అక్షరపరబ్రహ్మ యోగము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


భగవద్గీత - తెలుగు అనువాదము (అక్షరపరబ్రహ్మ యోగము)
కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం[మార్చు]

అర్జునుడిలా ఆడిగాడు: - పురుషోత్తమా! ఆ బ్రహ్మ ఏది?ఆధ్యాత్మం ఏది?కర్మ అంటే ఏమిటి?అధి భూతమని దేనిని అంటారు?ఆది దైవతమని దేనిని అంటారు.

అధియజ్ఞః కథం[మార్చు]

మధుసూధనా! ఈ శరీరంలో ఎలా ఉన్నాడు?నిగ్రహ వంతులచేత మరణ సమయంలో నీవు ఎలా తెలియ బడతావు.

అక్షరం బ్రహ్మ పరమం[మార్చు]

శ్రీ కృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు: - పరమైనదీ బ్రహ్మము. ఆయన యొక్క స్వభావము ఆధ్యాత్మ మనబడుతుంది. జీవరాశిని పుట్టించే సృష్టి కార్యమునే కర్మ అంటారు.

అధిభూతం క్షరో భావః[మార్చు]

నర శ్రేష్టుడా! నశించి పోయే తత్వం ఆది భూతం. జీవుడు ఆధి దైవతం. జీవుళ్ళలో ఆధి యజ్ఞుణ్ణి నేనే.

అన్తకాలే చ మామేవ[మార్చు]

అంతకాలంలో కూడా నన్నే స్మరించుకుంటూ ఎవరు శరీరాన్ని వదిలి వెళుతున్నారో, అతడు నాతత్వాన్నే పొందుతాడు. ఇందులో సందేహంలేదు.

యం యం వాపి స్మరన్భావం[మార్చు]

కుంతీ కుమారా మరణ సమయంలో ఏవిషయాన్ని స్మరిస్తూ కళేబరాన్ని వదులుతారో, నిత్యమూ ఆ విషయాన్నే తలచుకోవడం చేత దానినే పొందుతారు.

తస్మాత్సర్వేషు కాలేషు[మార్చు]

అందుచేత నువ్వు అన్ని కాలాలలోనూ నన్నే స్మరించు, యుద్ధం చెయ్యి. మనో బుద్ధులను నాకు సమర్పించిన చిన నీవు నన్నే పొందుతావు. ఈ విషయంలో సందేహం లేదు.

అభ్యాసయోగయుక్తేన[మార్చు]

అర్జునా అభ్యాస యోగంతో కూడుకొని మనస్సు ఇతర విషయాలకు పోనప్పుడు, నిరంతర చింతన వలన దివ్యమైఅన పరమ పురుషుణ్ణి చేరుకుంటావు.

కవిం పురాణమనుశాసితార[మార్చు]

సర్వజ్ఞుడు, సనాతనుడు, శాసకుడు, సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు, అందరిని భరించే వాడు, చింతించడానికి అలవికాని రూపం కల వడూ, సూర్యుని వలె తేజో వంతుడూ, తపస్సుకి అతీతమైన వాడూ, అయిన పురుషుణ్ణి ఎవరు నిత్యమూ ధ్యానిస్తారో,

ప్రయాణకాలే మనసాచలేన[మార్చు]

అతడు ప్రాణం వదిలి పోయే సమయంలో చలించని మనసుతో, భక్తిని కలిగి ఉండి, యోగ బలంతో, ప్రాణాన్ని కనుబొమల మధ్య చక్కగా నిలిపి దివ్య మైన ఆపరమ పురుషుణ్ణి చేరుకుంటారు.

యదక్షరం వేదవిదో వదన్తి[మార్చు]

వేదవేత్తలు దేనిని నాశనం లేనిదిగా చెబుతారో, రాగ రహితులైన రచయితలు దేనిని చేరుకుంటారో, దేనిని కోరి బ్రహ్మచర్యంలో చరిస్తారో ఆ పదాన్ని నీకు సంగ్రహంగా చెబుతాను.

సర్వద్వారాణి సంయమ్య మనో[మార్చు]

ఇంద్రియ ద్వారాలన్ని నిరోధించి, మనసును ఆత్మలో నిలిపి, శిరస్సులో తన ప్రాణశక్తిని నిలబెట్టి యోగ నిష్టని అవలంబించాలి.

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ[మార్చు]

బ్రహ్మ వాచకమైన ఓం అనే ఏకాక్షరాన్ని ఉచ్చరిస్తూ, ఎప్పుడూ నన్ను స్మరిస్తూ, ఎవరు శరీరం విడిచి పెడతారో అతడు పరమ గతిని చేరుకుంటాడు.

అనన్యచేతాః సతతం[మార్చు]

అర్జునా మనస్సు ఇతర విషయాలవైపు వెళ్ళ నీయకుండా, నిత్యమూ, నిరంతరమూ నన్ను ఎవరు స్మరిస్తారో నిత్య యుక్తుడైన ఆ యోగికి నేను సులభుణ్ణి.

మాముపేత్య పునర్జన్మ[మార్చు]

పరమ పదమైన నామోక్ష పదాన్ని పొందిన మహాత్ములు, దుఃఖానికి ఉనికి పట్టూ, అశాశ్వతమూ అయిన పునర్జన్మని పొందరు.

ఆబ్రహ్మభువనాల్లోకాః[మార్చు]

అర్జునా! బ్రహ్మ లోకం వరకూ అన్ని లోకాలూ తిరిగి వచ్చేవే (పునర్జన్మను ఇచ్చేవే). నన్ను చేరితే మాత్రం పునర్జన్మ ఉండదు.

సహస్రయుగపర్యన్తమహర్యద్బ్రహ్మణో[మార్చు]

వేయి మహా యుగాలు బ్రహ్మకు ఒక పగటి కాలం. వేయి మహా యుగాలు బ్రహ్మకుఒక రాత్రి కాలం. ఇది తెలిసిన వారు అహో రాత్రుల గురించి తెలిసిన వారు.

అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః[మార్చు]

బ్రహ్మ దేవునుని పగటి కాలంలో అవ్యక్తములో నుండి చరాచర వస్తు జాలమంతా జనిస్తుంది. రాత్రి కాగానే అవ్యక్తమన బ్రహ్మము లోనే అంతా లీనమై పోతుంది.

భూతగ్రామః స ఏవాయం[మార్చు]

అర్జునా ఈ జీవ సముదాయమే కర్మ వశంగా అనేక జన్మలు ఎత్తుతూ (బ్రహ్మకు)రాత్రికాగానే నశిస్తుంది.

పరస్తస్మాత్తు భావోऽన్యోऽవ్యక్తోऽవ్యక్తాత్సనాతనః[మార్చు]

ఆ అవ్యక్త ప్రకృతికంటే, భిన్నమూ, ఉత్తమమూ, ఇంద్రియాలకు గోచరం కానిదీ, సనాతనమూ అయిన భావం(పరమాత్మ)ప్రాణులన్నీ నశించినా నశించకుండా ఉంటుంది.

అవ్యక్తోऽక్షర ఇత్యుక్తస్తమాహుః[మార్చు]

ఇంద్రియాలకు గోచరం కానిదీ, నాశనం లేనిదీ, అని చెప్ప బడిన ఆ పరమాత్మ భావమేచేరవలసిన ఉత్తమ మార్గమని ౠషులు చెబుతారు. దేనిని పొందితే ప్రాణులు జన్మించరో అదే, ఆ సర్వోత్తమ స్థానమే నేను.

పురుషః స పరః పార్థ భక్త్యా[మార్చు]

అర్జునా ఎవనిలో అన్ని ప్రాణులు ఉన్నాయో, ఎవరు అంతటా వ్యాపించి ఉన్నారో ఆ పరమ పురుషుడు అనన్య భక్తి వలననే లభిస్తాడు.

యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం[మార్చు]

భరతకుల శ్రేష్టుడా! ఏకాలంలో శరీరం వదిలి వెళ్ళిన యోగులు తిరిగి జన్మించరో. ఏ కాలంలో శరీరం విడిచి వెళ్ళిన యోగులు తిరిగి జన్మిస్తారో, ఆ కాలం గురించి చెబుతాను విను.

అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా[మార్చు]

అగ్ని, పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణం ఆరు నెలలుఅనే మార్గంలో బ్రహ్మ విధులు బ్రహ్మను చేరుకుంటారు.

ధూమో రాత్రిస్తథా కృష్ణః[మార్చు]

పొగ, రాత్రి, కృష్ణపక్షం ఆరు నెలలు దక్షిణాయనం అనే మార్గంలో ప్రయాణించిన యోగి చంద్రుని జ్యోతిని పొంది తిరిగి వస్తాడు.

శుక్లకృష్ణే గతీ హ్యేతే[మార్చు]

జగత్తులో శుక్ల, కృష్ణ అనే ఈరెండు మార్గాలు శాశ్వతం అని భావించబడుతున్నాయి. మొదటి దానివలన పునర్జమ కలగదు. రెండవ దాని వలన కలుగుతుంది.

నైతే సృతీ పార్థ జానన్యోగీ[మార్చు]

పార్ధా ఈ రెండు మార్గాలను ఎరిగిన ఏ యోగీ భ్రమించడు. అందుచేత అన్ని కాలాలలోను నీవు యోగయుక్తుడివి కా.

వేదేషు యజ్ఞేషు[మార్చు]

వేదాలు, యజ్ఞాలు, తపస్సులుదానాలలో ఏ పుణ్య ఫలం చెప్ప బడినదో దానినంతటిని ఇది అధిగమిస్తుంది. దీని ఎరిగిన యోగి ప్రధానమైన పరమమైన స్థానాన్ని అందుకుంటాడు.భగవద్గీత - తెలుగు అనువాదము
భగవద్గీత సంస్కృతము (శ్లోకములు)
అథ ప్రథమోऽధ్యాయః | అథ ద్వితీయోऽధ్యాయః | అథ తృతీయోऽధ్యాయః | అథ చతుర్థోऽధ్యాయః | అథ పఞ్చమోऽధ్యాయః | అథ షష్ఠోऽధ్యాయః | అథ సప్తమోऽధ్యాయః | అథాష్టమోऽధ్యాయః | అథ నవమోऽధ్యాయః | అథ దశమోऽధ్యాయః | అథైకాదశోऽధ్యాయః | అథ ద్వాదశోऽధ్యాయః | అథ త్రయోదశోऽధ్యాయః | అథ చతుర్దశోऽధ్యాయః | అథ పఞ్చదశోऽధ్యాయః | అథ షోడశోऽధ్యాయః | అథ సప్తదశోऽధ్యాయః | అథాష్టాదశోऽధ్యాయః | గీతా మహాత్మ్యము
భగవద్గీత - తెలుగు అనువాదము
అర్జునవిషాద యోగము | సాంఖ్య యోగము | కర్మ యోగము | జ్ఞాన యోగము | కర్మసన్యాస యోగము | ఆత్మసంయమ యోగము | జ్ఞానవిజ్ఞాన యోగము | అక్షరపరబ్రహ్మ యోగము | రాజవిద్యారాజగుహ్య యోగము | విభూతి యోగము | విశ్వరూపసందర్శన యోగము | భక్తి యోగము | క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము | గుణత్రయవిభాగ యోగము | పురుషోత్తమప్రాప్తి యోగము | దైవాసురసంపద్విభాగ యోగము | శ్రద్దాత్రయవిభాగ యోగము | మోక్షసన్యాస యోగము | గీతా మహాత్మ్యము