వికీసోర్స్:ఈ శతాబ్దపు రచనా శతం/వికీసోర్సులో పుస్తకాల స్థితి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సార్వజనీనం[మార్చు]

జాబితా సంఖ్య రచయిత/ సంపాదకుడు శీర్షిక మొదట ప్రచురించిన దశాబ్దం వికీసోర్సు పరంగా స్థితి వ్యాఖ్య
1. దాసు శ్రీరాములు తెలుగు నాడు 1910 సార్వజనీనమైన కృతి, తెవికీసోర్సులో ఉంది. ఇంకా (సెప్టెంబరు 2018) పూర్తికాలేదు.
2. దువ్వూరి రామిరెడ్డి పానశాల 1940 భారతదేశంలో సార్వజనీనమైన కృతి, తెవికీసోర్సులో ఉంది. ఇంకా (సెప్టెంబరు 2018) పూర్తికాలేదు, ఉపోద్ఘాతం ఒక్కదానినీ టైపు చేస్తే పూర్తవుతుంది.
3. గురజాడ అప్పారావు ముత్యాల సరాలు 1910 సార్వజనీనమైన కృతి, తెవికీసోర్సులో ఉంది. స్కాన్ ఆధారితంగా లేదు. గురజాడలు స్కాన్ పుస్తకం కూడా ఇక్కడే ఉన్నందున, దీన్ని స్కాన్ ఆధారితం చేసేస్తే పూర్తవుతుంది.
4. నండూరి సుబ్బారావు ఎంకి పాటలు 1930 భారతదేశంలో సార్వజనీనం. వికీసోర్సులో యెంకి పాటలున్నాయి.
5. ఏటుకురి వెంకటనరసయ్య మగువమాంచాల 1940 భారతదేశంలో సార్వజనీనం. మగువమాంచాల తెలుగు వికీసోర్సులో ఇంకా (సెప్టెంబరు 2018) చేర్చలేదు.
6. చిలకమర్తి లక్ష్మీనరసింహం గణపతి 1920 ఈ రచన భారతదేశంలో సార్వజనీనం. తెవికీసోర్సులో ఉంది. ఇంకా (అక్టోబరు 2018) పూర్తికాలేదు
7. గురజాడ అప్పారావు కన్యాశుల్కం 1900 సార్వజనీనం. వికీసోర్సులో పూర్తైంది. అయితే కన్యాశుల్కం తొలి కూర్పు వేరే ఉంది. గురజాడలులో అది ఉంది, దానిని కూడా పూర్తిచేస్తే పరిశీలకులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అంతర్జాలంలో కన్యాశుల్కం తొలి కూర్పు మొమ్మొదట అందించినవారం అవుతాం.
8. కాళ్ళకూరి నారాయణ రావు వరవిక్రయం 1920 సార్వజనీనం. వికీసోర్సులో పాఠ్యీకరణ అయింది కానీ అచ్చుదిద్దాలి.
9. తిరుపతి వేంకట కవులు పాండవోద్యోగ విజయాలు 1920 కృతి భారతదేశంలో సార్వజనీనం. పాండవోద్యోగ విజయాలు పుస్తకం ఇంకా వికీసోర్సులో లేదు. చేర్చి పూర్తిచేయాలి.
10. త్రిపురనేని రామస్వామి శంబుకవధ 1930 కృతి భారతదేశంలో సార్వజనీనం. శంబుకవధ వికీసోర్సులో చేర్చాను; పూర్తిచేయాలి.
11. వేదం వేంకటరాయ శాస్త్రి ప్రతాపరుద్రీయం 1910 సార్వజనీనం. ప్రతాపరుద్రీయం ఇంకా వికీసోర్సులో లేదు. చేర్చి పూర్తిచేయాలి.
12. ఆదిభట్ల నారాయణ దాసు నాయెరుక 1920 సార్వజనీనం. నాయెఱుక ఇంకా వికీసోర్సులో లేదు. చేర్చి పూర్తిచేయాలి.
13. చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి కథలు గాధలు 1940 భారతదేశంలో సార్వజనీనం. మొదటి సంపుటం తెలుగు వికీసోర్సులో పాఠ్యీకరణ పూర్తై అచ్చుదిద్దడానికి సిద్ధంగా ఉంది. రెండవ సంపుటం వికీసోర్సులో చేర్చి పూర్తిచేయాలి.
14. కందుకూరి వీరేశలింగం స్వీయ చరిత్ర 1920 సార్వజనీనం. మొదటి భాగం అచ్చుదిద్దారు, ఆమోదం కోసం చూస్తోంది. రెండవ భాగం పాఠ్యీకరణ పూర్తై అచ్చుదిద్దడానికి సిద్ధంగా ఉంది.
15. టంగుటూరి ప్రకాశం నా జీవిత యాత్ర 1940 కృతి నాలుగో భాగం తప్ప భారతదేశంలో సార్వజనీనం. వికీసోర్సులో పూర్తైంది. నాలుగో భాగం కాపీహక్కులు తెన్నేటి విశ్వనాథం వారసుల వద్ద అప్రమేయంగా ఉన్నాయనుకోవాలి. కాబట్టి స్వేచ్చా నకలు హక్కుల్లో విడుదల చేయించుకుందుకు ప్రయత్నించాలి. సాధ్యం కాకుంటే అది ఎలాగూ అనుబంధమే కాబట్టి తొలగించాలి.
16. రచయిత:అక్కిరాజు ఉమాకాంతం నేటి కాలపు కవిత్వం 1930 కృతి భారతదేశంలో సార్వజనీనం. వికీసోర్సులో చేర్చాను; పూర్తిచేయాలి.
17. కట్టమంచి రామలింగారెడ్డి కవిత్వతత్వ్త విచారము 1930 కృతి భారతదేశంలో సార్వజనీనం. వికీసోర్సులో పాఠ్యీకరణ పూర్తై, అచ్చుదిద్దడం కోసం ఎదురుచూస్తోంది.
18. గిడుగు రామమూర్తి ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం 1920 సార్వజనీనం. పుస్తకం వికీసోర్సులో పాఠ్యీకరణ అయింది, అచ్చుదిద్దడం కోసం ఎదురుచూస్తోంది.
19. పానుగంటి లక్ష్మీనరసింహారావు సాక్షి వ్యాసాలు 1930 సార్వజనీనం. సాక్షి మూడవ సంపుటం తెలుగు వికీసోర్సులో ఆమోదమై పూర్తైపోయింది. మిగిలిన సంపుటాలు చేర్చి పూర్తిచేయాలి.
20. సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర 1950 భారతదేశంలో సార్వజనీనం అయింది. ఆమోదమై, పూర్తైంది.

త్వరలో సార్వజనీనమయ్యే కృతులు[మార్చు]

జాబితా సంఖ్య రచయిత/ సంపాదకుడు శీర్షిక మొదట ప్రచురించిన దశాబ్దం వికీసోర్సు పరంగా స్థితి వ్యాఖ్య
1. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనుభవాలు జ్ఞాపకాలు 1930 2022లో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మరణించి 60 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆయన రచనలన్నీ భారతదేశంలో సార్వజనీనం అవుతాయి. కాబట్టి మరో నాలుగేళ్ళ తర్వాత ఆయన రచనలపై వికీసోర్సులో పనిచేయవచ్చు.
2. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వివిధ కథలు 1940 2022లో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మరణించి 60 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆయన రచనలన్నీ భారతదేశంలో సార్వజనీనం అవుతాయి. కాబట్టి మరో నాలుగేళ్ళలో ఆయన రచనలపై వికీసోర్సులో పనిచేయవచ్చు.
3. గోపీచంద్‌ త్రిపురనేని అసమర్థుని జీవితయాత్ర 1930 2023లో త్రిపురనేని గోపీచంద్ రచనలు భారతదేశంలో సార్వజనీనం అవుతాయి. కాబట్టి ఐదేళ్ళ తర్వాత మనం వికీసోర్సులో ఈ రచనపై పనిచేయగలం.
4. శ్రీదేవి కాలాతీతవ్యక్తులు 1940 2022లో పి.శ్రీదేవి రచనలు భారతదేశంలో సార్వజనీనం అవుతున్నాయి. కాబట్టి వీటిపై వికీసోర్సులో మరో నాలుగేళ్ళ తర్వాత పనిచేయవచ్చు.(సెప్టెంబరు 2018)
5. ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి 1920 ఉన్నవ లక్ష్మీనారాయణ కృతులు 2019 జనవరి నుంచి భారతదేశంలో సార్వజనీనం అవుతాయి. కాబట్టి అప్పుడు పుస్తకాన్ని ఎక్కించి పనిచేయవచ్చు.
6. భమిడిపాటి కామేశ్వర రావు కచటతపలు 1940 2019 నుంచి భమిడిపాటి కామేశ్వరరావు కృతులు భారతదేశంలో సార్వజనీనం అవుతాయి. కాబట్టి 2019లో దీనిపై వికీసోర్సులో పనిచేయవచ్చు.

స్వేచ్చానకలు హక్కుల్లో విడుదల చేయదగ్గవి[మార్చు]

జాబితా సంఖ్య రచయిత/ సంపాదకుడు శీర్షిక మొదట ప్రచురించిన దశాబ్దం వికీసోర్సు పరంగా స్థితి వ్యాఖ్య
1. కాళీపట్నం రామారావు కా.రా. కథలు 1980 కారా మాస్టారు కాపీహక్కుల పరిధిలో ఉన్నారు. అయితే స్వేచ్ఛా నకలు హక్కుల్లో ఆయన కృతులు విడుదల చేయమని కోరవచ్చు.
2. బీనాదేవి పుణ్యభూమీ కళ్ళు తెరు 1970 బీనాదేవి జంటలో భార్య త్రిపురసుందరీ దేవి జీవించివున్నారు. వారిని సీసీ-బై-ఎస్‌ఎ లైసెన్సులో విడుదల చేసే అవకాశాలు పరిశీలించమని కోరవచ్చు.
3. మహీధర రామమోహన రావు కొల్లాయిగట్టితేనేమి 1960 మహీధర రామమోహనరావు జీవించిన కాలాన్ని బట్టి చూస్తే ఈ రచన కాపీహక్కుల పరిధిలో ఉన్నా, రామమోనహనరావు తన మార్క్సిస్టు దృక్పథంతో రచనను సమాజ వినియోగం కొరకు సార్వజనీనం చేసేశారని వినికిడి. కానీ ఈ విషయాన్ని నిర్ధారణగా తేల్చుకోవాలి.
4. మొక్కపాటి నరసింహ శాస్త్రి బారిస్టర్‌ పార్వతీశం 1940 ఈ కృతి వికీసోసర్సులో పూర్తై ఉంది. కానీ రచయిత మరణించిన తేదీ బట్టి ఈ కృతి మరో పదిహేనేళ్ళ వరకూ భారతదేశంలో సార్వజనీనం కాదు. దీని ప్రాచుర్యం దృష్ట్యా, కాపీలు చెల్లిపోతున్న పద్ధతి దృష్ట్యా చూస్తే దీన్ని తక్షణం తొలగించాలి.
5. పుచ్చలపల్లి సుందరయ్య విప్లవ పథంలో నా పయనం 1950 పుచ్చలపల్లి సుందరయ్య రచనలు ఈ కృతితో సహా స్వేచ్చా నకలు హక్కుల్లో విడుదల చేయడానికి సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించి చూడవచ్చు.