవివరణకు కొత్త ముసాయిదా ప్రతిపాదించమని కోరుతున్నాను--అర్జున (చర్చ) 09:45, 23 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

  • "అనుమతి ఇచ్చినవారి ఉద్దేశాన్ని గౌరవిస్తూ, వారి లక్ష్యానికి దోహడపడటానికి" గాను మనకు అనుమతి లేదు. అది కేవలం డిజిటల్ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా వారు స్కాన్ చేయడానికి, వారి సర్వర్లలో పెట్టడానికి ప్రత్యేకించిన Non-exclusive హక్కు మాత్రమే. (దయచేసి అందుకు సాక్ష్యాన్ని ఈ లంకెలో పరిశీలించగలరు) అలాంటి అనుమతులైనా వేటికి వచ్చాయన్నదానిపై ఏ సమాచారం మనకు లేదు. కాబట్టి మనం పనిచేసిన పుస్తకాల కాపీహక్కుదారులకు మీరన్న ఉద్దేశాలున్నాయో లేవో మనం ఖచ్చితంగా చెప్పనూలేము. అలాంటి ప్రత్యేక అనుమతులు మట్టుకే తమ వద్ద పెట్టుకుని, తమ ప్రొఫార్మాలో స్పష్టంగా కాపీహక్కులు హక్కుదారులకే ఉంటాయన్న వాక్యమూ ఉంచుకుని కూడా OUT OF COPYRIGHT అని డీఎల్‌ఐ ప్రాజెక్టు పేర్కొనడమన్నది పెద్ద వైరుధ్యం. కాబట్టి
  1. అసలు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా డీఎల్‌ఐ ప్రాజెక్టు, వారి వారి ఉద్దేశాలూ మనం విడిచిపెట్టెయ్యాలి. వీటిని పొరపాటున పూర్తిచేసిన పుస్తకాలుగా చూడాలి.
  2. ఇక ఈ మూసపై ప్రారంభించిన చర్చ విషయంలో సందిగ్ధానికి ఏ తావూ లేదు. డీఎల్‌ఐ సార్వజనీనం అంటూ ఉన్న ఈ మూస అసంగతమన్న విషయం అన్నిందాలా తేలిపోయింది. పాఠకులు ఈ పుస్తకాలు సార్వజనీనం (ఏ అర్థంలోనైనా సరే) అన్న విషయాన్ని నమ్మేందుకు వీలిస్తున్న ఈ మూసను వెనువెంటనే చర్చా పేజీ ఉంచి తొలగించాలి.
  3. ఇకపై ఎప్పుడైనా సార్వజనీనం, ప్రజాపరిధి, సముచిత వినియోగం వంటి పదాలు మూసల్లో వినియోగించినప్పుడు భారత కాపీహక్కుల చట్టం 1957లోనూ, సంబంధిత భారతీయ కోర్టు తీర్పుల అవగాహనలోనూ ఉండి మనకు వర్తించే Public Domain, Fair Dealing వంటి వాటికి తెలుగు అనువాదాలుగానే వినియోగించాలి. కాపీహక్కుల చట్టాల్లో ఒదగని నిర్వచనాలతో మూసలు రూపొందించాల్సి వస్తే తప్పనిసరిగా ముందస్తు చర్చ చేసి దానికి సాంకేతిక పదజాలంతో విభేదం రాని పరిభాష ఎన్నుకుని, పాఠకుడు ఈ రెంటికీ పొరబడకుండేలా చూసుకోవాలి.
ఇక మూసపై నావైపు నుంచి చర్చ ముగిస్తున్నాను. మన అవగాహన మారింది కాబట్టి వెనువెంటనే సరికాని మూసను తొలగించివేయడానికి నిర్వాహక హక్కు వినియోగించాలని గౌరవ సభ్యుల్లో ఆ అధికారం ఉన్నవారిని కోరుతున్నాను. ఇక ఆయా పుస్తకాలు ఉండాలా, ఉంటే ఎలా ఉండాలన్న చర్చ కింద ప్రారంభించిన థ్రెడ్‌లో కొనసాగించాలని మనవి. --పవన్ సంతోష్ (చర్చ) 17:02, 23 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు అర్ధమైనంతవరకు ఈ పుస్తకాలను తొలగించకుండా ఉంచగలిగితే నేను చేసిన శ్రమ చాలా వరకు ఉపయోగపడుతున్నది. అందులకు అర్జునగారు తెలియజేసినట్లు w:మూస:Non-free లాంటి మూస తయారుచేసుకొంటే మంచిదని నాకనిపిస్తున్నది. ప్రారంభంలోనే నేను ఈ విషయాన్ని తెలియజేశాను.Rajasekhar1961 (చర్చ) 07:57, 24 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్, Rajasekhar1961 గార్ల స్పందనలకు ధన్యవాదాలు., సాధారణ అర్ధంలో సముచిత వినియోగంగా వాడుకోవడానికి ప్రత్యేక అనుమతులు అవసరంలేవు. రచయిత అనుమతి ఇచ్చిన సంస్థ ఉద్దేశ్యాలు, వికీసోర్స్ ఉద్దేశ్యాలు, అనుమతి ఇవ్వడంలో ఆర్ధిక షరతులు ఏమైనా వున్నాయా గమనించితే సరిపోతుంది. మీ స్పందనలో Non Exclusive అనుమతి ఇచ్చినపుడు వేరే చోట ప్రదర్శించటానికి అడ్డంకి లేదు. గత నాలుగయిదేళ్లుగా సభ్యుల కృషి వలన CIS-A2K కృషి వలన వికీసోర్స్ లైసెన్సులకి అనుగుణంగా విడుదలైన కృతుల పరిమాణాన్ని, ప్రాముఖ్యాన్ని పరిశీలించనపుడు, DLI ద్వారా అందుబాటులోకి వచ్చేకృతులలో అణుమాత్రమైనా చేయలేదని నాకనిపిస్తుంది. DLI ద్వారా స్కాన్ చేయబడి ఇటీవలదాకా హోస్ట్ చేయబడిన కృతులు వికీసోర్స్ లో {{Non-free DLI}} మూసతో వాడుకోవచ్చు అని ప్రతిపాదిస్తున్నాను. అలాగే {{PD-India}} కృతులకు {{PD-India/draft1}} సవరణతో వాడుకోవచ్చు అని ప్రతిపాదిస్తున్నాను. దీనికి సవరణలేమైనా ఆయా చర్చా పేజీలలో రాయమని కోర్తాను. ఇక మూస తొలగించి కృతులను లైసెన్స్ పరంగా త్రిశంకు స్వర్గంలో ఉంచడం సరికాదు. ఈ ప్రతిపాదనపై స్పందనలు చూసి సమస్య పరిష్కారమయ్యే దిశగా చర్య తీసుకొనవచ్చు. ఆయా కృతులపై ఆసక్తిగల వారే వాటిపై పనిచేయవచ్చు, ఇతరులు పూర్తిగా హక్కులు లేని వాటిపై పనిచేయవచ్చు. వికీసోర్స్ ఉద్దేశ్యాలకు, పురోభివృద్ధికి, వ్యక్తిగత ఆసక్తులను సమన్వయం చేసే ఈ ప్రతిపాదన ఇది సరియైనదని తలుస్తాను. సభ్యులు స్పందించవలసిందిగా కోరడమైనది--అర్జున (చర్చ) 09:47, 25 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
శీర్షికకు సంబంధం లేని చర్చ అనుకోని విధంగా ఎదురుకావడంతో సమాధానం రాయాల్సి వస్తోంది, శీర్షికకు సంబంధించిన చర్చ చదవగోరేవారు ఈ వ్యాఖ్యాని విడిచిపెట్టాల్సిందిగా మనవి అర్జున గారూ, స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేసిన పుస్తకాల పరిమాణాన్ని గురించి మీ అభిప్రాయాన్ని స్వీకరిస్తున్నా, ప్రాముఖ్యత గురించి వ్యాఖ్యానించడానికి ముందు కొన్ని పుస్తకాల విలువను పరిగణనలోకి తీసుకోండి. కేవలం మతపరమైన అంశాలకు సంబంధించిన పుస్తకాలు కొన్నిటినే పరిగణించి వ్యాఖ్యానించి ఉంటారని భావించి ఈ వివరణ ఇస్తున్నాను. కడప ఊర్ల పేర్లు పుస్తకం పరిశీలించి చూడండి. రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కేతు విశ్వనాథరెడ్డి గారు. కడప ఊర్ల పేర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆధునిక స్థలనామ విజ్ఞాన పరిశోధనలకు దారిచూపిన గ్రంథం. ఇదే దాదాపు తెలుగులో టోపోనమీ విషయంలో తొలి రచన. ఈ రచన పాఠ్యీకరణ చేసి వేలాది తెలుగు గ్రామాల వ్యాసాల మీద పనిచేయబోతున్నాం. ఇదొక దారి. కూసుమంచి గణపేశ్వరాలయం పుస్తకం చూసే ఉంటారు. చారిత్రకాంశాలతో విలువైన ఈ పుస్తకం చాలా ఆసక్తిదాయకమైనది. చెప్పులు కుడుతూ కుడుతూ పుస్తకం 19వ శతాబ్ది నాటి మాదిగ కులస్తుల జీవన విధానం, అప్పటి కరువులు, క్రైస్తవంలోకి మారిన పద్ధతి వంటి ఎన్నో విషయాల మీద ఎంతో ఆసక్తిదాయకమైన విశేషాలు దొరుకుతాయి. గురజాడ అప్పారావు జీవించివున్న కాలంలో విడుదల కాని అత్యంత అరుదైన విషయాలతో (ఇవి పోస్ట్-హ్యూమస్ కిందికి వస్తాయి, గురజాడ మరణించి వందేళ్ళైనా మరణానంతరం ప్రచురితమైన రచనలకు మరో అరవై ఏళ్ళ వరకూ కాపీహక్కులు వర్తిస్తాయి) విపులమైన పీఠికలతో విడుదలైన గురుజాడలు అన్న సర్వలభ్య సంకలనం విలువ ఎంచడానికి తెలుగు సాహిత్య వేత్తలందరూ ఓ సమావేశం ఏర్పాటైతే తప్ప సాధ్యం కాదు. సయ్యద్ నశీర్ అహ్మద్ గారు విడుదల చేసిన పలు పుస్తకాలు భారతీయ సమాజంలోని ముస్లింల జీవనంపై విశిష్టమైన కోణాలను వెలికితెచ్చినవి, పలు ప్రశంసలు పొందినవి. ఇక్కడ చర్చ అది కాదు కానీ "అణుమాత్రమైనా లేదు" అనవద్దండీ. విడుదల చేసిన పుస్తకాలన్నిటినీ ఒకగాటన కట్టడం తగదు. కేవలం కేతు విశ్వనాథ రెడ్డి గారి పుస్తకాన్నే పరిగణనలోకి తీసుకున్నా అందుకు సరితూగే పుస్తకాన్ని మరొకటి వికీసోర్సులోనే కాదు మరెక్కడ చూపించాలన్నా చాలా శ్రమించి వెతకాలి. భవిష్యత్తులో కానీ, ప్రస్తుతం కానీ ఎవరైనా అణుమాత్రమైనా వ్యాఖ్య చూసి పై పుస్తకాల విలువను తక్కువగా అంచనా కడతారేమోనన్న భయంతో నేను ఈ వ్యాఖ్యను చేస్తున్నాను.శీర్షికతో సంబంధంలేని ప్రాముఖ్యతపై చర్చలో నా వ్యాఖ్య ఇంతటితో ముగిస్తున్నాను --పవన్ సంతోష్ (చర్చ) 10:44, 25 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారు, ఈ మూసలో వికీసోర్స్ కూడా లాభాపేక్ష లేకుండా నిస్వార్ధంగా పనిచేసున్న విషయాన్ని మూసలో తెలియజేయండి. ఈ మూసను మిగిలిన సభ్యులు ఆమోదిస్తే {{PD-DLI}} మూసకు బదులుగా వాడదాము. కాపీహక్కుల సమస్య వున్న పుస్తకాలన్నింటికీ ఈ మూసను ముందుగా ప్రదర్శిద్దాము.Rajasekhar1961 (చర్చ) 12:58, 25 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
డీయెల్లైకి అనుమతి ఇచ్చారు కాబట్టి మనకూ ఇచ్చినట్టేనని అనుకున్నాను. కాదని ఇప్పుడు తెలుసుకున్నాను. డియెల్లైకి అనుమతించారు కాబట్టి, వికీసోర్స్ ద్వారా యూనికోడుకు మార్చడం దోషమేమీ కాదు. అని అర్జున గారు అభిప్రాయపడ్డారు. ఇది వికీసోర్సు నియమాలకు విరుద్ధం. ఇంగ్లీషు వికీసోర్సుకు, మనకూ నియమాల్లో తేడా ఉంటే వాటిని వివరించండి. నా అభిప్రాయం ఇది:
సార్వజనీనం కాని పుస్తకాలను వికీసోర్సులో ఉంచరాదు. కృతికర్తలను సంప్రదించి తగు అనుమతులు పొందాలని గతంలో అనుకున్నాం. అలాంటి ప్రయత్నాలు చేసిన వారికి నా అభినందనలు, కృతజ్ఞతలు. అనుమతులు పొందిన పుస్తకాలను ఉంచెయ్యాలి, లేని పుస్తకాలను తొలగించాలి.__Chaduvari (చర్చ) 18:32, 25 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 Chaduvari గార్ల స్పందనకు ధన్యవాదాలు. ఆంగ్ల వికీసోర్స్ నియమాలు యదాతథంగా తెలుగు వికీసోర్స్ కు అన్వయించడం తెలుగు వికీసోర్స్ అభివృద్ధి, లక్ష్యాలకు ఏమాత్రం ఉపయోగపడదు. స్థానిక ప్రాజెక్టుకు స్థానిక నియమాల అవసరం ఎంతో వుంది. కామన్స్ లో ఎక్కించవీలులేని హక్కులు తీరని విషయాలను సముచిత విధానానికి సరిపోతే స్థానిక ప్రాజెక్టులు (వికీపీడియాలలో) ఎక్కించడం తమకు తెలిసిందే. అందువలన తెలుగుకు స్థానిక నియమాలు దిశగా పై ప్రతిపాదన చేశాను. {{PD-DLI}} తోపాటు {{PD-India}} కూడా తొలగించితే తెలుగు వికీసోర్స్ లో పుస్తకరూపంలో వున్న వాటిలో అత్యధికశాతం తొలగించబడాలి. పుస్తకాల పని ప్రారంభించిన తరువాత నకలుహక్కులపై కొంతవరకు స్పష్టత కలిగింది, ఇవి లేని కాలంలో ఇష్టం వచ్చినట్లుగా విషయాలను చేర్చింది మీకు తెలుగు వికీసోర్స్ చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఆంగ్ల వికీనియమాలు యదాతథంగా వాడాలంటే తెవికీలో ఇప్పటికే జరిగిన పనిని ఎవరైనా ఆర్ధిక సహాయంతో వేరే భారతీయ సర్వర్ లో చేర్చుకోవటం చేసి తెలుగు వికీసోర్స్ శుద్ధి చేసుకొని 1923 లోపలి పుస్తకాలు,ఇతరత్రా స్వేచ్ఛాకాపీహక్కులక్రింద విడుదలైన పుస్తకాలలో పనిచేసే వారే తెవికీలో కొనసాగుతారు. ఇలా జరిగితే నా వరకు నేను విరమించే స్థితికి వచ్చేశాను.--అర్జున (చర్చ) 00:34, 26 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఇప్పుడు నేను రాయబోతున్న వివరాలు నేరుగా ఈ అంశం శీర్షికకు సంబంధించిన విషయాలు కావు. అర్జున గారు, రాసినవాటిలో, మరీ ముఖ్యంగా అమెరికన్ చట్టాల వర్తింపు విషయంలో, చాలా అపోహలున్నాయి. సముదాయం నిర్ణయం తీసుకోవాలంటే సరైన సమాచారం ఉండాలి కాబట్టి విస్మరించలేక సమాధానం ఇస్తున్నాను.
  1. ?అమెరికన్ కాపీహక్కుల చట్టాలు కూడా వర్తిస్తాయంటే 1923 ముందు పుస్తకాలు మాత్రమే పబ్లిక్ డొమైన్లో ఉంటాయా? - జవాబు: లేదు. అమెరికన్ కాపీహక్కుల చట్టాలు వర్తిస్తే 1923 ముందున్న పుస్తకాలే సార్వజనీనం అవుతాయన్నది కేవలం అపోహ.
  2. ?అలాగైతే ప్రస్తుతం ఎన్ని పుస్తకాల విషయంలో సమస్య ఉంది? - జవాబు: డీఎల్ఐ పుస్తకాల సమస్యనే పరిశీలిస్తే మొత్తం 32 ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వాటిలో పని జరగని పుస్తకాలు దాదాపు 13 ఉన్నాయి, పని సాగిన పుస్తకాలు 19 ఉన్నాయి. అంటే మనకు సమస్య 19 పుస్తకాల విషయంలోనే.
  3. ?చేయడానికి నాణ్యమైన పని లేదా?: - జవాబు: జనాదరణ కలిగిన అద్భుతమైన పుస్తకాలు భారత కాపీహక్కుల చట్టం పరిధిలో సార్వజనీనం అయినవి ఎన్నో ఉన్నాయి. పాత పుస్తకాలు ఎవరు చదువుతారన్నది కేవలం అపోహ అని నిరూపిస్తూ 20వ శతాబ్దిలో ప్రచురితమై చదివితీరాల్సిన వంద పుస్తకాల జాబితాలో 20 పుస్తకాలు ఇప్పటికే భారతదేశంలో సార్వజనీనం అయినాయి. వాటిలో మనం సరిగ్గా పూర్తిచేసింది మూడు పుస్తకాలు (వివరాలకు వికీసోర్స్:ఈ శతాబ్దపు రచనా శతం/వికీసోర్సులో పుస్తకాల స్థితి చూడండి). అదటు ఉంచితే సంపుటాలతో కలిపి ఇప్పటికిప్పుడు 20 పైచిలుకు పుస్తకాల మీద పనిచేయవచ్చు. అవి అలా ఉంచగా రెండు నెలల్లో వచ్చే జనవరి 1 నాటికి ఈ జాబితాలోని కచటతపలు (భమిడిపాటి కామేశ్వరరావు నాటకం), మాలపల్లి (ఉన్నవ లక్ష్మీనారాయణ) పుస్తకాలు భారతదేశంలో సార్వజనీనం అవుతాయి. మనం వాటిమీదా పనిచేయవచ్చు.
  4. ?అటుపైన?: ఆ జాబితాలోని రచయితలు సుప్రఖ్యాతలు, బహుగ్రంథకర్తలు. వారివి మరెన్నో ఉన్నాయి. వాటన్నిటిమీదా పనిచేయవచ్చు. ఉదాహరణకు: ఈనాటికీ ఎవరో ఒక హీరో నేను గోన గన్నారెడ్డి సినిమా చేస్తాననడం వింటూంటాం. ఆ గోన గన్నారెడ్డి నవల మనం ఇక్కడ పూర్తిచేసే వీలుంది మరి. --పవన్ సంతోష్ (చర్చ) 18:04, 26 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
డీఎల్ఐ పుస్తకాలు వికీసోర్సులో ఎన్ని పుస్తకాలు ఏయే స్థితిలో ఉన్నాయన్నదానికి వర్గం:డీఎల్ఐ పుస్తకాలు చూడండి. --పవన్ సంతోష్ (చర్చ) 18:05, 26 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారికి మీ స్పందనలో "?అమెరికన్ కాపీహక్కుల చట్టాలు కూడా వర్తిస్తాయంటే 1923 ముందు పుస్తకాలు మాత్రమే పబ్లిక్ డొమైన్లో ఉంటాయా?- జవాబు: లేదు. అమెరికన్ కాపీహక్కుల చట్టాలు వర్తిస్తే 1923 ముందున్న పుస్తకాలే సార్వజనీనం అవుతాయన్నది కేవలం అపోహ." అన్నదానికి ఆధారం తెలియచేయండి. నాకు తెలిసిన ఉదాహరణ వివరాలు:en:Author:Mohandas_Karamchand_Gandhi లో రచనలు పరిశీలిస్తే 1929లో ముద్రితమైన The Gita According to Gandhi (translation by Mahadev Desai, 1929) పుస్తకం వికీలివర్స్ అనే ప్రాజెక్టులో పెట్టడం గమనించండి. కామన్స్ లైసెన్స్ వివరాలు పరిశీలించినా అమెరికా మరియు మూల దేశపు కాపీరైట్ హక్కులు తీరినప్పుడే కామన్స్ లో చేర్చటానికి అంగీకారం వున్నదని తెలుస్తుంది.
చర్చ మందకొడిగా వుంది. దీనిలో ఇప్పటికే పాల్గొన్న Rajasekhar1961, Chaduvari, రహ్మానుద్దీన్ మరియు ఇతరులు తాజావిషయాలపై 2018-11-12లోగా స్పందిస్తే అవసరమైతే వోటింగ్ మొదలు బెట్టవచ్చు. --అర్జున (చర్చ) 11:44, 5 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ! అమెరికా కాపీహక్కులు వర్తిస్తాయి అనంటే మధ్యలో భారతదేశంలో మొదట ప్రచురితమైన రచనలకు యుఆర్ఎఎ అనే ఒక క్లాజు వర్తిస్తుందండి అమెరికా చట్టాలు వర్తిస్తే 1923 మాత్రమే కటాఫ్ అవుతుందన్నది సరైన ఊహ సమంజసం కాదు. 1996 నాటికి భారతదేశంలో కాపీహక్కులు చెల్లిపోయిన రచనలను అమెరికా యుఆర్ఎఎ ప్రకారం కాపీహక్కులు చెల్లిపోయిన రచనగా ఒప్పుకుందండీ. కాబట్టి 1941 ముందు చనిపోయిన రచయితలు అన్న కటాఫ్ భారతదేశపు పుస్తకాలకు అమెరికాలో కాపీహక్కుల విషయంలో వర్తిస్తుందండీ. అసలు అదంతా వేరుగా చర్చించుకోవాలి. మనం ఇక్కడ మాట్లాడుతున్నది - అమెరికా చట్టాల ప్రకారం కానీ, భారతదేశపు చట్టాల ప్రకారం కానీ, మరి ఏ ఇతర చట్టాల ప్రకారం కానీ - కాపీహక్కులు చెల్లిపోయాయి అని నిరూపించలేని రచనల గురించి - అన్నిటినీ ఒక గాటన కట్టి చర్చించడం అనవసరం. కాబట్టి అసలు అమెరికా చట్టాలు అమెరికాలో సర్వర్లున్న భారతీయ రచనలకు ఎలా వర్తిస్తాయన్న అంశం ఇక్కడ చర్చనీయాంశం కాదు. అది వేరేగా చర్చించాల్సిన విషయం. ఏ ఒక్క దేశపు చట్టం ప్రకారం అయినా కాపీహక్కులు చెల్లిపోయి వుంటే మీరన్నట్టు ఇక్కడ చర్చించగలిగేవాళ్ళం. --పవన్ సంతోష్ (చర్చ) 13:09, 5 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
నా అవగాహనకు ఆధారంగా ఈ లింకులో Template:PD-India-URAA పరిశీలించండి. "it was first published outside the United States (and not published in the U.S. within 30 days)," అన్న మొదటి క్లాజునీ, "it was in the public domain in its home country (భారత దేశం) on the URAA date (1 January 1996)." అన్న మూడవ క్లాజునీ కలిపి పరిశీలించండి. ఆ తర్వాత 1992 జనవరి 1 నాటికి అప్పటి చట్టాల ప్రకారం అప్పటికి 50 ఏళ్ళ క్రితం అంటే 1941 నాటికి మరణించిన రచయితల పుస్తకాలన్నీ కాపీహక్కులు చెల్లిపోయే ఉన్నాయి. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న 60 సంవత్సరాల లెక్క 1992లో జరిగిన సవరణలో వచ్చింది. కావున 1996 జనవరి 1 నాటికి 1941కి ముందు చనిపోయిన భారతీయ రచయితలందరూ పబ్లిక్ డొమైనండీ - అదీ అమెరికాలో. మనం ఒక సముదాయంగా - 1941 నుంచి 1958 మధ్యలో చనిపోయిన రచయితల పుస్తకాల సంగతి ఏం చేయాలన్నది విడిగా చర్చిద్దాం. ఇందులో కలపవద్దు. ఎందుకంటే ఇవి ఏ ప్రాతిపదికనైనా, ఏ చట్టప్రకారం, ఏ దేశంలో అయినా ఇంకా "సార్వజనీనం" కానివి. వాటిని ఉంచమన్న ప్రతిపాదనకు ప్రాతిపదిక కూడా సదుద్దేశం (సముచిత వినియోగం కూడా కాదు, సముచిత వినియోగం కావాలంటే కనీస అవసరాలకు అనుగుణంగా ఉండాలి, వందల పేజీల పుస్తకాలు ఆ పరిధిలోకి రావు) ఉంటాను అర్జున గారూ! --పవన్ సంతోష్ (చర్చ) 13:21, 5 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ మరింత సమాచారాన్ని తెలిపినందులకు ధన్యవాదాలు. సమస్యని సమూలంగా చర్చించడం నా దృక్పథమైతే కొద్ది కొద్దిగా చర్చించడం మీ దృక్పథంలా వుందని తెలుస్తుంది. తొలగింపు ప్రతిపాదనలున్నప్పుడు సమూలంగా చర్చిస్తేనే మంచిదని నాకనిపిస్తుంది. నేను ప్రతిపాదించిన మూసలను చూస్తే నేను వాడిన సముచిత అర్థం ప్రయోగం మీకు అర్థం కాలేదనిపిస్తుంది. హక్కుదారు ప్రపంచ వ్యాప్తంగా చదవడానికి అందుబాటులో వుండటానికి అనుమతి ఇచ్చినప్పుడు కనీస అవసరాల గురించి మాట్లాడటం వికీసోర్స్ సందర్భంలో అనవసరం. --అర్జున (చర్చ) 00:51, 7 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, సమూలంగా చర్చించడానికి PD-DLI మూస వేదిక కాదు. కొద్దికొద్దిగా చర్చించడం కాదు, ఏ సమస్యనైనా సముచితమైన చోట చర్చించడం నా దృక్పథం. ఏ దేశంలోనూ, ఏ చట్టం ప్రకారమూ - సార్వజనీనం కాని రచనల గురించి మాత్రమే ఇక్కడ చర్చిద్దాం. భారతదేశంలో సార్వజనీనమైన రచనల గురించి విడిగా చర్చిద్దాం. "ప్రపంచ వ్యాప్తంగా చదవడానికి" ఆ రచయితలు అంగీకరించారని మీరంటున్నారు. బహుశా "Non-exclusive" అన్న పదాన్ని బట్టి మీరు అలా రాశారనుకుంటున్నాను కరెక్టేనా? --పవన్ సంతోష్ (చర్చ) 07:26, 7 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారికి, తెలుగు వికీసోర్స్ నేటి స్థాయికి (20 పైగా పుస్తకాలు స్పష్టమైన మూలాలతో ప్రదర్శన పుస్తకాలుగా అందుబాటులోకి వచ్చేసరికి) నకలుహక్కులపై శ్రద్ధ పెరిగింది. ఇంతవరకు తెలుగువికీకి నియమాలపై స్పష్టత లేదు. అందుకని చర్చని తెలుగువికీసోర్స్ కొరకు నియమాల స్థాయికి పెంచి చర్చించడం అవసరం. కావాలంటే ఇక్కడ స్వస్తి పలికి వేరేచోటకు చర్చ మార్చవచ్చు. స్కాన్ చేసి సర్వర్ పై వుంచడానికి అనుమతించారంటే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో వుంచడమన్న అర్థంలో వాడాను. కేవలం {{PD-India}} పుస్తకాలు వుంచడం వికీప్రాజెక్టులు పనిచేసే చట్టాలకు అతిక్రమించినదైతే, {{PD-DLI}} పుస్తకాలు వికీ సిద్ధాంతాలకు కొంత నష్టం కలిగించేవి. ఆ స్పష్టత అందరికీ తెలియడం అవసరం.--అర్జున (చర్చ) 04:17, 9 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు తెలిసిన ఇంకొంత సమాచారం: 134 కృతులు {{PD-India}} వర్గంలో వున్నాయి. వీటిని వేరొకచోటికి మార్చాలంటే అవసరమైన సర్వర్ అందుబాటులో లేదు. 1 నవంబరు 2018 న జీవితం తరువాత 50 సంవత్సరాలు వరకు కాపీరైటు హక్కులు వుండే వికీలివర్స్ కెనడా నుండి దక్షిణకొరియాకి మార్చారు. మెమరీ నిల్వలపై పరిమితి వున్నందున, మనము వీటిని అక్కడికి తరలించలేము. ఇక ఇతర భారతీయ వికీసోర్సుల పరిస్థితి చూస్తే కన్నడంలో చాలావరకు 1923ప్రాంతం కృతులపైనే పనిచేస్తున్నారు. మైసూరు విశ్వవిద్యాలయం విజ్ఞానసర్వస్వము కేవలం పాఠ్యం క్రీస్తువిశ్వవిద్యాలయ విద్యార్ధుల ద్వారా చేర్చారు. కాపీ హక్కు వివరాలు చేర్చలేదు. మైసూరు విశ్వవిద్యాలయము CC-BY-SA గా పునర్విడుదల చేసినట్లు గుర్తు. తమిళ వికీసోర్స్ వాళ్లు ఇటీవల కృతులు చేరుస్తున్నారు ఎందుకంటే తమిళనాడు ప్రభుత్వము తమిళ వర్చువల్ విశ్వవిద్యాలయం ద్వారా కాపీహక్కులు కొని సర్వజనీయంగా విడుదల చేసే కార్యక్రమం చేపట్టింది (సుబ్రహ్మణ్య భారతి కృతులతో ఇది మొదలైంది).బెంగాలి వికీసోర్స్ లో {{PD-India}} కృతులు చేర్చారు. బాట్ ద్వారా OCR పాఠ్యం చేరుస్తున్నారు. హిందీ వాళ్లకీ వికీసోర్సే లేదు. మరాఠీలో PD-India కృతులున్నాయి. ఫ్రెంచి వికీసోర్స్ వాళ్లు అమెరికా సర్వర్ ప్రకారం కృతులుంచి ఫ్రాన్స్, యూరప్ కాపీహక్కుల చట్టాలను అతిక్రమిస్తూ వున్న బాధ్యత దింపుకొనే వారిపై పెట్టే మూస చేర్చారు. (fr:Le_Laboratoire_central ఉదాహరణ (అనువాదం)). వికీసోర్స్ లో కాపీరైటు అవగాహన వారు తక్కువ కాబట్టి, ఓటింగ్ ద్వారా ఫలితం నిర్ణయించడం కూడా కష్టమే. అందువలన మన మూసలను సవరించుకొని యదాతథస్థితి కొనసాగిస్తూ, కాపీహక్కుల పునర్విడుదలకు కృషి చెయ్యడమే మంచిదని నాకనిపిస్తుంది. పవన్ సంతోష్ గారి నుండి పునర్విడుదల ప్రయత్నాలపై తాజా స్థితి తెలిపితే ఒక నిర్ణయానికి రావటం బాగుంటుంది.--అర్జున (చర్చ) 10:48, 13 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  • మొట్టమొదటగా అనేకానేక ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు మీరు అర్జున రావు గారూ. చర్చ ఎలాగూ ఏవేవో దోవలు పడుతోంది కాబట్టి నేను కూడా తెలుగు వికీసోర్సును ప్రత్యక్షంగా ప్రభావితం చేసే పీడీ ఇండియా వర్గంపై మాత్రం మరోమారు స్పష్టతనిస్తాను. 1941కి ముందు చనిపోయిన భారతీయ రచయితలందరూ నిర్ద్వంద్వంగా కాపీహక్కుల పరిది అవతల ఉన్నారు. అందుకు నేను పైన ఇప్పటికే Template:PD-India-URAA లంకె ఇచ్చాను. మళ్ళీ 1923కు ముందు రచనల మీదే కన్నడ వారు పనిచేస్తున్నారనీ, అదనీ చర్చించడం అనవసరంగా సంక్లిష్టం చేసుకోవడమే. హాయిగా ఆ టెంప్లేట్ కి వెళ్ళి చదువుకోవచ్చు. ఫ్రెంచ్ వికీసోర్సు విషయంలో మీరిచ్చిన లంకె పనిచేయడం లేదు. నేను మెటా-వికీలో ప్రపంచవ్యాప్తంగా పలు వికీపీడియాలు, వికీసోర్సులు కాపీహక్కుల విషయంలో చేసుకున్న ఎక్స్ క్లూజన్లకు ఓ లింకు ఇస్తాను పరిశీలించండి. అందులో ఫ్రెంచి వికీసోర్సు ఉంది - కానీ వారు చేసిన ఎక్సెప్షన్ ఏమిటయ్యా అంటే - ఫ్రెంచి చట్టానికి, అమెరికన్ చట్టానికి మధ్య ఎప్పుడైనా ఒక పుస్తకం పబ్లిక్ డొమైన్లో ఉందా లేదా అన్న అంశంపై విప్రతిపత్తి వస్తే ఫ్రెంచి చట్టాన్నే అనుసరిస్తాము (media files that are free according to lex loci but not US law.) అన్న నిబంధన పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ నిబంధన మనం కూడా వర్తింపజేసుకోవచ్చు. అప్పుడు మీరంటున్న PD-India సమస్య ఉండదు. మనం ఏమీ సర్వర్లు తెచ్చి భారతదేశంలో పెట్టుకోనక్కరలేదు. మంచో చెడో మీరే ప్రస్తావించిన ఫ్రెంచి వికీసోర్సు వారి పద్ధతి అనుసరించవచ్చు. అయితే అలాంటి ఏ ఎక్సెప్షన్లు పెట్టుకోవాలన్నా వర్తించే ప్రాతిపదిక ఏమిటో చెప్పండి PD-DLIకి? --పవన్ సంతోష్ (చర్చ) 17:53, 13 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
తా.క.: కాపీహక్కుల పునర్విడుదల గురించిన పనికీ దీనికి సంబంధం లేదు. కాపీహక్కులు పునర్విడుదల అయితే పుస్తకాలు స్థాపించవచ్చు కాబట్టి ఈ విషయంలో తుది నిర్ణయానికి ఆ ప్రయత్నాలు అడ్డురావు. --పవన్ సంతోష్ (చర్చ) 17:53, 13 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
సమస్య ఏమి వస్తోందంటే అర్జున గారూ, రెండు దేశాల్లో ఏదో ఒక దేశంలో సార్వజనీనం అయిన రచనల విషయంలో సమస్య లేదు. పైన మీరు, నేను ప్రస్తావించిన విధంగా విధానాలు మలుచుకోవచ్చు. సమస్య అంతా ఏ దేశపు చట్టాలూ సార్వజనీనం అని ఒప్పని పుస్తకాల గురించే. ఇక కాపీహక్కుల పునర్విడుదల ప్రయత్నాల గురించి నేను వచ్చే వారం ఆరంభంలో రాస్తాను. పైన వివరించిన విధంగా, విధానపరమైన నిర్ణయాలకు ఇవేమీ అడ్డురావు. --పవన్ సంతోష్ (చర్చ) 17:59, 13 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
:::::::::::

పవన్ సంతోష్ గారికి, ఫ్రెంచ్ వికీసోర్స్ లింకు సవరించాను. 1941 మూసని నేను తప్పుపడటం లేదు. ఇతర వికీసోర్సులలో నియమాలు ఎలా వున్నాయో అని ఆసక్తితో పరిశీలించి తెలియచేశాను. ఫ్రెంచి చట్టం, అమెరికా చట్టం రెండు కూడా జీవితం +70 కాబట్టి వారికి పెద్ద సమస్యలేదు. మీరు ఇచ్చిన లింకు ఉపయోగంగానే వుంది దాని ప్రకారం కటలాన్ వికీసోర్స్ లో Non-free content permitted అని కూడా వుంది. ఈ పదబందం(media files that are free according to lex loci but not US law.) ఎక్కడనుండి తీసుకున్నారో తెలియలేదు, గూగుల్ లో వెతికితే Commons:Requests for comment/Non-US Freedom of Panorama under US copyright law లో కనబడింది. కాని అది పుస్తకాలలాంటి వాటికి సంబంధించినది కాదు. ఇప్పటివరకు జరిగిన చర్చలో మీనుండి, చదువరి నుండి కూడా కొత్త సంగతులు తెలిశాయి, కాని ఈ చర్చ అంతా ఏనుగు మరియు గ్రుడ్డి వాళ్లు(ఆంగ్లం) లాగానే వుంది. ఒక అంగీకారానికి రావటం కష్టమనిపిస్తుంది. మధ్యేమార్గంగా, అందరి ఆసక్తులు, పరిమితులు, ప్రస్తుత పరిస్థితులు సమన్వయం చేసే నేను ప్రతిపాదించిన "సవరించిన మూసలతో యదాతథస్థితి ({{PD-India/draft1}} {{Non-free DLI}} }}), మరియు పునర్విడుదలకొరకు ప్రయత్నాలు" అనే నిర్ణయానికి తమ స్పందనలు తెలియచేయవలసిందిగా కోరుతున్నాను.--అర్జున (చర్చ) 03:32, 14 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

"వికీసోర్స్ లో కాపీరైటు అవగాహన వారు తక్కువ కాబట్టి, ఓటింగ్ ద్వారా ఫలితం నిర్ణయించడం కూడా కష్టమే. అందువలన మన మూసలను సవరించుకొని యదాతథస్థితి కొనసాగిస్తూ, కాపీహక్కుల పునర్విడుదలకు కృషి చెయ్యడమే మంచిదని నాకనిపిస్తుంది." - అర్జునరావు గారు రాసినది ఇది. మిగతా వాళ్ళకు కాపీహక్కుల పట్ల అవగాహన తక్కువ కాబట్టి యథాతథ స్థితిని కొనసాగిస్తారా? ఇదే మన అభిప్రాయమైతే పై చర్చంతా ఎందుకు? కాపీహక్కులకు లోబడి ఉన్నవాటిని తొలగించాలని నా అభిప్రాయంగా ఇంతకు ముందు రాసి ఉన్నాను. ఇపుడా అభిప్రాయాన్ని తుంగలో తొక్కేసినట్టేనా? ఈ ఆలోచనా ధోరణి నాకు కలిగించిన ఆశ్చర్యాన్ని అణచుకుంటూ, ఈ చర్చా విషయం గురించి నాకు అర్థమైన దాన్ని, ఈ విషయంపై ఇప్పుడేం చెయ్యాలనే విషయమై నా ఉద్దేశాన్నీ మరోసారి చెప్పేస్తున్నాను.
  • తెలుగు వికీసోర్సులో ఇక్కడికే ప్రత్యేకించిన కాపీహక్కుల విధానాలు ఏమైనా ఉన్నాయా?: లేవు.
  • లేనప్పుడు ఇప్పటివరకూ ఏ విధానాలను పాటిస్తున్నాం?: నాకు తెలిసినంతలో ఏ విధానాలనూ పాటించడం లేదు. మనకెలా అనుకూలంగా ఉంటే అలా చేస్తున్నాం. అందుచేతనే ఈ పరిస్థితికి వచ్చాం మనం. ఇప్పుడు కూడా అలాగే చేద్దామని, ఇతరుల అభ్యంతరాలను, వాళ్లకు కాపీహక్కుల గురించి పెద్దగా తెలీదనే కారణాన్ని చూపెట్టి, పక్కన పెట్టేద్దామనీ అర్జునరావు గారు ప్రతిపాదిస్తున్నారు. నాకు అది సమ్మతం కాదు.
  • ఇప్పుడు ఏం చెయ్యాలి? నా అభిప్రాయాలు:
    • కాపీ హక్కులకు లోబడి ఉన్నవాటిని తొలగించాలి.
    • కాపీ హక్కు ఉన్న వారిని సంప్రదించి, అనుమతులు వచ్చినవాటిని తిరిగి వికీసోర్సులో చేర్చాలి.
    • మన కాపీహక్కుల విధానం ఏమిటో తయారు చేసుకోవాలి. ఏ విధానాన్ని అనుసరించాలో ప్రతిపాదించి, చర్చించి, ఒక నిర్ణయానికి వద్దాం (చర్చలో "కాపీహక్కుల గురించి అంతగా అవగాహన లేనివాళ్ళను" కూడా అనుమతిస్తే)
నమస్కారం. __Chaduvari (చర్చ) 09:53, 14 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
Chaduvari గారికి, మీరు నా వ్యాఖ్యని అపార్ధం చేసుకున్నట్లున్నారు. చర్చ చేసినందువలనే కొత్త సంగతులు తెలుసుకోగలిగాము. ఇప్పడు ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం తక్కువగా వున్నందున ప్రస్తుత పరిస్థితిని కొనసాగించాలనే ప్రతిపాదనపై స్పందనలు కోరాను. మీ ప్రతిపాదన పాటిస్తే, పర్యవసానంగా వికీసోర్స్ పురోగతి ఆరేళ్లు వెనక్కి వెళ్లి మరల ఇంకా పది సంవత్సరాలు చాలా వరకు స్తబ్దమైపోతుందని నా అవగాహన. ఇక నా అభిప్రాయంకూడా స్పష్టంగా తెలియచేస్తాను.
తెలుగు వికీలో పనిచేసేవారు వికీపీడియా కాపీహక్కుల విధానాలు(అవసరమైతే పరిమితులతో) పాటించే ప్రయత్నాలుచేస్తున్నారు. స్కాన్ ఆధారంగా పనిచేసే రోజులలో నకలుహక్కులు అతిక్రమించే వాటిని గుర్తించడమే కష్టమయ్యేది. స్కాన్ ఆధారిత పనిజరిగేటప్పుడు ఇది కొంచం సులభమవటంతో {{PD-India}}, {{PD-DLI}} వాటిపై పనిచేస్తూ, అవికానివాటికి తగిన హెచ్చరిక మూసలు చేర్చటం లాంటి చర్యలు చేస్తూనే వున్నారు.
DLI సర్వర్ ద్వారా వుంచినవి హక్కుదారుల అనుమతితో జరిగినవని తెలిసినందున(ప్రతిదానికి అనుమతి వివరాలు తెలుసుకోలేకపోయినా){{PD-DLI}} పుస్తకాలు సవరించిన మూసతో వికీసోర్స్ లో కొనసాగించాలి.
{{PD-India}} పుస్తకాల కొరకు కూడా సవరించిన మూసతో వికీసోర్స్ లో కొనసాగించాలి. Non free మినహాయింపులు ఇతర వికీసోర్స్ లలో వాడుతున్నట్లు మన వికీసోర్స్ లోను వాడుకోవచ్చు.
హక్కుదారులనుండి CC-BY-SA విడుదలకు ప్రయత్నించాలి. ఒక వేళ అభ్యంతరాలెదురైతే అటువంటి కృతిని తొలగించవచ్చు.
పై విషయాన్నే నేను తెలుగు వికీ నియమాలుగా ప్రతిపాదిస్తున్నాను.
మూస చర్చలు ఎంతవరకూ కొలిక్కిరాక, ప్రతిష్టంభన ఎదురైనప్పుడు కొంతకాలం వేచిచూడడం నాకు మార్గమనిపించింది. మీకు ఏదైనా మెరుగైన విధానం తెలిస్తే ప్రతిపాదించండి. కాపీహక్కులపై అవగాహన ప్రతి ఒక్కరికి లోతుగా వుండదనే విషయన్నే పైన తెలియచేశాను,సంబంధించిన వివరాలను పంచేవారిని పై వ్యాఖ్యలో గుర్తించడం కూడా జరిగింది. ఎవరినీ కించపరచాలని, చర్చలో పాల్గొనవద్దనీ అనలేదని గమనించండి. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 06:16, 20 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఇక ప్రతిస్పందనలు లేనందున, {{PD-DLI}} స్థానే {{Non-free DLI}} సంబంధిత అంశాలలో చేర్చడం, ఏవైనా తొలగింపు మూసలు వుంటే వాటిని తీసివేయడం చేస్తాను.--అర్జున (చర్చ) 10:08, 28 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పుస్తకాల తొలగింపు కోసం ప్రతిపాదన[మార్చు]

తెలుగు వికీసోర్సులో ఈ మూస ప్రాతిపదిక, దీని ఆధారంగా వచ్చిన పుస్తకాల కాపీహక్కుల స్థితి బహుచర్చిత అంశం. కాబట్టి ఈ అంశంల ప్రధానమైన సారాంశాన్ని ఇక్కడ ఇస్తున్నాను. ఈ కింద వివరించిన పుస్తకాలు భారతీయ కాపీహక్కుల చట్టం 1956ను అనుసరించి అమెరికన్ కాపీహక్కుల చట్టాలను కూడా పరిశీలించి సమన్వయం చేసి రూపొందించిన మార్గదర్శిని ప్రకారం ఇప్పటికీ కాపీహక్కుల పరిధిలోనే ఉన్నాయి:

ఈ పుస్తకాలన్నిటినీ వికీసోర్సులోంచి తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 18:56, 13 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగించేయండి, కోపంగా. ఇంకేమైనా కాపీహక్కుల ఉల్లంఘనలను నిర్ధారణ చేయగలిగితే, వాటిని కూడా చేర్చి తక్షణమే తొలగించండి. అవసరమైతే వికీమీడియాలోని నిర్వాహకుల సహాయం తీసుకోండి. అక్కడితో తెలుగు వికీసోర్సు శుద్ధి కార్యక్రమం పూర్తవుతుంది. మీరు తీసుకొంటున్న చొరవకు ధన్యవాదాలు (వ్యంగ్యంగా - రహ్మానుద్దీన్). మీరు ఏమీ పనిచేయరు, పనిచేస్తున్నవారి శ్రమను వృధాగావించడానికి ముందుంటారు. ఇది వికీపీడియా ఉద్యమానికి మంచిది కాదు Rajasekhar1961 (చర్చ) 04:24, 14 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
క్రిందటి విభాగంలో చర్చ కొలిక్కి రాకుండా తొలగింపు ప్రతిపాదనలు అర్ధరహితం, అందరూ గమనించవలసినది.--అర్జున (చర్చ) 10:36, 22 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ! ఇందులో అర్థరహితమేమీ లేదు. పైనున్నది కేవలం మూస గురించిన చర్చ అది ఒక కొలిక్కి వచ్చింది. ఇది ఆ పుస్తకాలన్నిటినీ ఉంచుదామా వద్దా, ఉంచితే ఎలాంటి పద్ధతిలో ఉంచాలన్న అంశానికి సంబంధించిన చర్చ. దయచేసి అర్థం చేసుకోగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 17:10, 23 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగించే ముందు వాటిలో పనిచేసిన వాడుకరులకు ఒక సందేశాన్ని పంపిస్తే బాగుంటుందని నా సూచన. ఇందులో కొన్ని పుస్తకాలపై పనిచేయడానికి నేను ప్రోత్సహించిన వ్యక్తిగా వారినుండి క్షమాపణలను కోరుతున్నాను.--Rajasekhar1961 (చర్చ) 04:52, 24 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు మొదట్నుంచీ ఈ కాపీరైటు సమాచారం కొరుకుడుపడని సమాచారం. దానికితోడు మనదేశంలో స్పష్టమైన చట్టాలు లేవు. రోజులు గడిచేకొద్దీ కాపీరైటుకు కొత్త అర్థాలు పుట్టుకొస్తున్నాయి. జరిగిన పని ఎలాగో జరిగింది. మధ్యే మార్గంగా ప్రస్తుతం ఉన్న పుస్తకాలను ప్రస్తుతానికి తొలగించకుండా అలాగే ఉంచి, సదరు కాపీరైటు యజమానులని జరిగిన విషయం క్లుప్తంగా తెలియజేసి సాధ్యమైనంతవరకు ఉంచేలా చూడాలి. ఇకపై జరగబోయే పని విషయంలో చదువరి గారు చెప్పినట్లుగా ఖచ్చితంగా కాపీరైటు సమస్యలు లేని పుస్తకాలను మాత్రమే పరిశీలించాలి. ఇది నా అభిప్రాయం. రవిచంద్ర (చర్చ) 12:13, 25 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  • పైన ఉదహరించిన పుస్తకాలలో దాదాపు 6 పుస్తకాలకు నేను పని చేసాను. సాధారణంగా ఒక్కొక్క అక్షరం చేతితో టైపు చేసి డిజిటలైజ్ చేసాను. అలా పని చేయడానికే నేను ఇష్టపడతాను కనుక అలా చేసాను. ఒక్కొక్క పుస్తకానికి దాదాపు ఒక మాసం నుండి రెండు మాసాల కాలం దినమంతా పూర్తిగా పని చేసి పుస్తకాలను వ్రాసాను. డి.ఎల్.ఐ. నుండి స్కాన్ చేసిన పుస్తకాలు కాఫీ హక్కుల కాలపరిధిని దాటినవని నేను భావించాను. సీనియర్ సభ్యుల అనుభవాన్ని, వారికున్న విష్యఙానాన్ని విశ్వసించి ఇవి సమస్యారహితమైనవని భావించి వీటిలో పని చేసాను. ఇప్పుడు అవి తొలగించ బడతాయని మూస ద్వారా తెలుసుకున్నాను. అవగాహనా లోపం వలన జరిగిన పొరబాటు కనుక నేను చేసిన శ్రమను దృష్టిలో ఉంచుకుని ' ఫెయిర్ యూజ్ " కాఫీరైట్ లైసెన్స్ ఉపయోగించి ఈ పుస్తకాలను సంరక్షించడానికి సహకరించాలని సహవికీపీడియన్లను కోరుతున్నాను. ఇప్పుడు నాకు కాఫీ హక్కుల గురించి కొంత అవగాహన కలిగిన కారణంగా ఇక మీదట కాఫీ హక్కుల సనస్య లేని పుస్తకాలలో మాత్రమే పని చేయాలని నేను భావిస్తున్నాను.శ్రీరామమూర్తి (చర్చ) 12:59, 25 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
శ్రీరామమూర్తి గారూ, ఎంతో నాణ్యతతో మీరు చేసే టైపింగు పనిని చాన్నాళ్ళుగా గమనిస్తున్నాను. తొలి దశ టైపింగు చేసే వాడుకరులు వికీసోర్సుకు వెన్నెముకలాంటి వారు. కాపీహక్కుల కారణంగా ఏ పుస్తకాన్నైనా సరే తీసేయాల్సి రావడం చాలా బాధాకరం, వారి శ్రమకు కత్తివేటు. అయితే.. కాపీహక్కుల విషయంలో సర్దుకునేందుకు మనకు అతి తక్కువ వెసులుబాటు ఉందని మనం గమనించాలి. వికీసోర్సు కాపీహక్కుల గురించి స్పష్టంగా చెబుతోంది సార్. ఈ రెండు లింకులను గమనించండి -1, 2. ఈ రెంటిలోనూ మొదటిది -
  • ఫెయిర్ యూజ్ గురించి- "వికీసోర్సులో ఫెయిర్ యూజ్‌ను విస్పష్టంగా నిషేధించాం" అని చెబుతోంది.
  • కాపీహక్కుదారులను సంప్రదించడం కష్టమైనా, అసలే సంప్రదించలేకపోయినా ఆ కృతి వికీసోర్సులో నిషిద్ధం అని చెబుతోంది.
  • వికీసోర్సులో ప్రచురించిన వాటిని వేరేచోట తిరిగి స్వేచ్ఛగా వాడుకునేందుకు అనుమతించని కృతులు నిషిద్ధం అని చెబుతోంది.
  • కాపీహక్కులు ఉన్నాయో లేవో తెలీదు గానీ, బహుశా వికీసోర్సుకు అనుకూలమైన లైసెన్సు ఉండి ఉండవచ్చు అని అనుకున్న సందర్భంలో కూడా సదరు కృతిని వికీసోర్సు అనుమతించడం లేదు - ఏవో ప్రత్యేకించిన కొన్ని తప్ప!
  • ఇంకోటి.. డియెల్లై/ఆర్కైవ్.ఆర్గ్ లాంటిదే ప్రాజెక్ట్ గ్యుటెన్‌బర్గ్ కూడా. అక్కడ ప్రచురించిన పుస్తకాలు వికీసోర్సులో పెట్టేందుకు పనికిరావని చెబుతోంది. అక్కడి లైసెన్సు అటువంటిది-డెరివేటివ్ కృతులను అది అనుమతించదు.
ఇదంతా చెబుతున్నాను కాబట్టి, వీటిని తీసెయ్యాల్సిందే అని నేను పట్టుబడుతున్నానని అనుకోవద్దు. కాపీ హక్కుల గురించి నాకు తెలిసినదాన్ని పంచుకుంటున్నానంతే. ఏదో రకంగా కాపీహక్కులు సంపాయించి, ఆయా పుస్తకాలను తీసెయ్యకుండా ఉంచేస్తే సంతోషించేవాళ్ళలో నేనూ ఒకణ్ణి. ఒక ప్రయత్నంగా రవిచంద్ర గారు చెప్పినట్టు కాపీహక్కుదారులను సంప్రదించవచ్చు. వారి నుండి ఆ పుస్తకాలపై హక్కులను పొందగలమేమో చూడమని ఆయా పుస్తకాలు ఎక్కించిన వాళ్ళను కోరుతున్నాను. __Chaduvari (చర్చ) 17:09, 25 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారూ, "మీరు ఏమీ పనిచేయరు, పనిచేస్తున్నవారి శ్రమను వృధాగావించడానికి ముందుంటారు." - ఈ మాట మీరు ఎవరిని ఉద్దేశించారో నాకు తెలీదు. ఎవరిని ఉద్దేశించినా సరే.. అది చాలా దురుసుగా ఉంది. చర్చ స్థాయిని దిగజారుస్తోంది. ఇకపోతే చర్చలో ఒకసారి రాసిన పాఠ్యాన్ని మార్చడం సంప్రదాయం కాదు (అచ్చు తప్పులు సరిదిద్దడం, ఆకృతిని సవరించడం లాంటివి మినహాయించి). మీరు మొదట రాసిన అభిప్రాయాన్ని దాదాపు వ్యతిరేకమైన అభిప్రాయంగా మార్చేసారు. అభిప్రాయాన్ని మార్చుకోవడం తప్పు కాదు, కానీ ఆ సంగతిని మరో వ్యాఖ్యగా రాసి ఉండాల్సింది. __Chaduvari (చర్చ) 17:26, 25 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari: వికీ సాంప్రదాయానికి విరుద్ధంగా చేశాను. క్షమించండి. ఇకముందు ఇలాంటివి చేయను. పనిచేయని వారికి చర్చలో పాల్గొనే అధికారాలు స్వేచ్చ ఉన్నాయి. కానీ కష్టపడి పనిచేసిన పుస్తకాలను తొలగిసున్నందులకు బాధగా ఉన్నది. ఆ బాధలో నోరు (చేయి జారాను). మరోసారి క్షమాపనలు కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 13:08, 5 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారూ, చాలా హుందాగా స్పందించారు. ధన్యవాదాలు. నమస్కారం. __Chaduvari (చర్చ) 14:32, 5 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మూస తొలగింపు[మార్చు]

{{PD-DLI}} స్థానే {{Non-free DLI}} చేర్చినందున, మూస తొలగిస్తున్నాను.--అర్జున (చర్చ) 04:11, 29 నవంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]