జ్ఞానవిజ్ఞాన యోగము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


భగవద్గీత - తెలుగు అనువాదము (జ్ఞానవిజ్ఞాన యోగము)
మయ్యాసక్తమనాః[మార్చు]

శ్రీ కృష్ణ భగవానుడు ఇలా పలికాడు :- నాలో మనస్సును లగ్నం చేసి,యోగాన్ని అభ్యసిస్తూ నన్ను ఆశ్రయించి,నిస్సశయంగా,క్షుణ్ణంగా ఎలా తెలుసుకో గలవో దానిని గురించి వినుము.

జ్ఞానం తేऽహం సవిజ్ఞానమిదం[మార్చు]

అనుభవంతో కూడిన శాస్త్ర పరిజ్ఞానాన్ని నీకు పూర్తిగా చెబుతాను.దీనిని తెలుసుకున్నాక నీకు వేరే తెలుసుకోవలసినది ఏమీ ఉండదు.

మనుష్యాణాం సహస్రేషు[మార్చు]

వేలాది మనుష్యులలో ఏ ఒక్కరో మోక్షసిద్ధి కోసం ప్రయత్నిస్తారు.అలా ప్రయత్నించే సిద్ధులలో కూడా ఏ ఒక్కరో నన్ను యదార్ధంగా తెలుసుకుంటారు.

భూమిరాపోऽనలో వాయుః[మార్చు]

భూమి,నీరు,అగ్ని,వాయువు,ఆకాశం మరియు మనస్సు బుద్ధి,అహంకారం అని నా ప్రకృతి ఎనిమిది విధాలుగా ఉన్నది.

అపరేయమితస్త్వన్యాం[మార్చు]

ఓ మహానుభాహుడా! ఇది అల్పమైనది.ఇంతకన్నా వేరై జీవుడిగా మారినదీ నా పరమైన ప్రకృతి అని తెలుసుకో.దాని వలననే ఈ జగత్తు భరించబడుతుంది.

ఏతద్యోనీని భూతాని[మార్చు]

ఈ నా ప్రకృతి అన్ని ప్రాణులకీ మూలమని తెలుసుకో.యావత్తు జగత్తు యొక్క ఉత్పత్తి,నాశనములకు మూలము నేనే అని తెలుసుకో.

మత్తః పరతరం నాన్యత్కించిదస్తి[మార్చు]

ధనుంజయా! నాకన్నా ఎక్కువైనదీ ఏదీలేదు.జగత్తు యావత్తు దారంలో మణులవలె నాలో గుచ్చబడి ఉన్నది.

రసోऽహమప్సు కౌన్తేయ[మార్చు]

కౌంతేయా! నేను నీటిలోని రుచిని సూర్యచంద్రులలోని వెలుగును,వేదాలలోని ఓంకారాన్ని,ఆకాశంలో ఉన్న శబ్ధ గుణాన్ని.మానవులలోని పట్టుదలను.

పుణ్యో గన్ధః పృథివ్యాం[మార్చు]

నేను పృథ్విలోని వాసనని.అగ్నిలోని వేడిని.జీవుళ్ళలోని ప్రాణాన్ని.తపస్సు చేసేవారిలో తపస్సుని.

బీజం మాం సర్వభూతానాం[మార్చు]

అర్జునా అందరి జీవులలో సనాతన బీజాన్ని నేను అని తెలుసుకో.బుద్ధిమంతుల లోని తెలివిని.ప్రతిభా వంతుల లోని ప్రతిభని నేను.

బలం బలవతాం చాహం[మార్చు]

ఓ భరతశ్రేష్టుడా! బలవంతులలోని కామరాగాలు లేని బలాన్ని నేను.జీవులలో ధర్మ విరుద్ధం కాని కామాన్ని నేను.

యే చైవ సాత్త్వికా[మార్చు]

ఇంకా ఏవి తామసిక,రాజసిక,సాత్విక భావాలో అవన్నీ నా వలన వస్తాయని గ్రహించు.అయితే నేను వాటిలో లేను అవినాలో ఉన్నాయి.

త్రిభిర్గుణమయైర్భావైరేభిః[మార్చు]

మూడుగుణాలలతో నిండి ఉన్న ఈభావాల చేత ప్రపంచం యావత్తూ బ్రాంతిలో పడి,వీటికన్నా అతీతమూ,అవ్యయమూ అయిన నన్ను గుర్తించలేదు .

దైవీ హ్యేషా గుణమయీ[మార్చు]

దివ్యమైన,త్రిగుణాలతో కూడిన నా ఈ మాయ దాట రానిది.నన్నే ఎవరు సేవిస్తారో వారు ఈ మాయని దాట గలరు.

న మాం దుష్కృతినో[మార్చు]

దుర్మార్గులు , మూఢులు ,మాయ చేతజ్ఞానం నశించిన వారు,అసురభావాన్ని ఆశ్రయించిన వారు ఐన నరాధములు నన్ను సేవించరు.

చతుర్విధా భజన్తే మాం[మార్చు]

భరత కుల శ్రేష్టుడైన ఓ అర్జునా! ఆర్తుడూ,జిజ్ఞాసువూ,అర్ధార్ధీ,జ్ఞాని అనే నాలుగు రకాల పుణ్యాత్ములు నన్ను సేవిస్తారు.

తేషాం జ్ఞానీ నిత్యయుక్త[మార్చు]

ఈ నలుగురిలో నిత్యము నాతో కూడి పరమాత్మనైన నాయందు మాత్రమే భక్తి కలిగి ఉండే జ్ఞాని శ్రేష్టుడు.అటువంటి వాడికి నేను ఎక్కువ ప్రియుణ్ణి.అతడే నాకు కూడా ఇష్టుడు.

ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ[మార్చు]

వీరందరూ ఉదారులే.జ్ఞాని మాత్రం నాస్వరూపమని నా అభిప్రాయము .ఎందుకంటే అతడే సర్వోత్తమైన గతి అయిన నన్నే ఆశ్రయించి ఉంటాడు.

బహూనాం జన్మనామన్తే[మార్చు]

అనేక జన్మల తరువాత నరుడు జ్ఞాన వంతుడై సర్వమూ వాసుదేవుడని నన్ను కొలుస్తాడు.అలాంటి మహాత్ముడు చాలా అరుదుగా ఉంటాడు

కామైస్తైస్తైర్హృతజ్ఞానాః[మార్చు]

తన సహజ స్వభావానికి లోనై ఆయా కోరికల వలన జ్ఞానం హరించుకు పోగా ఆయా నియమాలని పాటిస్తూ వారు ఇతర దేవతలను ఆరాధిస్తారు.

యో యో యాం యాం[మార్చు]

ఏయే భక్తుడు ఏయే రూపంలో భగవంతుడిని శ్రద్ధతో ఆరాధించాలని కోరతాడో ఆయా భక్తునికి ఆయాదేవతయందే అచంచలమైన శ్రద్ధని నేను కలిగిస్తాను.

స తయా శ్రద్ధయా[మార్చు]

అతడు శ్రద్ధతో కూడుకొని ఆరూపాన్ని ఆరాధించ సాగుతాడు.నాచే ప్రసాదింప బడిన ఆ కోరికలను,తాను ఆరాధించిన దేవతారూపంద్వారా పొందుతాడు .

అన్తవత్తు ఫలం తేషాం[మార్చు]

అల్ప బుద్ధులైన వారికి లభించే ఫలం నశించి పోయేదిగా ఉంటుంది.దేవతలను ఆరాధించేవారు దేవతలను చేరుతారు,నన్ను ఆరాధించేవారు నన్ను చేరుతారు.

అవ్యక్తం వ్యక్తిమాపన్నం[మార్చు]

పరమము,సర్వశ్రేష్టమునైన నా స్వభావం ఎరుగని,తెలివి తక్కువ వాళ్ళు ఇంద్రియాలకు గోచరంకాని పరిమితమైన రూపంగా భావిస్తారు.

నాహం ప్రకాశః సర్వస్య[మార్చు]

యోగమాయ చేత ఆవరింపబడి ఉన్న నేను అందరికి కనపడను.నన్ను ఈ మూఢ లోకం పుట్టుకా నాశనం లేనివాణ్ణిగా తెలుసుకో లేదు.

వేదాహం సమతీతాని[మార్చు]

నేను గతించిన జీవులను,ఇప్పుడు ఉన్నవాళ్ళనూ,ముందు పుట్టబోయే వారినీ ఎరుగుదును.నన్ను మాత్రం ఎవరూ ఎరుగరు.

ఇచ్ఛాద్వేషసముత్థేన[మార్చు]

పరంతపా! అర్జునా! రాగద్వేషాల నుండి జనించే ద్వంద్వాల మోహం వలన పుట్టుకతోనే అన్ని జీవులూ భ్రాంతిని పొందుతున్నాయి.

యేషాం త్వన్తగతం పాపం[మార్చు]

పుణ్య కర్మల వలన ఏజనులయొక్క పాపం అంత మైనదో,వాళ్ళు,ద్వంద్వ మోహాలనుండి పూర్తిగా విముక్తులై చెదరని దీక్షతో నన్ను కొలుస్తారు.

జరామరణమోక్షాయ[మార్చు]

జరా మరణాల నుండి విడుదల కావాలని ఎవరు నన్ను ఆశ్రయించి సాధన చేస్తారో వాళ్ళు సంపూర్ణంగా ఆ బ్రహ్మమూ ఆత్మ తత్వాన్ని యావత్తు కర్మనీ తెలుసుకుంటారు.

సాధిభూతాధిదైవం మాం[మార్చు]

ఆధి భూతంతో,ఆధిదైవంతో,ఆధియజ్ఞంతో కూడిన వానిగా నన్ను ఎవరు తెలుసుకుంటారో వాళ్ళుమనస్సు వశంలో ఉంచుకుని ప్రాణ ప్రయాణ కాలంలోకూడా నన్ను గుర్తుంచుకుంటారు.భగవద్గీత - తెలుగు అనువాదము
భగవద్గీత సంస్కృతము (శ్లోకములు)
అథ ప్రథమోऽధ్యాయః | అథ ద్వితీయోऽధ్యాయః | అథ తృతీయోऽధ్యాయః | అథ చతుర్థోऽధ్యాయః | అథ పఞ్చమోऽధ్యాయః | అథ షష్ఠోऽధ్యాయః | అథ సప్తమోऽధ్యాయః | అథాష్టమోऽధ్యాయః | అథ నవమోऽధ్యాయః | అథ దశమోऽధ్యాయః | అథైకాదశోऽధ్యాయః | అథ ద్వాదశోऽధ్యాయః | అథ త్రయోదశోऽధ్యాయః | అథ చతుర్దశోऽధ్యాయః | అథ పఞ్చదశోऽధ్యాయః | అథ షోడశోऽధ్యాయః | అథ సప్తదశోऽధ్యాయః | అథాష్టాదశోऽధ్యాయః | గీతా మహాత్మ్యము
భగవద్గీత - తెలుగు అనువాదము
అర్జునవిషాద యోగము | సాంఖ్య యోగము | కర్మ యోగము | జ్ఞాన యోగము | కర్మసన్యాస యోగము | ఆత్మసంయమ యోగము | జ్ఞానవిజ్ఞాన యోగము | అక్షరపరబ్రహ్మ యోగము | రాజవిద్యారాజగుహ్య యోగము | విభూతి యోగము | విశ్వరూపసందర్శన యోగము | భక్తి యోగము | క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము | గుణత్రయవిభాగ యోగము | పురుషోత్తమప్రాప్తి యోగము | దైవాసురసంపద్విభాగ యోగము | శ్రద్దాత్రయవిభాగ యోగము | మోక్షసన్యాస యోగము | గీతా మహాత్మ్యము