సాహిత్య మీమాంస

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సాహిత్య మీమాంస

శ్రీ పండిత రామదహినమిశ్ర కావ్యతీర్థుని

హిందీ గ్రంథమునకు తెనుగు.

గ్రంథకర్త:

శ్రీపాద కామేశ్వరరావు

ప్రకాశకుడు:

చెఱకువాడ వేంకటరామయ్య

అభినవాంధ్ర గ్రంథమాలా కార్యాలయము

రాజమండ్రి

1926

All rights reserved

మేలుప్రతి 1-8-0
సాదాప్రతి 1-4-0Printed By

A. LAKSHMANASWAMY NAIDU

at THE SARASWATHI POWER PRESS,

RAJAHMUNDRY.

పీఠిక

ఆంధ్రవాఙ్మయమున సాహిత్యవిమర్శనపద్ధతుల వివరించు గ్రంథములు చాలా తక్కువ. విమర్శకులకు కొదవ లేదు, గానీ ఏ నియమముల ననుసరించి గ్రంథముల మంచి చెడ్డలు నిర్ణయించవలెనో ఉదాహరణములతో చర్చించే గ్రంథములు తగినన్ని లేవు; ప్రాచ్యప్రతీచ్యాదర్శముల తార తమ్యము కన్పర్చున వసలే లే వనవచ్చును.

అట్టి గ్రంథమును రచించవలె నను కోరిక మా మదిలో రూఢమైన పిమ్మట బొంబాయి హిందీగ్రంథరత్నాకరసంపాదకు లీ గ్రంథమును ప్రచురించిరి. తోడనే దీనిని తెనుగుచేయ సంకల్పించి వారి అనుమతి వేడగా అచిరకాలమున వారనుజ్ఞ నిచ్చినందుకు వారికి చిరకృతజ్ఞులము.

ఈ గ్రంథమునకు మూలము శ్రీయుత పూర్ణచంద్రవసు గారిచే "సాహిత్యచింత" అను పేర వంగభాషలో వ్రాయబడెను. దానిని కొంత కుదించి మరికొంత పెంచి శ్రీమాన్ పండిత రామదహినమిశ్ర, కావ్యతీర్థులు హిందీబాష ననువదించిరి. మేము దీనిని కొంచెము పెంచి తెనుగు జేసితిమి.

శ్రీయుత వసుగారి అభిప్రాయము లందరికీ నచ్చక పోవచ్చును, కాని వారు చర్చించిన విషయములు ముఖ్యము లనుట సర్వజనసమాదరణీయము. మన సనాతనధర్మమందు విధింపబడిన ఆదర్శములు, ఆచార వ్యవహారములున్నూ పాశ్చాత్యాదర్శాచారవ్యవహారములతో పోల్చి చర్చించడము ప్రస్తుతమున అత్యావశ్యకము-ఏలయన పాశ్చాత్యాచారముల తోటి సంసర్గము మన కనుదినమూ హెచ్చూతూంది. అవి కొత్త వౌటచేత షేక్స్‌పియరు చెప్పినట్లు -

...............................................New customs

Though they be never so ridiculous,

Nay, let' em be unmanly, yet are followed,

అనుసరింపబడు నూత్నాచార మపహ

సనకరము నపౌరుషంబును సైన.

ఉభయ జాతుల బాగోగు లీగ్రంథమున కొంతవరకూ వివరింపబడినవి కావున చదువరులదృష్టి మన సనాతనధర్మ వాఙ్మయముల దెస కాకర్షింపబడి మన ఆత్మగౌరవము, ఉన్న తాదర్శములు, అధ్యవసాయము, దేశభక్తి భాషాభిమానమూ ఏ మాత్రమైనా వృద్ధిపొంది, యోగ్య విమర్శజ్ఞానము ఆంధ్రుల కలవడితే మా యత్నము సఫలమవుతుంది.

పద్యములను తర్జుమా చేసేటప్పుడు కొంద రాంధ్ర కవుల అనువాదము లిం దుల్లేఖించినాము; ఈ విషయమున బ్రహ్మశ్రీ ఆదిభట్ట నారాయణదాసుగారి "నవరస తరంగిణి" మా కమితోపకారి యైనది. షేక్స్‌పియరు పద్యముల ననువ దించుట సాధారణప్రజ్ఞావంతులకు సాధ్యము కాదు. దాసు గారికిన్నీ తదితరకవులకున్నూ మేము వందనము లర్పిస్తూన్నాము.

ఈ గ్రంథమున కొన్ని వ్యావహారిక పదములు యథేచ్ఛముగా వాడినాము. అవి సత్కవులు వాడినవి కావున ప్రయోగాహన్‌ములని అచిరకాలమున రుజువు కా గలదు.

చివర నున్న పట్టిక ప్రకారము సవరణలు చేసుకొందురు గాక !

ప్రకాశకుడు.

Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf

విషయసూచిక

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
1

సాహిత్యము ... 1. కావ్యము ... 2. లక్షణము, లక్ష్యము ... 3. సాహిత్యమునకు జాతికిని సంబంధము ...

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
7

ఆర్యసాహిత్య ప్రకృతి ... 1. ఆర్యాంగ్లేయ సాహిత్యములు...5. మానవ ప్రకృతి - షేక్స్‌పియర్...7. ప్ర్రాచ్యపాశ్చాత్యకవుల సృష్టిభేదము...10. ఆర్యసాహిత్యమున సృష్టిసంపూర్ణత...15. పుణ్యాదర్శముల ఆవశ్యకత, ఉత్కర్ష...19. సాహిత్యమున అలౌకికసాధన...21. సాహిత్యమున రసక్షేత్రములు...28. సాహిత్యమున వీరత్వము...31. సాహిత్యమున దేవత్వము...33.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
37

రక్తపాతముగురించి అలంకారికుల మతము...37. నాటక రంగస్థలమున రక్తపాతము...42. హిందువుల ఆదర్శము...43. యూరోపీయ వియోగాంత నాటకముల ఉత్పత్తి, ప్రకృతి...44. వాటిని చదివిన ఫలము...47. ఆర్యసాహిత్యమందలి వియోగాంతము రక్తపాత శూన్యము...50. హత్యయందు బీభత్స సంచారము...52. వియోగాంతమా, కసాయికొట్టా...53. రక్తపాతము, విదేశీయ రుచులు...54. వియోగాంత నాటకముల దుష్పరిణామము...60. ఆంగ్లసాహిత్యమందు పక్షపాతము...61.నాటక పర్యవసానము...62. పార్సీనాటక సంఘములు,

వాటి రంగస్థల స్థితి...65. మహాభారతము, శ్రీమద్రామాయణమూ చదివిన ఫలము...66.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
69

సీతాదేవి ప్రేమ...68. రాధా ప్రేమ...72. సీతప్రేమయందలి ఐకాంతికము...73. సతీత్వ గౌరవము...76. పురాణ శ్రవణము, కథలు...78. వ్రతములు, నోములు, దృష్టాంతములు...79. సాహిత్యమున పాతివ్రత్యము...81. ప్రాచీన భారతవర్షమున స్వేచ్ఛాచరణము...83. ఆత్యసతి పవిత్రత...84. ఆత్మోత్సర్గము...85. పతి ప్రేమనుండి విశ్వపతి ప్రేమ...86.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
88

సతీప్రేమ-కామానురాగము, ప్రేమ...88. ఆర్యసాహిత్యమున కామము...94. సఖ్యప్రేమ...98. పాశ్చాత్య ప్రేమ స్వభావము...100. ప్రాచ్యపాశ్చాత్యప్రేమ చిత్రణము...106. శకుంతల, మిరాండ...110. కవిరచిత ఆదర్శ సృష్టి...114.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
116

మనుష్యత్వ నిర్వచనము...116. స్త్రీల సంయమ బలము...120. భక్తిసంయత ప్రేమ...126. హిందూకుటుంబ నియమములు...129. హిందూకుటుంబ ప్రేమ వికాసము...131. ఆర్యసాహిత్యమున శృంగారము...132. స్త్రైణ శాసనము...133. స్వాధీనత-స్వేచ్ఛావృత్తి...136. ఆర్యసాహిత్యమున ప్రేమగౌరవము...137. బాల్యవివాహముల పరిణామము...138. విదేశీయ పతిపత్నీ సామ్యభావము...140. ఆర్యసాహిత్య సమాలోచ నావశ్యకత...141.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
144

వీరుల ఆదర్శము...146. అసుర వీరత్వము...148. బ్రహ్మ క్షత్రియ వీరత్వము...153. వీరత్వమున సమరము-రక్తపాతము...157. ధర్మార్థము బలిదానము...159. వీరుని ప్రతిజ్ఞాబలము...163. రక్తపాతము లేని క్షత్రియ సత్యపాలనము...165. తక్తపాత రహిత బ్రాహ్మణ ప్రతిజ్ఞా పాలనము...167. మహాకావ్యము లందలి మూడురకముల వీరత్వము...168. ఆర్యవీరత్వ మందలి విశేషము...170. వీరుల సంపద...171. ఆదర్శ రాజ్యము...172.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
175

సతీత్వాదర్శము...175. విద్య...176. మైత్రి...179. దేవతాదర్శము...182. ఆదర్శ దంపతులు...184. ఆదర్శపతి...185. అతని లక్షణములు: - ప్రేమ మయుడు...186. ఆశుతోషుడు...188. ఆనందమయుడు...189. అవ్యభిచారి...190. ధర్మాశ్రయుడు...192. దేవతల సంసారము...193. గురుజనసేవాపరుడు...194. ధర్మాచరణుడు...197. క్షాంతుడు...198. అక్రోధుడు, అహింసాపరుడు...204. స్వర్గము...206. దేవతా చరితము...209. ఋషి చరితము...211. మానవ చరితము...212.

సవరణ పట్టిక ... 216.

________

This work is in the public domain in countries where the copyright term is the author's life plus 70 years or less.

Nuvola apps important.svg
It is not necessarily in the public domain in the United States if published from 1923 to 1977. For a US-applicable version, check {{PD-1996}} and {{PD-URAA-same-year}} for relevant use.