Jump to content

అర్జునవిషాద యోగము

వికీసోర్స్ నుండి


భగవద్గీత - తెలుగు అనువాదము (అర్జునవిషాద యోగము)



ధర్మక్షేత్రే కురుక్షేత్రే. . .

[మార్చు]

ధృతరాష్ట్రుడు పలికెను.

ఓ సంజయా! యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులును, పాండవులును ఏమి చేసిరి?

భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది.

రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు

మధ్వాచార్యులవారు: శ్రీకృష్ణద్వైపాయన వ్యాసుల వారి మహాభారత గ్రంధంలో శ్రీకృష్ణ అర్జున సంవాదం 700 శ్లోకాల భగవద్గీత. ఈ 27 శ్లోకాలు సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పినట్టు వైశంపాయన మహాముని అర్జుని మనుమడు జనమేజయ మహారాజుకు వివరించారు. ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయుని కురుక్షేత్రంలో నా కుమారులు, పాండుకుమారులు ఏమి చేసారు అని అడగడానికి అక్కడకు యుద్ధానికి వెళ్ళారని తెలియకనా? కాదు. కురుక్షేత్రం అన్నది ధర్మ క్షేత్రం, ఎందరో దేవతల నిలయం, ఎన్నో యజ్ఞాలు జరిగిన స్థలం. ఆ ధర్మక్షేత్ర ప్రభావం ఏమైనా తన కుమారులపై పడిందా అన్న ఉత్సుకత ఆయనను అలా అడిగేలా చేసింది. అధర్మం వైపున్న తన కుమారుల మనసేమైనా మారిందా? లేక పాండుకుమారులు వంశక్షయానికి వెరసి ఏమైనా యుద్ధం ఆపారా, ఆపి వారు అడవులకు తపస్సుకు పోయారా అన్న కుతూహలం. ఇక్కడ ధృతరాష్ట్రుడు నా కుమారులు(మామకః), పాండుకుమారులు (పాండవ: ) అన్న భావం ప్రకటించడం ద్వారా పాండు కుమారులను తన కుమారులుగా అంగీకరించక వారిని వైరులగానే చూస్తున్నాడు అన్నది తెలియచేస్తుంది. క్షేత్రం అంటే దున్నే స్థలం. సేద్యం చేసే పొలంలో ఎలాగైతే కలుపు తీసివేయబడుతుందో అలాగా కౌరవులు దునుమాడబడతారు అన్నది ధర్మక్షేత్రానికి అర్ధం.

దృష్ట్వా తు పాణ్డవానీకం

[మార్చు]

సంజయుడు పలికెను:

అపుడు రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సిద్ధమైన పాండవసేనను చూసి, ద్రోణాచార్యునివద్దకు వెళ్ళి ఇట్లనెను. భాష్యాలు:

ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది.

రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు

మధ్వాచార్యులవారు: ధృతరాష్ట్రుడు పుట్టుకతో గుడ్డివాడైనా అతడికి అంతరజ్ఞాన నేత్రం వరంగా వుంది, కానీ అతడి అతిప్రేమ వలన అది కూడా కనబడనీయడం లేదు. అతని పుత్రవాత్సల్యం వలన ఎక్కడ తన కొడుకు అర్ధ రాజ్యం ఇచ్చేస్తారోనన్న ఆదుర్దా కనబడుతోంది. సంజయునికి మహారాజు ఆంతరం తెలుసుకనుక ఆయనకు ఊరట కలిగిస్తూ పాండవుల వ్యూహం చూసిన దుర్యోధనుడు గురువుల వద్దకు వెళ్ళిన విషయం వివరిస్తున్నాడు. పైకి గాంభీర్యం నటిస్తున్నా, పాండవుల సేనను చూసి లోన భయపడిన రారాజు అది కప్పిపుచ్చుకోవడానికి తన గురువు ద్రోణుని వద్దకు వెళ్ళాడు.

పశ్యైతాం పాణ్డుపుత్రాణాం

[మార్చు]

ఆచార్యా! బుద్ధిమంతుడైన మీ శిష్యుడు ధృష్టద్యుమ్నుని చేత ఏర్పరచ బడిన పాండవుల ఈ పెద్ద సైన్యాన్ని చూడండి.

ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది.

రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు

మధ్వాచార్యులవారు: దుర్యోధనుడు ద్రోణుని వద్దకు వెళ్లి ఆయనను యుద్ధానికి మరింత పురికోల్పేలా మాట్లాడుతున్నాడు. ద్రోణుడు శిష్యవాత్సల్యంవలన యుద్ధానికి సుముఖత చూపించకపోవచ్చు అన్న శంక దుర్యోధనునికి వుంది. పాండవులంటే ద్రోణునికి ప్రత్యేక అభిమానం, వారు ప్రియశిష్యులు. అందుకే దుర్యోధనుడు “పశ్యైతాం” – అంటే గమనించండి, అంటూ మీ ప్రియశిష్యులే మిమ్మల్ని దిక్కరించేలా మీమీద యుద్ధానికి పూనుకున్నారు, ఇది మీకు అవిధేయత ప్రకటించడం సుమా అన్న అర్ధంలో అంటున్నాడు. ఆయనను మరింత క్రోధునిగా చెయ్యడం కోసం మరొక ప్రియశిష్యుడు దృష్టద్యుమ్నుడు ఏ వ్యూహం పన్నాడో చూసారా అంటున్నాడు. ఇక్కడ నేరుగా దృష్టద్యుమ్నుని పేరు తీసుకోవచ్చు, కానీ ఈయన బద్ధశత్రువు ద్రుపదుని పుత్రునిగా అభివర్ణిస్తున్నాడు, ఎందుకంటె ద్రోణుని మరణమే కోరికగా ద్రుపదుడు చేసిన యజ్ఞం వల్ల పుట్టిన దృష్టద్యుమ్నుడు. ఈ విషయం ఆయనకు అర్ధమయ్యేలా అతని పేరును అలా పలికాడు. అతడిని తెలివైనవాడిగా ఎందుకు అన్నాడంటే ఎవరి చావుకోసం పుట్టాడో, అతని వద్దనే శిష్యరికంచేసి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు ద్రుపదపుత్రుడు. కాగా తనను చంపేవాడు వీడు అని తెలిసికూడా ద్రోణుడు ఇతడికి యుద్ధవిద్యలు నేర్పినందుకు ఆయనవలన ఈ యుద్ధంలో జరగబోయే కష్టాల గురించి ఆయనను బాద్యుడిని చేస్తున్నట్టు మాట్లాడాడు దుర్యోధనుడు.

అత్ర శూరా మహేష్వాసా

[మార్చు]

ఇక్కడ శూరులూబలమైన ధనువులు కలవాళ్ళూ, యుద్ధంలోభీమార్జునతో దీటు రాగలిగిన వాళ్ళూ సాత్యకి, విరాటుడు మహారధుడు దృపదుడు ఉన్నారు.

ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది.

రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు

మధ్వాచార్యులవారు: “అత్రశూరః” అన్న పదం గర్భితనింద గా అన్నాడు దుర్యోధనుడు. దృష్టద్యుమ్నుడు నిలిపిన సైన్యం అంత గొప్పగా వుంటే మన సైన్యం గురించి, మన బలం గురించి తక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. మనము కూడా వారినందరినీ ఓడించగలిగిన వాళ్ళమే అంటూ స్వాంతన వచనాలు పలుకుతూ పాండవులవైపున్న గొప్ప యోధులగురించి ప్రస్తావిస్తున్నాడు. యుయుధనుడు (సాత్యకి ), విరాటరాజు, ద్రుపదుడు కూడా భీమార్జునులకు తీసిపోని మహారధులు. మహారధులు అంటే తమవైపు 10వేల మందిని కాపాడుకుంటూ శత్రుసైన్యంలో 10వేలమందిని దునుమాడగల సామర్ధ్యం ఉన్నవారు.

ధృష్టకేతుశ్చేకితానః

[మార్చు]

దృష్టకేతువు, చేకితానుడు, వీర్యవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్టుడైన శైబ్యుడు ఉన్నారు.

భాష్యాలు:

ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది.

రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు

మధ్వాచార్యులవారు: వీరి భాష్యం లేదు, కానీ బలదేవ విద్యాభూషణ ఇలా వ్యాఖ్యానించారు : బలవంతుడు అన్న పదం వీర్యవాన్ గా శిశుపాలుని కొడుకు దృష్టకేతుకు, చేకితనునికి, కాశీరాజుకు వాడారు. ఎన్నో యుద్ధాలు గెలిచిన కుంతీభోజుని పురుజిత్ అని, మానవులలో గొప్పవాడని నరపుంగవుడు అని శైబ్యుని వర్ణిస్తున్నారు. వీరంతా కూడా భీమార్జునులకు సములు అని చెబుతున్నారు.

యుధామన్యుశ్చ విక్రాన్త

[మార్చు]

పరాక్రమశాలి యధామన్యుడు, వీర్యవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు అభిమన్యుడు, ద్రౌపదీ కుమారులు ఉన్నారు. వీరందరూ మహారధులే.

భాష్యాలు:

ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది.

రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు

మధ్వాచార్యులవారు: శూరుడు ఐన యుధామన్యుడు “విక్రాంత:”, ఉత్తమౌజుడు వీర్యవాన్ , అభిమన్యుడు అంటే సౌభద్రుడు, అర్జునుని కుమారుడు, 5 గురు ఉపపాండవులు ద్రౌపదేయులు – ప్రతివిందుడు, శ్రుతసేనుడు, శ్రుతకీర్తి, శతానికుడు, శ్రుతవర్మ. వీరుకాక భీముని కుమారుడైన ఘటోత్కచుడు ఇతరులను “చ” ప్రయోగంతో వర్ణించారు. కొంతమంది అర్ధరధులను కూడా మహారధులుగా వర్ణించి మరింత జ్వాలను ప్రజ్వలింపచేస్తున్నాడు దుర్యోధనుడు.

అస్మాకం తు విశిష్టా యే

[మార్చు]

బ్రాహ్మణోత్తమా మనలో విశిష్టులైన వారెవరో తెలుసుకోండి. నా సైన్యంలోని నాయకులను మీ గుర్తుకోసం చెబుతాను.

భవాన్భీష్మశ్చ కర్ణశ్చ

[మార్చు]

మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధంలో జయం పొందే కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, అలాగే సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఉన్నారు.

అన్యే చ బహవః శూరా

[మార్చు]

ఇంకా ఎందరో యుద్ధకోవిదులైన శూరులూ, నానా శస్త్రాలను ధరించి నాకోసం జీవితాలని త్యాగం చేశారు.

భాష్యాలు:

ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది.

రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు

మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు శూరులైన భీష్ముడు, కర్ణుడు, మీరు, కృపుడు, అశ్వథ్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు మాత్రమె కాక లెక్కలేనంత మంది వైరి వారి స్థాయికి తగ్గ వీరులున్నారు మనవైపు. బహవ: అన్న పదం ద్వారా జయద్రధుడు, కృతవర్మ, శల్యుడు ఇలా ఎందరో తమ జీవితాల్ని నాకోసం పణంగా పెట్టి యుద్ధానికి వచ్చారు. వారికి “నానా శస్త్రప్రహారః” అంటే ఎన్నో అస్త్రశస్త్రాలను ఉపయోగించే సామర్ధ్యం, శక్తి వున్నవారు, అలాగే “యుద్ధవిశారద:”, అంటే యుద్ధం ఎలా చెయ్యాలో అన్న కౌశలం కలవారు. వీరంతా నా మీద ప్రేమతో, భక్తితో, తమను తాము ఒడ్డి మనకోసం విజయం చేకూర్చకలవాళ్ళు

అపర్యాప్తం తదస్మాకం బలం

[మార్చు]

భీష్ముని చేత రక్షింపబడే మన బలం అపరిమితమైనది. భీముని చేత రక్షింపబడే వారి బలం పరిమితమైనది.

భాష్యాలు:

ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది.

రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు

మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు ఇప్పుడు ప్రశ్న ఇరువైపులా సమానమైన సైన్యం ఉంటె మరి విజయం కౌరవులను ఎలా వరిస్తుంది అనుకుంటున్నాడు రారాజు అని. దానికి సమాధానంగా చెబుతున్నాడు, తమ సైన్యం అనంతమైనది అని. తన భయాన్ని బయటకు ప్రకటించకుండా ఉండేందుకు తనకు తాను సమాధానపరచుకుంటూ తన గురువులకు చెబుతున్నాడు, తన సైన్యం అనంతమైనది అని, అందునా ఎంతో చతురత, యుద్ధ విశారదత కలిగిన మహారధి భీష్ముని పర్యవేక్షణలో ఉందని, అటువైపు తక్కువ తెలివి కలిగిన భీముని పర్యవేక్షణలో ఉన్న వారి సైన్యం కన్నా మనమే ఎక్కువ అని. కాబట్టి కౌరవుల విజయం తధ్యమని నొక్కివక్కాణిస్తున్నాడు.

అయనేషు చ సర్వేషు

[మార్చు]

అన్ని ఎత్తుగడలలోను మీరంతా ఎవరి స్థానాలలో వాళ్ళుంటూ, సదా భీష్ముణ్ణే రక్షించాలి.

భాష్యాలు:

ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది.

రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు

మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. మీరంతా కూడా యుద్ధంలో తలమునకలైన భీష్మపితామహుని కాచుకోవాలి అని దుర్యోధనుడు ద్రోణుని అభ్యర్దిస్తున్నాడు. అంతకు ముందు శ్లోకంలో ధ్వనించిన అతివిశ్వాసం ద్రోణునికి అవిధేయతగా కనిపించకుండా ఉండడానికి రారాజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. తన తాతగారైన భీష్మపితామహుడు, గురువైన ద్రోణుడు తనను ఎల్లవేళలా కాపాడతారు అని నమ్మకం, ఎందుకంటె ద్రౌపది వలువలు విప్పించిన సమయంలో కూడా అధర్మమని తెలిసి కూడా వీరు నోరు మెదపలేదు అన్న నమ్మకం.

తస్య సంజనయన్హర్షం కురువృద్ధః

[మార్చు]

అతడికి హర్షం కలిగిస్తూ ప్రతాపవంతుడైన కురు వృద్ధుడు గట్టిగా సింహగర్జన చేసి శంఖం ఊదాడు.


భాష్యాలు:

ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది.

రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు

మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు భీష్ముడు ఇంతలో సింహనాదం చేస్తూ యుద్ధశంఖం పూరించాడు. దుర్యోధనుడు తనపట్ల కనబరచిన గౌరవాన్ని ఆమోదించినట్టు భీష్ముడు క్షత్రియోచితమైన విధంగా తాను యుద్ధానికి సన్నద్ధం అన్న విషయం తెలిసేలా శంఖం ఊది తెలియచేసాడు. దుర్యోధనుని మాటల్లో అంతరార్ధం గ్రహించిన ద్రోణుడు మిన్నకుండా ఉండగా భీష్ముని శంఖారావం ఒక రకమైన శక్తి నింపింది.

తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ

[మార్చు]

ఆ వెంటనే శంఖాలూ, భేరులూ, పణవాలూ(చర్మవాద్యాలు)అనకాలు(తప్పెటలూ, మద్దెలలు)గోముఖాలు ఓకేసారిగా మ్రోగాయి. ఆ ధ్వని గజిబిజి అయింది.

తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః | సహసైవాభ్యహన్యన్త స శబ్దస్తుములోऽభవత్ ||1-13||

ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు భీష్మాచార్యుల శంఖనాదం దుర్యోధనునికి స్వాంతన కలిగించింది. పితామహుడు సర్వసైన్యాధ్యక్షునిగా తన సమరశంఖం పూరించడంతో రెట్టించిన ఉత్సాహంతో వారి సైనికులు పణవ – భేరీలు, అనక – పెద్ద పెద్ద చర్మడప్పులు, గోముఖ – కొమ్ముబూరాలు వంటి రకరకాల యుద్ధభేరీనినాదాలతో సమరానికి ఉద్యుక్తులయ్యారు.

తతః శ్వేతైర్హయైర్యుక్తే

[మార్చు]

అప్పుడు తెల్లటి గుర్రాలు పూన్చిన గొప్ప రధంలోకూర్చున్న మాధవుడు, అర్జునుడు దివ్యశఖాలను ఊదారు.

భాష్యాలు:

ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది.

రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు

మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు కౌరవుల కోలాహలం చూసి పాండవ సైన్యం రెట్టించిన ఉత్సాహంతో సమరనినాదాలు చేసారు. ఎన్నో రధాలనుండి శంఖనాదాలు మ్రోగించగా ఇక్కడ ప్రత్యేకంగా శ్రీకృష్ణఅర్జునుల రధం గురించి ప్రస్తావించారు. ఈ రధం ఖాండవదహనానికి ధన్యవాదాలు తెలుపుతూ విశ్వకర్మ నిర్మించిన రధాన్ని అగ్నిదేవుడు ముల్లోకాలు జయించమని దీవించి వారికి సమర్పించాడు. ఈ రధానికి మరొక ప్రత్యేకత ఏమిటంటే వైరుల గుండెల్లో దడ పుట్టించే హనుమంతుల వారు ధ్వజం మీద (జండాపై కపిరాజు వలె ) ఆసీనులైఉన్నారు.

పాఞ్చజన్యం హృషీకేశో

[మార్చు]

పాంచజన్యాన్ని హృషీకేశుడూ, దేవదత్తాన్ని ధనంజయుడూ, పౌంద్రకమనే మహాశంఖాన్ని భీమకర్ముడైన వృకోదరుడు ఊదారు.


ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది.

రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు

మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు శ్రీకృష్ణుని పాంచజన్యం, ధనుంజయుని దేవదత్తం, వృకోదరుడు పౌండ్రం పూరించారు. వీరంతా తమకున్న దివ్యశంఖాలు ఊదారు అని చెబుతున్నారు ఇక్కడ. హృషీకేశుడు అంటే అందరి మనస్సులు నియంత్రింపగలిగినవాడు, కాబట్టి విజయం ఎవరిదీ అన్నది తెలుస్తూనే వుంది ఇక్కడ. అందరినీ నియంత్రించగలిగిన కృష్ణుడు ఎవరిని ఎలా దారిలో పెట్టగలడో చెప్పకనే చెబుతున్నది. ధనుంజయుడు అని అర్జునిని పిలవడం ద్వారా అందరి ధనాన్ని జయించగలిగిన విజయుడు అని చెప్పకనే చెబుతున్నారు. భీముని వృకోదరునిగా వర్ణించి అతడు చెయ్యబోయే భయంకరమైన యుద్ధం గురించి తెలియచేస్తున్నారు.

అనన్తవిజయం రాజా

[మార్చు]

కుంతీపుత్రుడు ధర్మరాజు అనంతవిజయాన్నీ, సుఘోష, మణిపుష్పకాలనే వాటినినకుల సహదేవులు ఊదారు.

కాశ్యశ్చ పరమేష్వాసః

[మార్చు]

ఓ రాజా గొప్ప ధనువు కలిగినకాశీ రాజు, మహారధుదైన శిఖండీ, దృష్టద్యుమ్నుడూ, విరాటుడూ, అపరాజితుడైన సాత్యకీ;

ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే | సౌభద్రశ్చ మహాబాహుః శఙ్ఖాన్దధ్ముః పృథక్పృథక్ ||1-18||

[మార్చు]

ద్రుపదుడూ, ద్రౌపది కుమారులు, మహాబాహుడైన సుభద్ర కుమారుడైన అభిమన్యుడూ వేరువేరుగా శంఖాలను ఊదారు.

ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది.

రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు

మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు పాండవులు తమ దివ్యశంఖాలు దేవదత్తం, పౌండ్రం, అనంతవిజయ, సుఘోష, మణిపుష్పక ఊది యుద్దోన్ముఖులయ్యారు. దుర్యోధనుని వైపు భీష్ముని మినహా గొప్ప పేరుగన్న శంఖములు లేవు. వీరే కాక శిఖండి, దృష్టద్యుమ్నుడు, ఎన్నడూ ఓటమి ఎరుగని సాత్యకి అందరూ తమ తమ దివ్యశంఖాలు ఊదారు. అటువైపు భీష్మునికి తప్ప మరెవరికీ దివ్యశంఖాలు చెప్పబడలేదు. పృధివీపతి అని సంజయుడు ఇక్కడ ధృతరాష్ట్రుని సంబోధించి పరోక్షంగా ఈ ధరణిలో తన వంశనాశనం చేసుకుంటున్నావు అని గుర్తుచేస్తున్నాడు. శ్రీకృష్ణుని వైపు మాత్రమె విజయం వస్తుంది, నీ కొడుకుకేమైనా యుద్ధంలో గెలుస్తాడని ఆశ ఏమైనా వుంటే వదులుకోమని చెప్పినట్టు ఉంది.

స ఘోషో ధార్తరాష్ట్రాణాం

[మార్చు]

ఆ ధ్వని భూమ్యాకాశాలలో మ్రోగి ధార్తరాష్ట్రుల హృదయాలను చీల్చింది.

ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది.

రామానుజాచార్యులవారు: దుర్యోధనుడు పాండవ సైన్యం చూసి వివశుడై తన సేనానాయకుడు భీష్ముని అధికారంలో ఉన్న సైన్యాన్ని బేరీజు వేసుకుని తన గురువు ద్రోణుని మానసికస్థితిని తెలుసుకోగోరి, ఆయనను యుద్ధోన్ముఖుని కావించడానికి ఆయన వద్దకు పోయి ఇరుసైన్యాల బలాబలాల గురించి చెబుతూ కించిత్ తత్తరపాటుకు లోనయి ఉండగా భీష్ముడు సింహంగా గర్జించి తన శంఖం ఊది యుద్ధప్రారంభం చేసే సూచన ఇచ్చాడు. ఆయన శంఖారావం విన్నాక డప్పులు, చర్మవాయిద్యాలు, డోలు వాయించి కౌరవ సైన్యం యుద్ధనాదం చేసి దుర్యోధనుని శాంతింపచేసింది. ఈ శంఖారావం విన్నవెంటనే ముల్లోకాలు తమ పాదాక్రాంతం చేసుకోగల శ్రీక్రిష్ణార్జునులు అన్ని లోకాలు తల్లడిల్లెలా తమ దివ్యశంఖాలు ఊదారు. వెనువెంటనే భీమ, యుధిష్టిర, నకుల సహదేవులు, ఉపపాండవులు, పాండవ సైన్యంలో మిగిలిన వీరులు కదనోత్సాహంతో శంఖారావం చేసారు. ఆ శబ్దాలు విని దుర్యోధనుని ధైర్యం పటాపంచలు అయిపొయింది. వైరుల గుండెల్లో భయం అలుముకుంది. ఈ విషయాన్ని సంజయుడు దుర్యోధనుని యుద్ధవిజయం మీద ఆశ పెట్టుకున్న ధృతరాష్ట్ర మహారాజుకు వివరించాడు.

మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. పాంచజన్య శంఖారావం, అటుపై పాండవుల సింహనాదం విన్నాక భీష్మాది ఇతర వీరులు కౌరవుల పక్షాన పోరాడుతున్న వారి గుండెల్లో ఎక్కడో తెలియని బాధ పొడచూపింది. తమ గుండెలు చిక్కబట్టుకుని వారు నిలిచారు. అంతకు మునుపే కౌరవులు చేసిన యుద్ధనాదం వీరి సింహనాదం ముందు చాలా చిన్నగా తోచి కౌరవులకు పాండవ సైన్య సామర్ధ్యం గురించి చిన్న భయం చిగురింపచేసింది.

అథ వ్యవస్థితాన్దృష్ట్వా

[మార్చు]

అప్పుడు నిలబడి ఉన్న దార్తరాష్టౄలను చూసి కపిధ్వజుడైన అర్జునుడు విల్లు ఎక్కుపెట్టిన పాండవ మధ్యముడు,


ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది.

రామానుజాచార్యులవారు: ఈ శ్లోకానికి రామానుజులు భాష్యం చెప్పలేదు.

మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. పాండవుల దిగ్విజయ శంఖనాదం విన్న కౌరవుల ధైర్యం సన్నబడింది. పాండవుల ఉత్సాహం పెచ్చరిల్లింది. అటుపై కపిధ్వజం ఉన్న రధం పై గాండీవం పట్టుకుని విజయుడు యుద్ధానికి సంనద్ధంయ్యాడు. హనుమంతుడు మొక్కవోని ధైర్యంతో అసాధ్యమైన ఎన్నో కార్యాలను రామునికి సుసాధ్యం చేసాడు. అటువంటి గొప్ప భక్తుడు ఆ రాముని అవతారమైన కృష్ణుని ఆదేశం మేరకు అర్జునుని రధం పైనున్న జెండా పై నిలవడం ద్వారా అర్జునునికి ఎంతో ధైర్యాన్ని సమకూర్చిపెట్టాడు. హృషీకేశుడు అంటేనే అందరి మనస్సులను నియంత్రించగలిగిన వాడు. అటువంటి హృషీకేశుడు తన అనుంగు భక్తులైన పాండవుల సరసన ఉన్నాడు, కాబట్టి వీరి విజయం మీద ఇసుమంతైనా అనుమానం పడవలదు.

హృషీకేశం తదా వాక్యమిదమాహ

[మార్చు]

ఋషీకేశునితో ఈ మాట అన్నాడు, అచ్యుతా ఉభయ సేనలమద్య రధాన్ని నిలుపు.

యావదేతాన్నిరిక్షేऽహం

[మార్చు]

యుద్ధం చేయగోరి ఎదురు చూస్తూ నిలబది ఉన్న వారిన్లో నేను ఎవరితో యుద్ధం చేయాలో వారిని చూడాలి

ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది.

రామానుజాచార్యులవారు: ఈ శ్లోకానికి రామానుజులు భాష్యం చెప్పలేదు.

మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. అర్జునుడు సేనయోర్ఉభయో అని ఇరు సేనల మధ్యలో నిలపమని అచ్యుతుని అంటే ఎప్పటికీ చ్యుతి లేని వాడిన శ్రీకృష్ణుని ప్రార్దిస్తున్నాడు. కౌరవులు కేవలం యుద్ధం కోసం కాంక్షించారు కానీ ఎప్పుడూ కూడా సంధి కానీ శాంతి కోసం కానీ ప్రయత్నం చెయ్యలేదు, కానీ పాండవులు యుద్ధాన్ని నివారించడానికి చివరదాకా ప్రయత్నించి ఇక కౌరవులు దిగిరాకపోతే తప్పనిసరి పరిస్థితులలో యుద్ధం చెయ్యడానికి వచ్చారు. అర్జునుడు ప్రేక్షకుడు కాదు కదా మరి రెండు సైన్యాల మధ్యలో నిలుచుని ఏమి చూడదలసుకున్నాడు అంటే ఈ యుద్ధం తన బంధువుల మధ్య జరుగుతున్నది, అర్జునుడు ఎవరెవరు వైరి పక్షంలో తన స్నేహితులు ఉన్నారో వారెవరు యుద్ధానికి సన్నద్దులయ్యరో ఎవరితో యుద్ధం చెయ్యాలో చూడడానికి మధ్యలో నిలపమన్నాడు.

యోత్స్యమానానవేక్షేऽహం

[మార్చు]

దుర్బుద్ధి కలిగిన దుర్యోదనునికి ప్రియం చేయగోరి యుద్ధం చేయడానికి ఎవరెవరు ఇక్కడ సమావేశమై ఉన్నారో వాళ్ళను నేను చూస్తాను.

ఏవముక్తో హృషీకేశో

[మార్చు]

సంజయుడిలా అన్నాడు; అర్జునుని కోరికమీద కృష్ణుడు ఉభయ సేనల మధ్య ఉత్తమమైన రధాన్ని నిలబెట్టి,

భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం

[మార్చు]

భీష్మ ద్రోణ, మిగిలిన రాజుల ఎదుట నిలబెట్టి, సమావేశమై ఉన్న ఈ కౌరవులను చూడు అన్నాడు.

తత్రాపశ్యత్స్థితాన్పార్థః

[మార్చు]

అప్పుడూ అర్జునుడు తండ్రులను, తాతాతలను, గురువులను, మేనమామలను, కుమారులను, మనుమలను చూచాడు.

శ్వశురాన్సుహృదశ్చైవ

[మార్చు]

ఇంకా అర్జునుడు, సజ్జనులను, రెండు సేనల మధ్య నిలబడి ఉన్న యావన్మంది బంధువులను సమీక్షించి,

కృపయా పరయావిష్టో

[మార్చు]

అర్జునుడు ఇలాఅన్నాడు; ఉదృతమైన కరుణ ఆవహించగా విషాదంతో ఇలా అన్నాడు. యుద్ధం చేయగోరి సమావేశమై ఉన్న నా బంధువులను చూడగా;


ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది.

రామానుజాచార్యులవారు: ఈ శ్లోకానికి రామానుజులు భాష్యం చెప్పలేదు

మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. సర్వశక్తిమంతుడైన పరమాత్మ ఎంతో దయతో శ్రీకృష్ణుని అవతారంలో ఈ ఇలలో ఆత్మజ్ఞానం బోధించడానికి అర్జునుని నిమిత్తమాత్రుని చేసుకుని సర్వమానవాళికి ఈ జ్ఞానం అందించారు. అర్జునునికి చాన్దోగ్యోపనిశాద్ 8.15 శ్లోకంలో చెప్పిన “ఆహిమ్స్యాత్ సర్వభూతాని” అంటే ఏ జీవునికి మనం హాని చెయ్యకూడదు అన్న విషయం స్ఫురింపచేసి దానినుండి మాయలోకి దించాడు. ఏదైనా శ్లోకాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటే వచ్చే బాధలను అర్జునుని ద్వారా మనకు బోధింపదలచాడు. ఒక క్షత్రియుడు ఇటువంటి మాటలు చెప్పి తన ధర్మం నుండి తప్పుకోకూడదు. కౌంతేయ అని అర్జునుని పిలవడం ద్వారా కుంతీదేవికి జరిగిన అవమానాలు, ఎంతటి కష్టాల్లోనైనా నిలదొక్కుకుని ముందుకు నడిచిన అతని తల్లిని గుర్తు చేస్తూ అర్జునుని కర్తవ్యం గుర్తు చేస్తున్నాడు. పరయా అన్న పదం ద్వారా తన సేనల మీదనే కాక తన శత్రువుల సైన్యాల మీద కూడా జాలి, దయ పెచ్చరిల్లి తన కర్తవ్యాన్ని మర్చిపోయి దైన్యంలోకి కూరుకుపోయే యోధుని గురించి తెలుపుతూ, విశిదన్ అన్న పదం ద్వారా బెంగ పెట్టుకున్న వాడిగా, గద్గదమైన గొంతుతో మాట పెగలక, వణుకుతూ బాధలో ఉన్న, గొంతు తడి ఆరిపోయిన అర్జునుడు ఇలా పలకడం మొదలుపెట్టాడు.

సీదన్తి మమ గాత్రాణి

[మార్చు]

నా అవయవాలు శిధిలమై పోతున్నాయి, నోరు ఎండి పోతుంది, నా శరీరం వణుకుతుంది, రోమాలు నిక్క పొడుచుకుంటూ ఉన్నాయి.

గాణ్డీవం స్రంసతే హస్తా

[మార్చు]

గాండీవం చేతిలోనుంచి జారిపోతుంది, వళ్ళు మండుతోంది, నిలబడటానికి ఓపికలేకుండా ఉన్నది. మనస్సు భ్రమిస్తోంది.

నిమిత్తాని చ పశ్యామి

[మార్చు]

కేశవా దుశ్శకునాలు కనిపిస్తున్నాయి, స్వజనాన్ని చంపడం వలన ఏమి మేలు కలుగుతుందో తెలుసుకో లేకుండా ఉన్నాను.

న కాఙ్క్షే విజయం కృష్ణ

[మార్చు]

ఓ కృష్ణా! నేను జయం కోరను, రాజ్యం కాని సుఖాలు కాని కోరను. గోవిందా రాజ్యం వలన కాని, భోగాల వలన కాని, జీవించడం వలన కాని ప్రయోజనం ఏమిటి.

యేషామర్థే కాఙ్క్షితం నో రాజ్యం

[మార్చు]

ఎవరికోసం మనం రాజ్యాన్ని, సుఖ భోగాన్ని కోరుకుంటామో వారు ప్రాణాలను, సంపదలను త్యజించి ఇక్కడ నిలబడి ఉన్నారు.

ఆచార్యాః పితరః పుత్రా

[మార్చు]

ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, అలాగే తాతలూ, మేనమామలూ, మామలూ, మనుమలూ, బావమరుదులూ, వియ్యంకులూ మొదలైన వారు.

ఏతాన్న హన్తుమిచ్ఛామి

[మార్చు]

మధుసూదనా; నేను చంపబడినప్పటికీ, త్రిలోక అధిపత్యానికైనా వీరిని చంపడానికి ఇష్టపడను. ఇక భూలోక రాజ్యం కోసం చంపుతానా?

నిహత్య ధార్తరాష్ట్రాన్నః

[మార్చు]

జనార్ధనా! ధృతరాష్ట్ర కుమారులను చంపడం వలన మనకి ఏమి సంతోషం కలుగుతుంది?ఆతతాయులను చంపినా మనకి పాపమే వస్తుంది.

తస్మాన్నార్హా వయం హన్తుం

[మార్చు]

అందువలన బంధు సమేతులైన దార్తరాష్ట్ర పుత్రులను చంపడం తగదు. మన వాళ్ళను చంపడం వలన మనం ఎలా సుఖపడ గలము.

యద్యప్యేతే న పశ్యన్తి

[మార్చు]

లోభంచేత తెలివి తప్పిన వీళ్ళు కులక్షయం వలన కలిగే దోషాన్ని, మిత్ర ద్రోహం వలన కలిగే పాపాన్ని చూడలేక పోయినప్పటికీ,

కథం న జ్ఞేయమస్మాభిః

[మార్చు]

జనార్ధనా! కులక్షయం వలన ఏర్పడే దోషాన్ని తెలిసిన మనం ఈ పాపం నుండి ఎందుకు తొలగ కూడదు?

కులక్షయే ప్రణశ్యన్తి

[మార్చు]

కులక్షయం వలన సనాతనమైన ధర్మం నశిస్తుంది. ధర్మం నశించినపుడు యావత్కులం అధర్మం వైపు తిరుగుతుంది.

అధర్మాభిభవాత్కృష్ణ

[మార్చు]

కృష్ణా! అధర్మం వ్యాపించడంతో కులస్త్రీలు చెడిపోతారు. కులస్త్రీలు చెడితే వర్ణసంకరం ఏర్పడుతుంది.

సంకరో నరకాయైవ

[మార్చు]

సాంకర్యం వలన కులానికి, కులాన్ని నాశనం చేసినవారికి నరకమే గతి. వీరి పితరులు పిండోదక క్రియలు లేక నరకంలో పడతారు.

దోషైరేతైః కులఘ్నానాం

[మార్చు]

వర్ణసంకరానికి కారకులైన కులనాశకుల ఈ దోషాల వలన శాశ్వతమైన జాతి ధర్మాలు, కులధర్మాలు పెకలింప బడతాయి.

ఉత్సన్నకులధర్మాణాం

[మార్చు]

జనార్ధనా కులధర్మాలు తొలగిపోయిన మనుష్యులు కలకాలం నరక వాసులౌతారని విన్నాము.

అహో బత మహత్పాపం

[మార్చు]

అకటా! రాజ్య సుఖం కోసం స్వజనాన్ని వధించడాఇకి సిద్ధమైన మనం ఎంతటి మహాపాపానికి ఒడి గట్టుతున్నాము.

యది మామప్రతీకారమశస్త్రం

[మార్చు]

ప్రతీకారం చేయక నిరాయుధడనై ఉన్న నన్ను శస్త్రాలు చేపట్టి కౌరవులు యుద్ధంలో నన్ను చంపినా, దానివలన ఎక్కువ నాకు మేలే జరుగుతుంది.

ఏవముక్త్వార్జునః సంఖ్యే

[మార్చు]

సంజయుడు ఇలాపలికాడు; అర్జునుడు ఇలా పలికి శోకంతో నిండి ఉన్న మనస్సుతో యుద్ధభూమిలో బాణాలతో సహా ధనస్సుని వదిలి రధం వెనుక భాగంలో కూర్చున్నాడు.


భగవద్గీత - తెలుగు అనువాదము




భగవద్గీత సంస్కృతము (శ్లోకములు)
అథ ప్రథమోऽధ్యాయః | అథ ద్వితీయోऽధ్యాయః | అథ తృతీయోऽధ్యాయః | అథ చతుర్థోऽధ్యాయః | అథ పఞ్చమోऽధ్యాయః | అథ షష్ఠోऽధ్యాయః | అథ సప్తమోऽధ్యాయః | అథాష్టమోऽధ్యాయః | అథ నవమోऽధ్యాయః | అథ దశమోऽధ్యాయః | అథైకాదశోऽధ్యాయః | అథ ద్వాదశోऽధ్యాయః | అథ త్రయోదశోऽధ్యాయః | అథ చతుర్దశోऽధ్యాయః | అథ పఞ్చదశోऽధ్యాయః | అథ షోడశోऽధ్యాయః | అథ సప్తదశోऽధ్యాయః | అథాష్టాదశోऽధ్యాయః | గీతా మహాత్మ్యము
భగవద్గీత - తెలుగు అనువాదము
అర్జునవిషాద యోగము | సాంఖ్య యోగము | కర్మ యోగము | జ్ఞాన యోగము | కర్మసన్యాస యోగము | ఆత్మసంయమ యోగము | జ్ఞానవిజ్ఞాన యోగము | అక్షరపరబ్రహ్మ యోగము | రాజవిద్యారాజగుహ్య యోగము | విభూతి యోగము | విశ్వరూపసందర్శన యోగము | భక్తి యోగము | క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము | గుణత్రయవిభాగ యోగము | పురుషోత్తమప్రాప్తి యోగము | దైవాసురసంపద్విభాగ యోగము | శ్రద్దాత్రయవిభాగ యోగము | మోక్షసన్యాస యోగము | గీతా మహాత్మ్యము