Jump to content

భక్తి యోగము

వికీసోర్స్ నుండి


భగవద్గీత - తెలుగు అనువాదము (భక్తి యోగము)




ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం

[మార్చు]

అర్జునుడు పలికెను - ఓ కృష్ణా! అనన్యభక్తితో పూర్వోక్తరీతిగా నిరంతరము నిన్నే భజించుచు, ధ్యానించుచు, పరమేశ్వరుడవైన నీ సగుణ రూపమును ఆరాధించువారును, కేవలము అక్షరుడవగు సచ్చిదానంద ఘననిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంతభక్తిభావంతో సేవించువారును కలరు. ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగవిదులెవరు?

మయ్యావేశ్య మనో యే

[మార్చు]

శ్రీ భగవానుడు ఇట్లనెను - పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై, నిరంతరము నా భజనధ్యానాదులయందే నిమగ్నులై, అత్యంతశ్రద్దాభక్తులతో నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు - అని నా అభిప్రాయము.(వారు సగుణోపాసన లేదా నిర్గుణోపాసన లలొ ఏది ఐనను అనుసరించవచ్చు)

యే త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం

[మార్చు]

కాని ఇంద్రియసముదాయమును చక్కగా వశపరచుకొనినవారును, సకల భూతములకును హితమునే కోరుచుండువారును, సర్వప్రాణులను సమభావముతో చూచువారును యోగులు అనబడుదురు.

సంనియమ్యేన్ద్రియగ్రామం

[మార్చు]

అట్టివారు మనోబుద్దులకు అతీతుడును, సర్వవ్యాపియు, అనిర్వచనీయమైన స్వరూపము గలవాడును, కూటస్థుడును, నిత్యుడును, నిశ్చలుడును, నిరాకారుడును, నాశరహితుడును ఐన సచ్చిదానంద ఘనపరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావస్థితులై, ధ్యానము చేయుచు, భక్తితో భజించుచు, ఆ పరబ్రహ్మమునే పొందుదురు.

క్లేశోऽధికతరస్తేషామవ్యక్తాసక్తచేతసామ్

[మార్చు]

నిరాకార బ్రహ్మలో మనస్సు నిలిపిన వాళ్ళకు ప్రయాస ఎక్కువ. దేహధారులకు నిర్గుణ తత్వ లక్ష్యాన్ని అందుకోవడము చాలా కష్టం.

యే తు సర్వాణి కర్మాణి

[మార్చు]

సర్వకర్మలన్నీనాలో వదిలి, నన్నే లక్ష్యముగా పెట్టుకుని మనస్సుని అన్య విషయాల వైపు మరలనీయకుండా ధ్యానిస్తూ ఎవరు ఉపాసిస్తారో,

తేషామహం సముద్ధర్తా

[మార్చు]

అర్జునా నా యందే మనసు నిలిపిన వాళ్ళను త్వరలోనే మృత్యుసంసార సాగరం నుండి నేనే ఉద్ధరిస్తాను.

మయ్యేవ మన ఆధత్స్వ

[మార్చు]

నాలోనే మనసు నిలుపు బుద్ధిని నాలోనే ఉంచు. ఆ తరవాత నాలోనే నివిసిస్తావు. ఇందులో సందేహం లేదు.

అథ చిత్తం సమాధాతుం

[మార్చు]

ధనంజయా స్థిరంగా నాలో చిత్తాన్ని నిలపలేక పోయినట్లైతే, అప్పుడు అభ్యాస యోగం చేత నన్ను పొందడానికి ప్రయత్నించు.

అభ్యాసేऽప్యసమర్థోऽసి

[మార్చు]

అభ్యాసం కూడా నీవు చేయలేక పోతే, నా పరమైన కర్మలలో నిమగ్నం కా. నా కోసం కర్మలు చేసినప్పటికీ సిద్ధిని పొందుతావు.

అథైతదప్యశక్తోऽసి కర్తుం

[మార్చు]

నా కొరకై కర్మలు ఆచరించడానికి కూడా నీవు అసమర్ధుడివైతే నన్ను శరణు పొంది నీ కోసం చేసే కర్మలన్నింటినీ నాకు సమర్పించి, ఆ సమస్త కర్మల ఫలాన్ని త్యజించు.

శ్రేయో హి జ్ఞానమభ్యాసాజ్జ్ఞానాద్ధ్యానం

[మార్చు]

అభ్యాసంకంటే జ్ఞానం మేలు. జ్ఞానంకన్నా కర్మఫల త్యాగం ఎక్కువైనది. ఈ త్యాగం వలన తరవాత శాంతి(మోక్షం) కలుగుతుంది.

అద్వేష్టా సర్వభూతానాం

[మార్చు]

ఏ ప్రాణిని ద్వేషించని వాడు, అహంకార మమకారాలు లేని వాడు, సుఖదుఃఖాలలో సమంగా వ్యవహరించేవాడు, క్షమా గుణం కలవాడు,

సంతుష్టః సతతం యోగీ

[మార్చు]

నిత్యము సంతుష్టుడై , యోగియై, మనో నిగ్రహం కలవాడై, దృఢమైన నిశ్చయముతో, మనో బుద్ధులను నాకు అర్పించిన నా భక్తుడు నాకు ప్రియుడు.

యస్మాన్నోద్విజతే లోకో

[మార్చు]

ఎవరివల్ల లోకం వ్యధ చెందదో, లోకం వలన ఎవడు వ్యధ చెందడో, సంతోషం, కోపం, భయం, ఉద్వేగాల నుండి ఎవడు ముక్తుడో అతడు నాకు ప్రియుడు.

అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో

[మార్చు]

అపేక్ష లేని వాడు, శుచియైన వాడు, దక్షత కలవాడు, ఉదాసీనుడు, వ్యధలు నశించిన వాడు, అన్ని విధాలైన, కార్యాలలలో నేను చేస్తున్నాననే భావం లేనివాడు అయిన భక్తుడు నాకు ప్రియుడు.

యో న హృష్యతి న ద్వేష్టి

[మార్చు]

ఎవడు సంతోషించడో, ద్వేషించడో, శోకించడో, కాంక్షించడో , శుభాశుభాలను వదిలేస్తాడో అలాంటి భక్తుడు నాకు ప్రియుడు.

సమః శత్రౌ చ మిత్రే చ

[మార్చు]

శత్రువులు, మిత్రులు, మానావమానాలు, శీతోష్ణాలు, సుఖదుఃఖాలు వీటియందు సమంగా ఉండే వాడు సంగాన్ని విడిచే వాడు(నాకు ఇష్టుడు)

తుల్యనిన్దాస్తుతిర్మౌనీ

[మార్చు]

నిందాస్తుతులను తుల్యంగా ఎంచేవాడు, మౌనంగా ఉండే వాడు, ఉన్నదానితో సంతృప్తి పడేవాడు, నికేతనం అక్కర లేని వాడు, స్థిరమైన బుద్ధి కల భక్తుడు నాకు ప్రియుడు.

యే తు ధర్మ్యామృతమిదం

[మార్చు]

ధర్మయుక్తమూ, శాశ్వతమూ అయిన దీనిని చెప్పిన ప్రకారంగా శ్రద్ధతో, నన్ను లక్ష్యంగా పెట్టుకొని ఎవరు ఉపాసిస్తారో ఆభక్తులే నాకు పరమ ప్రియులు.



భగవద్గీత - తెలుగు అనువాదము




భగవద్గీత సంస్కృతము (శ్లోకములు)
అథ ప్రథమోऽధ్యాయః | అథ ద్వితీయోऽధ్యాయః | అథ తృతీయోऽధ్యాయః | అథ చతుర్థోऽధ్యాయః | అథ పఞ్చమోऽధ్యాయః | అథ షష్ఠోऽధ్యాయః | అథ సప్తమోऽధ్యాయః | అథాష్టమోऽధ్యాయః | అథ నవమోऽధ్యాయః | అథ దశమోऽధ్యాయః | అథైకాదశోऽధ్యాయః | అథ ద్వాదశోऽధ్యాయః | అథ త్రయోదశోऽధ్యాయః | అథ చతుర్దశోऽధ్యాయః | అథ పఞ్చదశోऽధ్యాయః | అథ షోడశోऽధ్యాయః | అథ సప్తదశోऽధ్యాయః | అథాష్టాదశోऽధ్యాయః | గీతా మహాత్మ్యము
భగవద్గీత - తెలుగు అనువాదము
అర్జునవిషాద యోగము | సాంఖ్య యోగము | కర్మ యోగము | జ్ఞాన యోగము | కర్మసన్యాస యోగము | ఆత్మసంయమ యోగము | జ్ఞానవిజ్ఞాన యోగము | అక్షరపరబ్రహ్మ యోగము | రాజవిద్యారాజగుహ్య యోగము | విభూతి యోగము | విశ్వరూపసందర్శన యోగము | భక్తి యోగము | క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము | గుణత్రయవిభాగ యోగము | పురుషోత్తమప్రాప్తి యోగము | దైవాసురసంపద్విభాగ యోగము | శ్రద్దాత్రయవిభాగ యోగము | మోక్షసన్యాస యోగము | గీతా మహాత్మ్యము