రాజవిద్యారాజగుహ్య యోగము
భగవద్గీత - తెలుగు అనువాదము (రాజవిద్యారాజగుహ్య యోగము) | సంస్కృత శ్లోకములు→ |
ఇదం తు తే గుహ్యతమం
[మార్చు]దేనిని తెలుసుకోవడం వలన నీవు అశుభం(సంసారం)నుండి విముక్తుడవు అవుతావో అటువంటి అతి రహస్యమైన ఈ(బ్రహ్మ)జ్ఞానాన్ని అసూయా రహితుడవైన నీకు విజ్ఞానంతో సహా చెబుతాను.
రాజవిద్యా రాజగుహ్యం
[మార్చు]ఇది రాజవ్ద్య, రాజగుహ్యం, పవిత్రం, ఉత్తమం దీనిని సూటిగా అర్ధం చేసుకోవచ్చును. ధర్మ పరమైనది, అభ్యసించడం తేలిక, నిలకడగా ఉంటుంది.
అశ్రద్దధానాః పురుషా
[మార్చు]అర్జునా ఈ ధర్మంలో విశ్వాసం లేని పురుషులు నన్ను పొంద లేక మృత్యు సంసార మార్గం లోనే తిరుగుతున్నారు.
మయా తతమిదం
[మార్చు]ఈ జగత్తు యావత్తు అవ్యక్తంగా ఉండే నాచేత వ్యాపించబడి ఉన్నది. జీవులందరూ నాలో నిలిచి ఉన్నారు. అయితే నేను వాళ్ళలో లేను.
న చ మత్స్థాని భూతాని
[మార్చు]ప్రాణులు కూడా నాలో లేరు. నా యోగమహిమని చూడు. భూత రాశిని పుట్టిస్తాను, భరిస్తాను కాని ఆభూతాలలో ఉండను.
యథాకాశస్థితో నిత్యం
[మార్చు]సర్వత్రా సంచరించే ప్రచంఢ్ వాయువు ఎలాగైతే ఆకాశంలోనే ఉంటుందో, అలాగే అన్ని ప్రాణులు నా లోనే ఉన్నాయని తెలుసుకో.
సర్వభూతాని కౌన్తేయ
[మార్చు]కుంతీ కుమారా! కల్పం పూర్తి అయినప్పుడు జీవులందరూ నా ప్రకృతిని పొందుతారు. కల్ప ప్రారంభంలో జీవులందరిని నేనే తిరిగి బయటికి వేస్తున్నాను.
ప్రకృతిం స్వామవష్టభ్య
[మార్చు]ప్రకృతి వశమైన ఈ యావత్తు నేను నా మాయను ధరించి తిరిగి తిరిగి సృజిస్తుంటాను.
న చ మాం తాని కర్మాణి
[మార్చు]ఓ ధనంజయా! ఆ కర్మలు నన్ను భంధించవు. ఆ కర్మలలో ఆసక్తి లేక నేను ఉదాసీనంగా ఉంటాను.
మయాధ్యక్షేణ ప్రకృతిః
[మార్చు]నా అధ్యక్షతన ప్రకృతి చరాచర ప్రపంచాన్ని సృజిస్తుంది. ఆ కారణం చేతనే జగత్తు తిరిగి తిరిగి ప్రవర్తిస్తుంది.
అవజానన్తి మాం మూఢా
[మార్చు]జీవరాశికి అధిపతివై ఉండీ మానవ శరీరాన్ని ఆశ్రయించిన(నా పరమ తత్వాన్ని గుర్తెరుగలేని మూఢులు)నన్ను నిర్లక్ష్యం చేస్తారు.
మోఘాశా మోఘకర్మాణో
[మార్చు]వారు వృధా ఆశలతో దండగమారి కర్మలతో, అనవసరమైన జ్ఞానంతో, మతులు చెడి, భ్రాంతి గొలిపే అసురిక, రాకహస ప్రకృతిని ఆశ్రయించిన వారౌతారు.
మహాత్మానస్తు మాం
[మార్చు]అర్జునా! మహాత్ములైతే దేవీ ప్రకృతిని, భూత రాశికి ఆది అయి నాశంలేని వాడిగా నన్ను తెలుసుక్ని అనన్య మనసుతో సేవిస్తారు.
సతతం కీర్తయన్తో మాం
[మార్చు]వారు ఎప్పుడూ నన్ను కీర్తిస్తూ, దృఢమైన నిష్టతో సాధన చేస్తూ, భక్తితో నాకు నమస్కరిస్తూ నిత్య యుక్తులై ఉపాసిస్తారు.
జ్ఞానయజ్ఞేన చాప్యన్యే
[మార్చు]మరి ఇతరులు జ్ఞానయజ్ఞం ద్వారా ఆరాధిస్తూ ఏకత్వ (అద్వైత)భావంతో , వేరు అనే(ద్వైత)భావంతోనూ, విశ్వమంతటా ఉన్న నన్ను ఉపాశిస్తారు.
అహం క్రతురహం
[మార్చు]నేనే క్రతువుని, నేనే యజ్ఞాన్ని, పితరుల కర్పించ బడే ఆహుతునినేను. హోమం చేసే మూలికలు నేను. మంత్రాన్ని నేను. అగ్నిని ఆహుతిని కూడా నేనే.
పితాహమస్య జగతో
[మార్చు]ఈ జగత్తుకి తండ్రి, తల్లి, కర్మఫల ప్రదాత, తెలియబడవలసినదీ, పవిత్రమైన ఓంకారమూ, ౠక్, సామ, యజుర్వేదాలు నేనే.
గతిర్భర్తా ప్రభుః సాక్షీ
[మార్చు]నేను లక్ష్యమునూ, భరించేవాడిని, పాలించేవాడిని, అన్నిటికి సాక్షినీ, సర్వానికి నివాస స్తానాన్ని, అందరికి శరణ్యామును, ఆప్తుడిని, నేనే నిధినీ అవయమైన మూలకారణమూ.
తపామ్యహమహం వర్షం
[మార్చు]ఓ అర్జునా! వేడి నిచ్చు వాడను నేనే. వర్షమును నిరోధించు వాడను నేనే. అమృతత్వమును, మూర్తీ భవించిన మరణమును నేనే. ఆధ్యాత్మికత్వమును, భౌతికత్వమును నాయందే కలవు.
త్రైవిద్యా మాం సోమపాః
[మార్చు]వేదాధ్యయనము చేసిన వారును, సోమపానం కావించు వారును, స్వర్గలోకములను వాంచించుచు పరోక్షముగా నన్ను పూజింతురు. ప్రక్షాళితపాపులై వారు పుణ్య లోకమైన ఇంద్ర లోకమును పొంది స్వర్గ భొగముల ననుభవింతురు.
తే తం భుక్త్వా స్వర్గలోకం
[మార్చు](స్వర్గాన్ని కోరే)వారు విశాలమైన స్వర్గాన్ని అనుభవించి తమ పుణ్యం ఖర్చు అయిపోగానే మానవ లోకానికి ప్రవేశిస్తారు. ఇలా వేదాలలోని ఉత్తమ లోకాలనిచ్చే కర్మకాండను పట్టుకొన్న కామదాసులు రాకపోకలను(జనన మరణాలను)పొందుతారు.
అనన్యాశ్చిన్తయన్తో మాం
[మార్చు]అనన్య భావంతో నన్ను చింతిస్తూ నాయందే దృష్టి కలిగి, ఏజనులు నన్ను పరిపూర్ణంగా ఉపాసిస్తారో, వారి యోగక్షేమాలను నేనే వహిస్తాను.
యేఽప్యన్యదేవతాభక్తా
[మార్చు]అర్జునా ఇతర దేవతల భక్తులు కూడా తమ దేవతలను శ్రద్ధతో ఆరాధిస్తుంటే, వాళ్ళు కూడా విధానం లేకుండా నన్నే ఆరాధిస్తున్నారు
అహం హి సర్వయజ్ఞానాం
[మార్చు]నేనే అన్ని యజ్ఞాలకి భోక్తని అధిపతిని. ఇతర దేవతలను ఆరాధించేవారు యదార్ధంగా నన్ను తెలుసుకోలేరు. అందువలన వాళ్ళు (మరలా జన్మలలో)దిగజారి పోతున్నారు.
యాన్తి దేవవ్రతా దేవాన్పితౄన్యాన్తి
[మార్చు]దేవతలను ఆరాధించే వాళ్ళు దేతలను, పితరులను ఆరాధించే వాళ్ళు పితరులను, భూతాలను ఆరాధించేవాళ్ళు భూతాలనూ, నన్ను ఆరాధించే వాళ్ళు నన్నే చేరుకుంటారు.
పత్రం పుష్పం ఫలం తోయం
[మార్చు]ఏవరు భక్తితో ఆకునో, పువ్వునో, ఫలాన్నో, నీటినో నాకు సమర్పిస్తారో ఆ శ్రద్ధ మనస్కులు భక్తితో ఇచ్చిన దానిని నేను స్వీకరిస్తాను.
యత్కరోషి యదశ్నాసి
[మార్చు]అర్జునా నీవు ఏది తింటావో, ఏది చేస్తావో, ఏది హోమంచేస్తావో, ఏది దానం చేస్తావో, ఏది తపస్సు చేస్తావో, ఏ తపస్సు చేస్తావో అది నాకు అర్పించి చెయ్యి.
శుభాశుభఫలైరేవం
[మార్చు]ఈ ప్రకారంగా సన్యాసయోగంతో కూడుకున్న వాడై శుభాశుభ ఫలాలు కలిసిన కర్మ భంధాల నుండి విడుదల పొంది, నీవు నన్ను చేరుకుంటావు.
సమోఽహం సర్వభూతేషు
[మార్చు]నేను ప్రాణులందరిలోను సమంగా ఉన్నాను. నాకు ద్వేషింప తగినవారు అంటూ లేరు, ప్రేమించవలసిన వారూ లేరు. అయితే నన్ను భక్తితో ఎవరు సేవిస్తారో వాళ్ళు నాలో ఉంటారు. నేను వాళ్ళల్లో ఉంటాను.
అపి చేత్సుదురాచారో
[మార్చు]ఎంత దుర్మార్గుడైనా అతడు అనన్య భావంతో సేవిస్తే అతడు సరైన నిర్ణయం తీసుకున్న వాడే, కాబట్టి సత్పురుషుడుగానే ఎంచతగిన వాడు.
క్షిప్రం భవతి ధర్మాత్మా
[మార్చు]అర్జునా అతడు త్వరలోనే ధర్మాత్ముడై, శాశ్వతమైన శాంతిని పొందుతాడు. నాభక్తుడు నశించడని ప్రతిజ్ఞ చెయ్యి.
మాం హి పార్థ వ్యపాశ్రిత్య
[మార్చు]అర్జునా! నన్ను ఆశ్రయించిన వాళ్ళు పాప యోనులు కానీ, స్త్రీలు, వైస్యులు, శూద్రులు కానీ వాళ్ళుకూడా ఉత్తమగతిని తప్పక పొందుతారు.
కిం పునర్బ్రాహ్మణాః
[మార్చు]ఇక పుణ్యులైన బ్రాహ్మణులు, భక్తులైన రాజర్షుల సంగతి చెప్పాడం దేనికి?క్షణికము, దుఃఖమయమూ అయిన ఈ లోకంలో పుట్టిన నీవు నన్ను సేవించు.
మన్మనా భవ మద్భక్తో
[మార్చు]నీ మనస్సును నాకు అర్పించు. నా భక్తుడివి కా. నన్ను ఆరాధించు. నాకే నమస్కరించు. ఇలా నాలో మనసు నిలిపి, నన్ను లక్ష్యంగా పెట్టుకొని నన్నే చేరుతావు.
భగవద్గీత - తెలుగు అనువాదము | సంస్కృత శ్లోకములు→ |