వికీసోర్స్:ఈ శతాబ్దపు రచనా శతం
Jump to navigation
Jump to search
నేపథ్యం - ఆలోచన[మార్చు]
20వ శతాబ్ది ముగుస్తున్న 1999లో ప్రముఖ తెలుగు విమర్శకుడు, అనువాదకుడు వెల్చేరు నారాయణరావు నేతృత్వంలోని బృందం ఎంపిక చేసిన జాబితా ఇది. 20వ శతాబ్దిలో ప్రచురితమై, తప్పక చదవాల్సిన వంద పుస్తకాల జాబితా ఇది. తానా వారి తెలుగు పలుకు, ఈమాట పత్రికల్లో ప్రచురితమైంది. ఇటువంటి ఏ జాబితాలాగా అయినా వదిలివేసిన పుస్తకాల గురించి, స్వీకరించిన పుస్తకాల గురించి గట్టి విమర్శలే ఎదురయ్యాయి, కానీ అనివార్యమైన ఆ వివాదాలు తప్పిస్తే ఒక మంచి జాబితాగా దీన్ని స్వీకరించవచ్చు. సార్వజనీనమైన పుస్తకాలను పూర్తిచేయడానికి, కాని పుస్తకాలు స్వేచ్ఛా నకలు హక్కుల పరిధిలోకి తీసుకురావడానికి మార్గాలు అన్వేషించడానికి ప్రాధాన్యతలు తెలిసేందుకు ఇటువంటి జాబితాలు ఉపకరిస్తాయి. ఈ జాబితాల్లోనివే ప్రాధాన్యత అన్నది కాదు అసలైన ఉద్దేశం, ఆసక్తి ఉన్నవారికి సాయం చేసేందుకు మాత్రమే ఉద్దేశించింది.
కవిత్వం[మార్చు]
జాబిత సంఖ్య | రచయిత/ సంపాదకుడు | శీర్షిక | మొదట ప్రచురించిన దశాబ్దం | వికీసోర్సు పరంగా స్థితి |
---|---|---|---|---|
1. | అజంతా | స్వప్నలిపి | 1990 | |
2. | ఆలూరి బైరాగి | ఆగమ గీతి | 1960 | |
3. | ఆరుద్ర | ఇంటింటి పజ్యాలు, త్వమేవాహం | 70, 1950 | |
4. | బోయి భీమన్న | రాగ వైశాఖి | 1960 | |
5. | దాశరథి కృష్ణమాచార్య | కవితా సంకలనం | 1950 | |
6. | దాసు శ్రీరాములు | తెలుగు నాడు | 1910 | సార్వజనీనమైన కృతి, తెవికీసోర్సులో ఉంది. ఇంకా (సెప్టెంబరు 2018) పూర్తికాలేదు. |
7. | దేవులపల్లి కృష్ణ శాస్త్రి | కృష్ణపక్షము, ప్రవాసము, ఊర్వశి | 1930 | |
8. | దిగంబర కవులు | దిగంబరకవిత్వం | 1970 | |
9. | దువ్వూరి రామిరెడ్డి | పానశాల | 1940 | భారతదేశంలో సార్వజనీనమైన కృతి, తెవికీసోర్సులో ఉంది. ఇంకా (సెప్టెంబరు 2018) పూర్తికాలేదు, ఉపోద్ఘాతం ఒక్కదానినీ టైపు చేస్తే పూర్తవుతుంది. |
10. | గురజాడ అప్పారావు | ముత్యాల సరాలు | 1910 | సార్వజనీనమైన కృతి, తెవికీసోర్సులో ఉంది. స్కాన్ ఆధారితంగా లేదు. గురజాడలు స్కాన్ పుస్తకం కూడా ఇక్కడే ఉన్నందున, దీన్ని స్కాన్ ఆధారితం చేసేస్తే పూర్తవుతుంది. |
11. | ఇస్మాయిల్ | చెట్టు నా ఆదర్శం | 1960 | |
12. | జాషువా | గబ్బిలం | 1950 | |
13. | జయప్రభ | చింతల నెమలి | 1990 | |
14. | ఖాదర్ మొహియుద్దీన్ | పుట్టు మచ్చ | 1990 | |
15. | కొండేపూడి నిర్మల | నడిచే గాయాలు | 1990 | |
16. | మహె జబీన్ | ఆకు రాలే కాలం | 1990 | |
17. | ముద్దుకృష్ణ (సం.) | వైతాళికులు | 1940 | |
18. | నగ్నముని | కొయ్య గుర్రం | 1970 | |
19. | నండూరి సుబ్బారావు | ఎంకి పాటలు | 1930 | భారతదేశంలో సార్వజనీనం. వికీసోర్సులో యెంకి పాటలున్నాయి. |
20. | ఓల్గా, కన్నబిరాన్ (సం.) | నీలిమేఘాలు | 1990 | |
21. | పఠాభి | ఫిడేలు రాగాల డజన్ | 1930 | |
22. | పింగళి కాటూరి కవులు | సౌందరనందము | 1940 | |
23. | రాయప్రోలు సుబ్బారావు | తృణకంకణము | 1920 | |
24. | సతీష్ చందర్ | పంచమవేదం | 1990 | |
25. | శివారెడ్డి | శివారెడ్డి కవితలు | 1980 | |
26. | శ్రీశ్రీ | మహాప్రస్థానం | 1940 | |
27. | శ్రీశ్రీ | ఖడ్గ సృష్టి | 1950 | |
28. | తిలక్ దేవరకొండ బాలగంగాధర | అమృతం కురిసిన రాత్రి | 1950 | |
29. | జి. లక్ష్మీనరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్ (సం.) | చిక్కనవుతున్న పాట | 1990 | |
30. | తుమ్మల సీతారామమూర్తి చౌదరి | రాష్ట్రగానము | 1950 | |
31. | వేగుంట మోహనప్రసాద్ | చితి చింత | 1980 | |
32. | విద్వాన్ విశ్వం | పెన్నేటి పాట | 1950 | |
33. | విశ్వనాథ సత్యనారాయణ | కిన్నెరసాని పాటలు | 1930 | |
34. | విశ్వనాథ సత్యనారాయణ | రామాయణ కల్పవృక్షము | 1950 | |
35. | ఏటుకురి వెంకటనరసయ్య | మగువమాంచాల | 1940 | భారతదేశంలో సార్వజనీనం. మగువమాంచాల తెలుగు వికీసోర్సులో ఇంకా (సెప్టెంబరు 2018) చేర్చలేదు. |
కథలు[మార్చు]
కథలు (16) జాబిత సంఖ్య | రచయిత/ సంపాదకుడు | శీర్షిక | మొదట ప్రచురించిన దశాబ్దం | వికీసోర్సు పరంగా స్థితి |
---|---|---|---|---|
1. | ఎ. ఎస్. మూర్తి | తానా తెలుగు కథ | 1990 | |
2. | అబ్బూరి ఛాయాదేవి | ఛాయాదేవి కథలు | 1960 | |
3. | భానుమతీ రామకృష్ణ | అత్తగారి కథలు | 1960 | |
4. | చాగంటి సోమయాజులు | చాసో కథలు | 1940 | |
5. | ఎం .ఎ. సుభాన్ (సం.) | కథాసాగర్ | 1990 | |
6. | కాళీపట్నం రామారావు | కా.రా. కథలు | 1980 | కారా మాస్టారు కాపీహక్కుల పరిధిలో ఉన్నారు. అయితే స్వేచ్ఛా నకలు హక్కుల్లో ఆయన కృతులు విడుదల చేయమని కోరవచ్చు. |
7. | కొడవటిగంటి కుటుంబరావు | కథలు | 1950 | |
8. | మధురాంతకం రాజారాం | కథలు | 1980 | |
9. | ముళ్ళపూడి వెంకట రమణ | బుడుగు | 1950 | |
10. | ముళ్ళపూడి వెంకట రమణ | వివిధ కథలు | 1950 | |
11. | మునిమాణిక్యం నరసింహా రావు | కాంతం కథలు | 1940 | |
12. | నామిని సుబ్రహ్మణ్యం నాయుడు | పచ్చనాకు సాక్షిగా | 1990 | |
13. | పాలగుమ్మి పద్మరాజు | వివిధ కథలు | 1940 | |
14. | రాచకొండ విశ్వనాథ శాస్త్రి | వివిధ కథలు | 1960 | |
15. | సత్యం శంకరమంచి | అమరావతి కథలు | 1970 | |
16. | శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి | వివిధ కథలు | 1940 | 2022లో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మరణించి 60 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆయన రచనలన్నీ భారతదేశంలో సార్వజనీనం అవుతాయి. కాబట్టి మరో నాలుగేళ్ళలో ఆయన రచనలపై వికీసోర్సులో పనిచేయవచ్చు. |
నవలలు[మార్చు]
నవలలు (21) జాబిత సంఖ్య | రచయిత/ సంపాదకుడు | శీర్షిక | మొదట ప్రచురించిన దశాబ్దం | వికీసోర్సు పరంగా స్థితి |
---|---|---|---|---|
1. | బీనాదేవి | పుణ్యభూమీ కళ్ళు తెరు | 1970 | బీనాదేవి జంటలో భార్య త్రిపురసుందరీ దేవి జీవించివున్నారు. వారిని సీసీ-బై-ఎస్‌ఎ లైసెన్సులో విడుదల చేసే అవకాశాలు పరిశీలించమని కోరవచ్చు. |
2. | బుచ్చిబాబు | చివరకు మిగిలేది | 1940 | |
3. | చలం | మైదానం | 1940 | |
4. | చంద్రలత | రేగడివిత్తులు | 1990 | |
5. | చిలకమర్తి లక్ష్మీనరసింహం | గణపతి | 1920 | సార్వజనీనమైన కృతి, తెవికీసోర్సులో ఉంది. ఇంకా (మార్చి 2019) పూర్తికాలేదు. |
6. | గోపీచంద్ త్రిపురనేని | అసమర్థుని జీవితయాత్ర | 1930 | 2023లో త్రిపురనేని గోపీచంద్ రచనలు భారతదేశంలో సార్వజనీనం అవుతాయి. కాబట్టి ఐదేళ్ళ తర్వాత మనం వికీసోర్సులో ఈ రచనపై పనిచేయగలం. |
7. | జీ. వి. కృష్ణారావు | కీలుబొమ్మలు | 1940 | |
8. | కేశవ రెడ్డి | రాముడుండాడు రాజ్జెవుండాది | 1990 | |
9. | కొడవటిగంటి కుటుంబరావు | చదువు | 1940 | |
10. | లత తెన్నేటి హేమలత | గాలిపడగలు నీటి బుడగలు | 1970 | |
11. | మహీధర రామమోహన రావు | కొల్లాయిగట్టితేనేమి | 1960 | మహీధర రామమోహనరావు జీవించిన కాలాన్ని బట్టి చూస్తే ఈ రచన కాపీహక్కుల పరిధిలో ఉన్నా, రామమోనహనరావు తన మార్క్సిస్టు దృక్పథంతో రచనను సమాజ వినియోగం కొరకు సార్వజనీనం చేసేశారని వినికిడి. కానీ ఈ విషయాన్ని నిర్ధారణగా తేల్చుకోవాలి. |
12. | మొక్కపాటి నరసింహ శాస్త్రి | బారిస్టర్ పార్వతీశం | 1940 | ఈ కృతి వికీసోసర్సులో పూర్తై ఉంది. కానీ రచయిత మరణించిన తేదీ బట్టి ఈ కృతి మరో పదిహేనేళ్ళ వరకూ భారతదేశంలో సార్వజనీనం కాదు. దీని ప్రాచుర్యం దృష్ట్యా, కాపీలు చెల్లిపోతున్న పద్ధతి దృష్ట్యా చూస్తే దీన్ని తక్షణం తొలగించాలి. |
13. | రంగనాయకమ్మ | స్వీట్‌హోం | 1960 | |
14. | శ్రీదేవి | కాలాతీతవ్యక్తులు | 1940 | 2022లో పి.శ్రీదేవి రచనలు భారతదేశంలో సార్వజనీనం అవుతున్నాయి. కాబట్టి వీటిపై వికీసోర్సులో మరో నాలుగేళ్ళ తర్వాత పనిచేయవచ్చు.(సెప్టెంబరు 2018) |
15. | ఉన్నవ లక్ష్మీనారాయణ | మాలపల్లి | 1920 | ఉన్నవ లక్ష్మీనారాయణ కృతులు 2019 జనవరి నుంచి భారతదేశంలో సార్వజనీనం అవుతాయి. కాబట్టి అప్పుడు పుస్తకాన్ని ఎక్కించి పనిచేయవచ్చు. |
16. | ఉప్పల లక్ష్మణ రావు | అతడు ఆమె | 1930 | |
17. | వడ్డెర చండీదాస్ | హిమజ్వాల | 1970 | |
18. | వాసిరెడ్డి సీతాదేవి | మట్టిమనిషి | 1970 | |
19. | విశ్వనాథ సత్యనారాయణ | వేయి పడగలు | 1930 | |
20. | యద్దనపూడి సులోచనారాణి | సెక్రటరి | 1970 | |
21. | యండమూరి వీరేంద్రనాథ్ | తులసిదళం | 1970 |
నాటకాలు/నాటికలు[మార్చు]
నాటకాలు/నాటికలు (10) జాబిత సంఖ్య | రచయిత/ సంపాదకుడు | శీర్షిక | మొదట ప్రచురించిన దశాబ్దం | వికీసోర్సు పరంగా స్థితి |
---|---|---|---|---|
1. | ఆత్రేయ | నాటకాలు | 1940 | |
2. | భమిడిపాటి కామేశ్వర రావు | కచటతపలు | 1940 | 2019 నుంచి భమిడిపాటి కామేశ్వరరావు కృతులు భారతదేశంలో సార్వజనీనం అవుతాయి. కాబట్టి 2019లో దీనిపై వికీసోర్సులో పనిచేయవచ్చు. |
3. | గురజాడ అప్పారావు | కన్యాశుల్కం | 1900 | సార్వజనీనం. వికీసోర్సులో పూర్తైంది. అయితే కన్యాశుల్కం తొలి కూర్పు వేరే ఉంది. గురజాడలులో అది ఉంది, దానిని కూడా పూర్తిచేస్తే పరిశీలకులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అంతర్జాలంలో కన్యాశుల్కం తొలి కూర్పు మొమ్మొదట అందించినవారం అవుతాం. |
4. | కాళ్ళకూరి నారాయణ రావు | వరవిక్రయం | 1920 | సార్వజనీనం. వికీసోర్సులో పాఠ్యీకరణ అయింది కానీ అచ్చుదిద్దాలి. |
5. | నార్ల వెంకటేశ్వర రావు | కొత్త గడ్డ | 1940 | |
6. | పాకాల వేంకట రాజమన్నార్ | రాజమన్నార్ నాటికలు | 1960 | |
7. | తిరుపతి వేంకట కవులు | పాండవోద్యోగ విజయాలు | 1920 | కృతి భారతదేశంలో సార్వజనీనం. పాండవోద్యోగ విజయాలు పుస్తకం ఇంకా వికీసోర్సులో లేదు. చేర్చి పూర్తిచేయాలి. |
8. | త్రిపురనేని రామస్వామి | శంబుక వధ | 1930 | కృతి భారతదేశంలో సార్వజనీనం. శంబుకవధ ఇంకా వికీసోర్సులో లేదు. చేర్చి పూర్తిచేయాలి. |
9. | వాసిరెడ్డి, సుంకర | మాభూమి | 1930 | |
10. | వేదం వేంకటరాయ శాస్త్రి | ప్రతాపరుద్రీయం | 1910 | సార్వజనీనం. ప్రతాపరుద్రీయం ఇంకా వికీసోర్సులో లేదు. చేర్చి పూర్తిచేయాలి. |
ఆత్మకథలు[మార్చు]
ఆత్మ కథలు (9) జాబిత సంఖ్య | రచయిత/ సంపాదకుడు | శీర్షిక | మొదట ప్రచురించిన దశాబ్దం | వికీసోర్సు పరంగా స్థితి |
---|---|---|---|---|
1. | ఆదిభట్ల నారాయణదాసు | నాయెరుక | 1920 | సార్వజనీనం. నాయెఱుక ఇంకా వికీసోర్సులో లేదు. చేర్చి పూర్తిచేయాలి. |
2. | చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి | కథలు గాధలు | 1940 | భారతదేశంలో సార్వజనీనం. మొదటి సంపుటం తెలుగు వికీసోర్సులో పాఠ్యీకరణ పూర్తై అచ్చుదిద్దడానికి సిద్ధంగా ఉంది. రెండవ సంపుటం వికీసోర్సులో చేర్చి పూర్తిచేయాలి. |
3. | దరిశి చెంచయ్య | నేనూ, నా దేశం | 1930 | |
4. | కాళోజీ నారాయణరావు | ఇదీ నా గొడవ | 1950 | |
5. | కందుకూరి వీరేశలింగం పంతులు | స్వీయ చరిత్రము | 1920 | సార్వజనీనం. మొదటి భాగం అచ్చుదిద్దారు, ఆమోదం కోసం చూస్తోంది. రెండవ భాగం పాఠ్యీకరణ పూర్తై అచ్చుదిద్దడానికి సిద్ధంగా ఉంది. |
6. | పుచ్చలపల్లి సుందరయ్య | విప్లవ పథంలో నా పయనం | 1950 | పుచ్చలపల్లి సుందరయ్య రచనలు ఈ కృతితో సహా స్వేచ్చా నకలు హక్కుల్లో విడుదల చేయడానికి సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించి చూడవచ్చు. |
7. | శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి | అనుభవాలు జ్ఞాపకాలు | 1930 | 2022లో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మరణించి 60 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆయన రచనలన్నీ భారతదేశంలో సార్వజనీనం అవుతాయి. కాబట్టి మరో నాలుగేళ్ళ తర్వాత ఆయన రచనలపై వికీసోర్సులో పనిచేయవచ్చు. |
8. | టంగుటూరి ప్రకాశం | నా జీవిత యాత్ర | 1940 | కృతి నాలుగో భాగం తప్ప భారతదేశంలో సార్వజనీనం. వికీసోర్సులో పూర్తైంది. నాలుగో భాగం కాపీహక్కులు తెన్నేటి విశ్వనాథం వారసుల వద్ద అప్రమేయంగా ఉన్నాయనుకోవాలి. కాబట్టి స్వేచ్చా నకలు హక్కుల్లో విడుదల చేయించుకుందుకు ప్రయత్నించాలి. సాధ్యం కాకుంటే అది ఎలాగూ అనుబంధమే కాబట్టి తొలగించాలి. |
9. | తిరుమల రామచంద్ర | హంపీ నుంచి హరప్పా దాక | 1990 |
సాహిత్య పరిశీలన[మార్చు]
సాహిత్య పరిశీలన (2) జాబిత సంఖ్య | రచయిత/ సంపాదకుడు | శీర్షిక | మొదట ప్రచురించిన దశాబ్దం | వికీసోర్సు పరంగా స్థితి |
---|---|---|---|---|
1. | అక్కిరాజు ఉమాకాంతం | నేటి కాలపు కవిత్వం | 1930 | కృతి భారతదేశంలో సార్వజనీనం. కానీ వికీసోర్సులో లేదు. చేర్చి పూర్తిచేయాలి. |
2. | కట్టమంచి రామలింగారెడ్డి | కవిత్వతత్త్వ విచారము | 1930 | కృతి భారతదేశంలో సార్వజనీనం. వికీసోర్సులో పాఠ్యీకరణ పూర్తై, అచ్చుదిద్దడం కోసం ఎదురుచూస్తోంది. |
వ్యాసావళి[మార్చు]
వ్యాసావళి (7) జాబిత సంఖ్య | రచయిత/ సంపాదకుడు | శీర్షిక | మొదట ప్రచురించిన దశాబ్దం | వికీసోర్సు పరంగా స్థితి |
---|---|---|---|---|
1. | చలం | స్త్రీ | 1930 | |
2. | గిడుగు రామమూర్తి | ఆంధ్ర పండితభిషక్కుల భాషాభేషజము | 1920 | సార్వజనీనం. పుస్తకం వికీసోర్సులో పాఠ్యీకరణ అయింది, అచ్చుదిద్దడం కోసం ఎదురుచూస్తోంది. |
3. | పానుగంటి లక్ష్మీనరసింహా రావు | సాక్షి వ్యాసాలు | 1930 | సార్వజనీనం. సాక్షి మూడవ సంపుటం తెలుగు వికీసోర్సులో ఆమోదమై పూర్తైపోయింది. మిగిలిన సంపుటాలు చేర్చి పూర్తిచేయాలి. |
4. | పురాణం సుబ్రహ్మణ్య శర్మ | ఇల్లాలి ముచ్చట్లు | 1970 | |
5. | రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ | నాటకోపన్యాసములు | 1940 | |
6. | స్త్రీశక్తి సంఘటన | మనకు తెలియని మన చరిత్ర | 1990 | |
7. | సురవరం ప్రతాపరెడ్డి | ఆంధ్రుల సాంఘిక చరిత్ర | 1950 | భారతదేశంలో సార్వజనీనం అయింది. ఆమోదమై, పూర్తైంది. |